E-Paper
Advertisement

TCL Tbot for Kids: వామ్మో.. స్మార్ట్‌వాచ్ ఇక రోబోలా మారిపోతుందా? టీసీఎల్ క్రేజీ ఐడియా!

TCL Tbot for Kids: వామ్మో.. స్మార్ట్‌వాచ్ ఇక రోబోలా మారిపోతుందా? టీసీఎల్ క్రేజీ ఐడియా!
Advertisement

TCL Tbot for Kids: సాధారణంగా పిల్లలు తమ బుజ్జి బుజ్జి స్మార్ట్‌వాచ్‌లను ఆడుకోవడానికో లేదా స్కూలుకు వెళ్లినప్పుడో తెగ వాడేస్తుంటారు. అయితే స్కూలు నుంచి రాగానే ఆ వాచ్ ఛార్జింగ్ అయిపోయి మూలన పడి ఉంటుంది. ఈ గ్యాప్‌ను సద్వినియోగం చేసుకునేలా.. ప్రముఖ టెక్ సంస్థ TCL బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో Tbot అనే క్యూట్ రోబోను పరిచయం చేసింది. ఇది కేవలం ఛార్జర్ మాత్రమే అనుకుంటే పొరపాటే.. మీ పిల్లలకి ఇదొక బెస్ట్ ఫ్రెండ్ లాంటిదన్న మాట.

ఆడుతూ పాడుతూ క్రమశిక్షణ:

ఈ టీబాట్ రోబో పిల్లల దినచర్యను ఎంతో సరదాగా మార్చేస్తుంది. వాచ్‌ను ఈ రోబోకు ఉన్న మాగ్నెటిక్ డాక్‌లో పెట్టగానే ఇది యాక్టివేట్ అయిపోతుంది. ఉదయాన్నే నిద్రలేపడం దగ్గర్నుంచి, హోంవర్క్ చేసుకోవడానికి టైమర్లు సెట్ చేయడం వరకు అన్ని పనులను ఇది దగ్గరుండి చూసుకుంటుంది. ముఖ్యంగా పిల్లలకు ఏదో ఆర్డర్లు వేసినట్టు కాకుండా, ఒక ఫ్రెండ్ చెబుతున్నట్టుగా పనులు పూర్తి చేసేలా ప్రోత్సహిస్తుంది.

Advertisement

Also Read: ప్రపంచంలోనే తొలి 28 ఇంచుల ట్రై-ఫోల్డ్ మానిటర్.. ఇక ఫోన్లనే కాదు.. డెస్క్‌టాప్‌నూ మడతపెట్టొచ్చు!

చదువులో తోడు.. నిద్రలో నీడ:

ఇది కేవలం అలారాలకే పరిమితం కాదు.. పిల్లల బుర్రలో వచ్చే బోలెడు సందేహాలను తీర్చే ‘లెర్నింగ్ పార్ట్‌నర్’ కూడా. పిల్లలు అడిగే వింత వింత ప్రశ్నలకు వారి వయసుకు తగ్గట్టుగా అర్థమయ్యేలా సమాధానాలు చెబుతుంది. ఇక రాత్రి పూట నిద్రపుచ్చడానికి చక్కటి కథలు వినిపిస్తూ వారిని ఊరడిస్తుంది. అటు పేరెంట్స్ కూడా ఈ రోబో ద్వారా అలర్ట్స్ సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల పిల్లలు ఏం చేస్తున్నారో అని పదేపదే టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు.

అందుబాటులోకి ఎప్పుడంటే?

Advertisement

అయితే ఈ అద్భుతమైన గ్యాడ్జెట్ ఇప్పుడప్పుడే మార్కెట్లోకి రావడం లేదు. టీసీఎల్ దీనిని ఒక కాన్సెప్ట్ మోడల్‌గా మాత్రమే చూపించింది. దీని ధర ఎంత? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అన్న విషయాలపై కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. భవిష్యత్తులో AI టెక్నాలజీని పిల్లల కోసం ఎలా వాడుకోవచ్చో చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం. అలాగే పిల్లల ప్రైవసీ విషయంలో కూడా గట్టి జాగ్రత్తలే తీసుకుంటున్నట్లు సంస్థ వెల్లడించింది.

Also Read: ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారమంతా వాడొచ్చు.. ఈ ట్రెండింగ్ ఇయర్‌బడ్స్‌పై ఓ లుక్కేయండి బాస్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×