E-Paper
Advertisement

Tandem OLED vs QD-OLED: కొత్త మానిటర్ కొంటున్నారా? ఈ చిన్న లాజిక్ మిస్సయ్యారో మీ పనైపోయినట్టే!

Tandem OLED vs QD-OLED: కొత్త మానిటర్ కొంటున్నారా? ఈ చిన్న లాజిక్ మిస్సయ్యారో మీ పనైపోయినట్టే!
Advertisement

Tandem OLED vs QD-OLED: టెక్నాలజీ పరుగులు పెడుతున్న ఈ కాలంలో మానిటర్ కొన్నప్పుడు OLED అనే మాట పదే పదే వినిపిస్తుంటుంది. అయితే ఇప్పుడు ఈ OLEDలో రెండు కొత్త రకాలు మార్కెట్‌లోకి వచ్చాయి. అవే టాండమ్ OLED, QD-OLED. ఈ నేపథ్యంలో ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఫీచర్లను కలిగి ఉంది? ఏది కొంటే డబ్బులు ఆదా అవుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

టాండమ్ OLED కథేంటంటే?

మామూలుగా OLED స్క్రీన్లలో సింగిల్ లేయర్ ఉంటుంది. కానీ ఈ టాండమ్ OLEDలో రెండు పొరలను ఒకదానిపై ఒకటి అమర్చుతారు. ఇదెలా ఉంటుందంటే.. ఒక బల్బ్ బదులు రెండు బల్బులు పెట్టినట్లు అన్నమాట. దీనివల్ల స్క్రీన్ బ్రైట్‌నెస్ పీక్స్‌లో ఉంటుంది. దీంతో మరో ప్లస్ పాయింట్ ఏంటంటే.. స్క్రీన్ లైఫ్ కూడా పెరుగుతుంది. మనకు OLEDలో మెయిన్ భయం స్క్రీన్‌పై మచ్చలు పడటం. టాండమ్ టెక్నాలజీలో ఆ భయం చాలా తక్కువ. ఇప్పటికే కొత్త ఐప్యాడ్ ప్రోలో దీన్ని చూసి అందరూ ఫిదా అవుతున్నారు.

Advertisement

Also Read: గూగుల్ ఫొటోస్ స్టోరేజ్ ఫుల్ అయిందా? ఈ 5 ట్రిక్స్‌ పాటిస్తే నిమిషాల్లో స్పేస్ ఖాళీ!

QD-OLED ప్రత్యేకతలివే:

ఇక QD-OLED విషయానికి వస్తే.. ఇది బ్లూ లైట్‌ను క్వాంటం డాట్స్ ద్వారా పంపించి రంగులను సృష్టిస్తుంది. దీంతో కలర్స్ చాలా రిచ్‌గా, కళ్లకు అద్దినట్లు కనిపిస్తాయి. ముఖ్యంగా ఎరుపు, ఆకుపచ్చ రంగులైతే స్క్రీన్ నుంచి బయటకు వచ్చేస్తున్నాయా అన్నట్లు ఉంటాయి. మూవీ లవర్స్‌కు, హెవీ గేమ్స్ ఆడేవారికి ఈ స్క్రీన్ ఇచ్చే కిక్కు వేరే లెవెల్.

మూవీస్, గేమ్స్ అయితే:

Advertisement

గదిలో వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు టాండమ్ OLED కేక పుట్టిస్తుంది. ఎందుకంటే.. దీని బ్రైట్‌నెస్ ఎక్కువ కాబట్టి వెలుతురులోనూ అన్నీ క్లియర్‌గా కనిపిస్తాయి. అదే మీరు చీకటి గదిలో కూర్చుని సినిమా చూసే రకం అయితే.. QD-OLED మానిటర్ అందించే కలర్స్‌కు ఫిదా అయిపోతారు. అయితే, స్క్రీన్ మీద టెక్ట్స్ చదివేటప్పుడు టాండమ్ OLED కాస్త నీట్‌గా ఉంటుంది. QD-OLEDలో అక్షరాల అంచుల వద్ద రంగులు కాస్త అటు ఇటుగా అనిపించవచ్చు. దీనినే కలర్ ఫ్రింజింగ్ అంటారు.

ఏది కొనడం బెస్ట్?

ప్రొఫెషనల్ ఎడిటర్స్ అయ్యుండి.. మానిటర్ ఏళ్ల తరబడి మన్నికగా ఉండాలి అనుకుంటే కళ్లు మూసుకుని టాండమ్ OLED కొనుగోలు చేయొచ్చు. అలా కాకుండా, రంగులు అదిరిపోవాలి, గేమింగ్ అనుభవం బాగుండాలి అనుకునే వారికి QD-OLED బెస్ట్ ఛాయిస్. ప్రస్తుతానికి టాండమ్ OLED రేటు కొంచెం ఎక్కువే, కానీ రాబోయే రోజుల్లో ఇదే ట్రెండ్ సెట్ చేయబోతోంది.

Also Read: పొరపాటున కూడా ఏసీ, ఫ్రిడ్జ్‌లను ఎక్స్‌టెన్షన్ బోర్డుకు పెట్టొద్దు.. ఎందుకో తెలుసా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×