E-Paper
Advertisement

సరికొత్త రికార్డ్.. అత్యంత సన్నని ఫోన్‌ను లాంచ్ చేసిన టెక్నో.. ఫీచర్లు, ధర వివరాలు మీ కోసం!

సరికొత్త రికార్డ్.. అత్యంత సన్నని ఫోన్‌ను లాంచ్ చేసిన టెక్నో.. ఫీచర్లు, ధర వివరాలు మీ కోసం!
Advertisement

TECNO CAMON Slim: మొబైల్ మార్కెట్లో సరికొత్త డిజైన్లతో ఆకట్టుకునే టెక్నో సంస్థ.. తాజాగా తమ CAMON సిరీస్‌లో అత్యంత సన్నని ఫోన్‌ను ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ‘టెక్నో కామన్ స్లిమ్’ పేరుతో వచ్చిన ఈ ఫోన్ ఇప్పటికే టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేవలం 6.39 మిమీ మందం ఉన్న ఈ హ్యాండ్ సెట్ ఈ ఏడాది మిడ్‌రేంజ్ విభాగంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలవనుంది.

ఈ ఫోన్ వెనుక భాగంలో ఒక వినూత్నమైన హారిజాంటల్ కెమెరా బార్‌ను అందించారు. ఇందులో అమర్చిన రెండు రౌండ్ లైటింగ్ రింగ్స్ ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మనకు వచ్చే నోటిఫికేషన్లు, ఫోన్ కాల్స్, ఛార్జింగ్ స్టేటస్‌కు అనుగుణంగా ఇవి వెలుగుతూ భలేగా అనిపిస్తాయి. చూడటానికి ఎంతో స్టైలిష్‌గా ఉండే ఈ ఫోన్‌ను మొత్తం ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో తీసుకొచ్చారు.

Advertisement

Also Read: బడ్జెట్ ధరలో సూపర్ 5G ఫోన్లు.. కస్టమైజ్డ్ లైట్లతో ఆకట్టుకుంటున్న Ai+ Nova 2 Pro!

ఈ స్లిమ్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది రోజువారీ పనులతో పాటు సోషల్ మీడియా బ్రౌజింగ్, గేమింగ్‌కు చక్కగా సరిపోతుంది. దీనిలో 8GB RAMతో పాటు 128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్లు ఉండనున్నాయి. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైఓఎస్ 16 సాఫ్ట్‌వేర్‌తో ఈ ఫోన్ రన్ అవుతుంది.

Advertisement

ఇక కెమెరాల విషయానికి వస్తే.. దీనిలో 50MP సోనీ లైటియా మెయిన్ కెమెరాను ఇస్తున్నారు. ఇండోర్ లైటింగ్‌లో వచ్చే ఫ్లికరింగ్ (గీతలు) సమస్యను తగ్గించడానికి ప్రత్యేక ఫ్లికర్ సెన్సార్‌ను కూడా చేర్చారు. సెల్ఫీల కోసం 32MP కెమెరా ఉంది. ఇక డిస్‌ప్లే విషయానికొస్తే, 6.78 ఇంచుల అమోలెడ్ స్క్రీన్‌తో పాటు 144హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది.

ఇంత సన్నని ఫోన్‌లో పెద్ద బ్యాటరీని అమర్చడం పెద్ద సవాలే అయినప్పటికీ.. ఇందులో దాదాపు 5200mah కంటే ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీని, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందిస్తున్నారు. భారత మార్కెట్లో ఈ టెక్నో కామన్ స్లిమ్ ధర సుమారు రూ.22,999 వరకు ఉంటుంది.

Also Read: జియో, ఎయిర్‌టెల్‌కు చుక్కలు చూపిస్తున్న BSNL.. తక్కువ ధరకే నెలకు 75GB డేటా, ఫ్రీ కాల్స్!

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×