E-Paper
Advertisement

TCL QM8K Smart TVs: అమెజాన్ బంపరాఫర్.. టీసీఎల్ స్మార్ట్ టీవీలపై.. కళ్లుచెదిరే డిస్కౌంట్!

TCL QM8K Smart TVs: అమెజాన్ బంపరాఫర్.. టీసీఎల్ స్మార్ట్ టీవీలపై.. కళ్లుచెదిరే డిస్కౌంట్!
Advertisement

TCL QM8K Smart TVs: అమెజాన్ ‘బిగ్ స్ప్రింగ్ సేల్’ (Big Spring Sale) ప్రారంభానికి ముందే టీసీఎల్ క్యూఎం8కే (TCL QM8K) సిరీస్ స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ టీవీలపై ప్రస్తుతం 33% వరకు తగ్గింపు లభిస్తోంది. తక్కువ ధరకే అత్యాద్భుతమైన టీసీఎల్ టీవీని సొంతం చేసుకోవాలని భావించే వారికి ఇదే బెస్ట్ ఛాన్స్ అని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ TCL QM8K సిరీస్ టీవీల ప్రత్యేకతలు ఏంటీ? అమెజాన్ లో ధర, ఆఫర్ వివరాలు? ఏంటో ఇప్పుడు చూద్దాం.

టీవీ ధర, ఆఫర్ డిటైయిల్స్..

TCL QM8K స్మార్ట్ టీవీ సిరీస్ లో మెుత్తం రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. టీసీఎల్ 65 అంగుళాలు, 75 అంగుళాల సైజుల్లో ఈ స్మార్ట్ టీవీలు లభిస్తున్నాయి. ఆఫర్ విషయానికి వస్తే TCL 65 అంగుళాల QM8K అసలు ధర సుమారు 1,499 డాలర్లు. ప్రస్తుతం ఇది 33% తగ్గింపుతో 998 డాలర్లకే (రూ.93,763) లభిస్తోంది. అంటే ఏకంగా 500 డాలర్ల వరకూ ఆదా చేసుకోవచ్చు. మరోవైపు TCL 75 అంగుళాల QM8K టీవీ కూడా సుమారు 502 డాలర్ల తగ్గింపుతో 1,498 డాలర్లకు (రూ.1,40,743) అందుబాటులో ఉంది. ఈ ధరలు.. గత బ్లాక్ ఫ్రైడే సేల్ లో ఉన్న ఆల్-టైమ్ తక్కువ (All time low) ప్రైసెస్ కు చాలా దగ్గరగా ఉండటం విశేషం.

Mini-LED టెక్నాలజీ

Advertisement

TCL QM8K స్మార్ట్ టీవీల ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఇవి Mini LED టెక్నాలజీని కలిగి ఉన్నాయి. ఫలితంగా అద్భుతమైన బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్‌ను యూజర్లు ఎక్స్ పీరియన్స్ చేయవచ్చు. రాత్రివేళల్లో చిత్రీకరించి సీన్లను సైతం ఈ టీవీల్లో అత్యంత స్పష్టంగా వీక్షించవచ్చు.

గేమింగ్ ఫీచర్లు

గేమింగ్ ప్రియులకు ఈ టీసీఎల్ స్మార్ట్ సిరీస్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. 144Hz రిఫ్రెష్ రేట్, HDMI 2.1 సపోర్ట్‌తో ఇది అందుబాటులోకి వచ్చింది. కాబట్టి క్రమం తప్పకుండా గేమ్స్ ఆడేవారికి.. ఈ టీసీఎల్ టీవీ సిరీస్ అద్భుతమైన గేమింగ్ అనుభూతిని అందిస్తుంది.

గూగుల్ టీవీ సాఫ్ట్ వేర్..

Advertisement

ఇది గూగుల్ టీవీ సాఫ్ట్‌వేర్ తో వచ్చింది. ఫలితంగా నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి యాప్‌లను ఇందులో చాలా తేలిగ్గా ఉపయోగించుకోవచ్చు. అత్యంత క్వాలిటీతో సినిమాలు, సిరీస్ లను వీక్షించేందుకు ఇది సాయపడుతుంది.

సూర్యకాంతిలోనూ బెస్ట్ విజువల్స్

టీసీఎల్ స్మార్ట్ టీవీ అత్యధిక బ్రైట్ నెస్ తో ప్రకాశవంతమైన స్క్రీన్ ను కలిగి ఉన్నాయి. కాబట్టి సూర్య కిరణాలు నేరుగా పడే గదుల్లోనూ.. ఈ టీవీ చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాయి. పగటి వెలుతురులోనూ టీవీలోని దృశ్యాలు చాలా స్పష్టంగా యూజర్ వీక్షించవచ్చు.

Also Read: Gas Saving Tips: గ్యాస్ కొరత వేధిస్తోందా? ఈ చిట్కాలు పాటిస్తే.. నెల వచ్చే గ్యాస్ 3 నెలల వస్తుంది!

స్టాక్ ముగిసేలోపు త్వరపడండి..

వాస్తవానికి అమెజాన్ బిగ్ స్ప్రింగ్ సేల్ అధికారికంగా మార్చి 25 నుంచి ప్రారంభమవుతుంది. 6 రోజుల పాటు అంటే మార్చి 31 వరకు ఈ సేల్ జరగనుంది. అయితే TCL స్మార్ట్ టీవీ డీల్స్ మాత్రం ‘ఎర్లీ యాక్సెస్’ (Early Access) కింద అప్పుడే అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి ఆసక్తిగల వారు స్టాక్ అయిపోయేలోపు బుకింగ్ చేసుకోవడం బెటరని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Gas Saving Tips: గ్యాస్‌ను ఆదా చేసే.. టాప్-5 వంటకాలు.. రుచికి రుచి ఆదాకి ఆదా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×