E-Paper
Advertisement

ఈ భయంకరమైన ఎండలకి ఏసీ కంటే రూ.10 వేల బడ్జెట్ కూలరే బెస్ట్ ఛాయిస్.. ఎందుకో తెలుసా?

ఈ భయంకరమైన ఎండలకి ఏసీ కంటే రూ.10 వేల బడ్జెట్ కూలరే బెస్ట్ ఛాయిస్.. ఎందుకో తెలుసా?
Advertisement

Best Air Coolers: ఈసారి దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, మధ్య భారత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతుండటంతో ఇంట్లో ఉన్నా కూడా ఉక్కపోతను భరించడం చాలా కష్టంగా మారింది. దీంతో ప్రతి ఇంట్లోనూ ఏసీ అత్యవసర పరికరంగా మారింది. అయితే, రూ.30,000 నుండి రూ.40,000 పెట్టి ఏసీ కొనాలా లేక కేవలం రూ.10,000 బడ్జెట్‌లో వచ్చే ఎయిర్ కూలర్ సరిపోతుందా అనే గందరగోళం చాలామందిలో ఉంటుంది. నిజానికి వాతావరణాన్ని బట్టి.. మధ్యతరగతి కుటుంబాలపై పడే ఆర్థిక పరిస్థిని బట్టి చూస్తే.. ఏసీ కంటే కూలరే చాలా సందర్భాల్లో స్మార్ట్ ఛాయిస్ అవుతుంది. ఎందుకో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం..

పనితీరులో ఏది బెటర్?

మొదట మనం ఎంచుకునే కూలింగ్ పరికరం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం ముఖ్యం. కూలర్ అనేది బయట ఉండే పొడి గాలిని తడి ప్యాడ్ల ద్వారా లోపలికి లాగి, నీటి ఆవిరి సహాయంతో చల్లటి గాలిని గదిలోకి పంపుతుంది. దీనికి గది తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడం అవసరం.

ఏసీ విషయానికి వస్తే?

Advertisement

అది గదిలోనే ఉన్న గాలిని పదే పదే తిప్పుతూ, అందులోని వేడిని, తేమను కెమికల్స్ (రెఫ్రిజెరెంట్స్) ద్వారా బయటకు పంపుతుంది. ఏసీ వాడేటప్పుడు గది పూర్తిగా మూసి ఉంచాలి.మీరు ఉండే ప్రాంతంలో వాతావరణం పొడిగా ఉంటే కూలర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఏసీలతో పోలిస్తే వీటికి ఇన్స్టాలేషన్ ఖర్చులు ఉండవు. అలాగే నచ్చిన చోటికి మార్చుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా కరెంట్ బిల్లు చాలా తక్కువ వస్తుంది.

తేమ ఎక్కువున్న ప్రాంతాల్లో అయితే?

ఏసీలు గదిలోని తేమను లాగేసి గాలిని పొడిగా మార్చితే.. కూలర్లు గాలిలో సహజమైన తేమను అందిస్తాయి. దీనివల్ల చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఉండవు. అయితే ఉక్కపోత (తేమ) ఎక్కువగా ఉండే కోస్తా తీర ప్రాంతాల్లో మాత్రం కూలర్ల కంటే ఏసీలే బాగా పనిచేస్తాయి. ఇప్పుడు మార్కెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉండే బెస్ట్ కూలర్లపై ఓ లుక్కేద్దాం.

Advertisement

Also Read: వావ్.. వాషింగ్ మిషన్లలో ఈ రేంజ్ AI టెక్నాలజీనా? బట్టలు ఉతకడం, ఆరబెట్టడం ఇక చిటికెలోనే!

Crompton Ozone 75L: ఇది పెద్ద గదులకు బెస్ట్ ఛాయిస్. 190 వాట్ల పవర్ మాత్రమే తీసుకునే ఈ కూలర్ ఇన్వర్టర్‌పై కూడా నడుస్తుంది. గట్టి నీరు (హార్డ్ వాటర్) ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది మన్నికగా ఉంటుంది.

Orient Tornado 88L: రాత్రింబగళ్లు కూలర్ వాడాలనుకునే వారికి దీని 88 లీటర్ల ట్యాంక్ బాగా ఉపయోగపడుతుంది. పదే పదే నీళ్లు పోసే అవసరం లేకుండా లాంగ్ రన్ ఇస్తుంది.

THERMOCOOL Aaron 95L: ఇది ఇళ్ల కంటే కూడా పెద్ద హాల్స్, దుకాణాలు లేదా ఆఫీసుల వంటి వాణిజ్య అవసరాలకు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. దీని ఎయిర్ త్రో చాలా బలంగా ఉంటుంది.

Bajaj 85X: నమ్మకమైన బ్రాండ్ నుండి వస్తున్న ఈ కూలర్‌లో ఐస్ ఛాంబర్ కూడా ఉంది. మధ్యాహ్నం ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇందులో ఐస్ వేసుకుని మరింత చల్లదనాన్ని పొందవచ్చు.

Symphony Winter 100XL: 100 లీటర్ల భారీ కెపాసిటీతో వచ్చే ఈ కూలర్ పెద్ద ఇళ్లకు, ఓపెన్ హాల్స్‌కు చాలా బాగుంటుంది. శబ్దం కూడా చాలా తక్కువగా వస్తుంది.

ప్రాంతాన్ని బట్టి ఎంపిక:

చివరగా చెప్పేదేంటంటే.. మీరు నివసించే ప్రాంతంలో ఎండలు ఎక్కువగా ఉండి, వాతావరణం పొడిగా ఉంటే.. అనవసరంగా ఏసీల కోసం వేల రూపాయలు తగలేసి, భారీ కరెంట్ బిల్లులు కట్టడం కంటే రూ.10,000 బడ్జెట్‌లో మంచి ఎయిర్ కూలర్ కొనుగోలు చేయడం అన్ని విధాలా లాభదాయకం, ఆరోగ్యకరం కూడా.

Also Read: ఇలాంటి డివైజ్ కోసమే కదా ఇన్నాళ్లూ వెయిటింగ్.. జస్ట్ 3 సెకెండ్స్‌లో హాట్ వాటర్, ఐస్ క్యూబ్స్ రెడీ!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×