E-Paper
Advertisement

టెక్నో Camon 50 Ultra 5G ఇండియా లాంచ్ డేట్ ఖరారు.. కలర్స్, స్పెసిఫికేషన్ల వివరాలు మీ కోసం!

టెక్నో Camon 50 Ultra 5G ఇండియా లాంచ్ డేట్ ఖరారు.. కలర్స్, స్పెసిఫికేషన్ల వివరాలు మీ కోసం!
Advertisement

Tecno Camon 50 Ultra 5G: ప్రముఖ టెక్నో కంపెనీ తమ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘టెక్నో Camon 50 Ultra 5G’ని భారత మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమైంది. కెమెరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ప్రీమియం డిజైన్‌కు ప్రాధాన్యత ఇస్తూ ఈ ఫోన్‌ను తీసుకువస్తున్నారు. ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది? దీని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దామా..

లాంచ్ ఎప్పుడు?

ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో జులై 17న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ ఫోన్ సేల్స్ కోసం ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఒక ప్రత్యేక పేజీని కూడా లైవ్ చేశారు. కాబట్టి.. లాంచ్ తర్వాత ఈ ఫోన్ అమెజాన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇది సైప్రస్ గ్రీన్, మిస్టీ పర్పుల్, నెబ్యులా టైటానియం రంగుల్లో లభించనుంది. ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్, వెనుక వైపు నిలువుగా ఉండే కెమెరా సెటప్‌తో ఈ ఫోన్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది.

అద్భుతమైన AI ఫీచర్లు:

Advertisement

ఈ ఫోన్‌లో ఫొటోగ్రఫీ, కంటెంట్ క్రియేషన్ కోసం సరికొత్త AI (కృత్రిమ మేధస్సు) ఫీచర్లను టెక్నో పరిచయం చేస్తోంది. దీని ద్వారా ఫొటోలను మరింత అందంగా మార్చుకోవచ్చు. అంతేకాదు.. ఫొటోల్లో మనకు నచ్చని వస్తువులు లేదా వ్యక్తులు ఉంటే వాటిని సులభంగా తొలగించేందుకు (Object Removal) ప్రత్యేక టూల్స్ దీనిలో ఉన్నాయి. స్లిమ్ డిజైన్‌తో పాటు రోజంతా నడిచేలా దీని బ్యాటరీని డిజైన్ చేశారు.

Also Read: Instagramలో మన పర్సనల్ ఫొటోలు, వీడియోలను Meta AI వాడకుండా ఎలా ఆపాలంటే?

మెరుగైన పనితీరు:

Advertisement

ఇందులో 6.78 ఇంచుల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను ఇస్తున్నారు. ఇది 144Hz రీఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 7i ని ఉపయోగించారు. అలాగే, ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్ ఆప్షన్లు ఉంటాయి. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైఓఎస్ (HiOS) పై రన్ అవుతుంది.

బ్యాటరీ సామర్థ్యం ఎంతంటే?

ఫొటోల కోసం వెనుక వైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్ కలిగిన 50MP టెలిఫోటో కెమెరా, 8M అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం 13MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్ ద్వారా 4K క్వాలిటీలో వీడియోలు రికార్డ్ చేయవచ్చు. ఇక అన్నింటికంటే ముఖ్యంగా దీనిలో 6,500mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దుమ్ము, నీటి నుండి రక్షణ కోసం దీనికి IP68, IP69 రేటింగ్స్ కూడా ఉన్నాయి.

Also Read: వావ్ అనిపించే ఫీచర్లు.. ల్యాప్‌టాప్ కొనేవారికి పండగే, అసూస్ నుంచి ఏఐ ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×