E-Paper
Advertisement

Tecno Camon 50 Ultra 5G భారత్‌లోకి వచ్చేసింది.. రూ.3,000 లాంచింగ్ ఆఫర్, ఆ తేదీ నుంచే సేల్!

Tecno Camon 50 Ultra 5G భారత్‌లోకి వచ్చేసింది.. రూ.3,000 లాంచింగ్ ఆఫర్, ఆ తేదీ నుంచే సేల్!
Advertisement

Tecno Camon 50 Ultra 5G: ప్రముఖ టెక్నో సంస్థ భారత మార్కెట్లోకి సరికొత్త ‘క్యామన్ 50 అల్ట్రా 5G’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది మునుపటి క్యామన్ 30 సిరీస్‌కు అప్‌గ్రేడ్‌గా వచ్చింది. ఈ ఫోన్ సరికొత్త ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పుడీ హ్యాండ్ సెట్ పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం..

ఈ Tecno Camon 50 Ultra 5G ఫోన్‌లో 6.78 అంగుళాల కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 144Hz రీఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ రక్షణతో వస్తుంది. కేవలం 7.75 మిమీ మందంతో ఉండే ఈ ఫోన్‌కు మిలిటరీ గ్రేడ్ బిల్డ్ క్వాలిటీతో పాటు దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ68 రేటింగ్ కూడా ఇచ్చారు.

Advertisement

Also Read: చెవులకు క్లిప్‌లా తగిలించుకోవడమే.. నథింగ్ CMF నుంచి క్రేజీ ఇయర్‌బడ్స్ వచ్చేస్తున్నాయ్!

ఫొటోగ్రఫీ ప్రియుల కోసం Tecno Camon 50 Ultra 5Gలో వెనుక వైపు మూడు కెమెరాలు ఇచ్చారు. అందులో సోనీ సెన్సార్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేసే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, మరో 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ కెమెరాను అమర్చారు.

Advertisement

ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఓఎస్‌పై ఇది రన్ అవుతుంది. దీనిలో ఏకంగా 6,500mAh భారీ బ్యాటరీని అందించారు. ఇది రెండు రోజులకు పైగా బ్యాకప్ ఇస్తుందని సంస్థ చెబుతోంది. దీనికి సపోర్ట్ చేసేలా 45W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.

భారత్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.39,999గా ఉంది. అయితే లాంచ్ ఆఫర్ కింద రూ.3,000 కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ను రూ.36,999కే సొంతం చేసుకోవచ్చు. జులై 21 నుంచి అమెజాన్ ద్వారా ఈ ఫోన్ అమ్మకానికి రానుంది. ఇది గ్రీన్, పర్పుల్, టైటానియం రంగుల్లో లభిస్తుంది.

Also Read: OnePlus 15 యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ ఒక్క అప్‌డేట్‌తో ఇక డబుల్ ధమాకా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×