E-Paper
Advertisement

Stylish Smartwatch: బోట్ క్రోమ్ ఐరిస్ స్మార్ట్ వాచ్.. 1.32 అంగుళాల స్క్రీన్, 5 రోజుల బ్యాటరీ లైఫ్.. ధర ఎంతంటే?

Stylish Smartwatch: బోట్ క్రోమ్ ఐరిస్ స్మార్ట్ వాచ్.. 1.32 అంగుళాల స్క్రీన్, 5 రోజుల బ్యాటరీ లైఫ్.. ధర ఎంతంటే?
Advertisement

Stylish Smartwatch: బోట్ (boAt) నుంచి విడుదలయ్యే స్మార్ట్ వాచ్ లకు మార్కెట్ లో మంచి గుడ్ విల్ ఉంది. తక్కువ బడ్జెట్ లో అధునాతన ఫీచర్లతో విడుదలయ్యే ఈ వాచ్ లకు టెక్ ప్రియుల్లో క్రేజీ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే బోట్ మరో అధునాతన స్మార్ట్ వాచ్ ను భారత్ లో విడుదల చేసింది. ‘బోట్ క్రోమ్ ఐరిస్’ (Boat Chrome Iris Smartwatch) పేరుతో నయా మోడల్ ను లాంచ్ చేసింది. దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

1.32 అంగుళాల స్క్రీన్..

Boat Chrome Iris Smartwatch ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది 466×466 పిక్సెల్ రిజల్యూషన్‌ కలిగిన 1.32-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో లాంచ్ అయ్యింది. ఆల్వేస్ ఆన్ (Always-On Display) ఫీచర్ ను కలిగి ఉంది. 1000 నిట్‌ బైట్ నెస్ ను దీనికి అందించారు.

హెల్త్ ఫీచర్లు..

Advertisement

బోట్ నయా వాచ్ లో హెల్త్ కు సంబంధించిన కీలకమైన ఫీచర్లు ఉన్నాయి. హృదయస్పందన రేటు, SpO2 ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్, గైడెడ్ బ్రీతింగ్ మోడ్స్, వాకింగ్ – క్యాలరీ బర్నింగ్ సెన్సార్, ఆడవారి కోసం బుుతు చక్రం ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు టెన్నిస్, క్రికెట్, వాలిబాల్, రన్నింగ్ వంటి స్పోర్ట్స్ ఫీచర్లకు ఈ యాప్ మద్దతు ఇస్తోంది.

స్మార్ట్ టూల్స్..

Boat Chrome Iris Smartwatchలో ఆకర్షణీయమైన ఫేస్ వాచ్ లు, నావిగేషన్ కోసం 2.5D యూజర్ ఇంటర్ ఫేస్ ఉంది. వీటితో పాటు ఫోన్ కెమెరా కంట్రోల్, ఆడియో ప్లేయర్, కాలిక్యులేటర్, గేమ్స్, వాతావరణ సూచనలు, స్టాప్ వాచ్, అలారం, టైమర్ వంటి స్మార్ట్ టూల్స్ ఈ వాచ్ లో ఉన్నాయి.

బ్యాటరీ లైఫ్..

Advertisement

ఈ స్మార్ట్ వాచ్ లో 180mAh బ్యాటరీని అమర్చారు. ఒకసారి ఛార్జ్ చేస్తే 5 రోజుల పాటు నిరంతరాయంగా వాచ్ పనిచేస్తుందని బోట్ వర్గాలు తెలిపాయి. ఈ వాచ్ 0-100% చార్జింగ్ కావడానికి 2 గంటల సమయం తీసుకోనుంది. అటు దుమ్ము, దూళి, నీటి నుంచి రక్షణ కోసం IP68 రేటింగ్ ను ఈ వాచ్ కు అందించారు.

Also Read: Trending ACs in February 2026: కొత్త ఏసీ కావాలా? ఫిబ్రవరి నెలలో టాప్ ట్రెండింగ్‌ లిస్ట్.. ధర, ఫీచర్ల ఇవే!

ధర ఎంతంటే?

బోట్ క్రోమ్ ఐరిస్ వాచ్.. అల్ట్రా స్లిమ్ మెటల్ బాడీని కలిగి ఉంది. ఐదు రకాల కలర్ వేరియంటర్లలో (మెటల్ గోల్డ్, రోజ్ పింక్, వెల్వెట్ వైన్, సిల్క్ స్కిన్, ఫ్రాస్టెడ్ స్కై) లాంచ్ అయ్యింది. దీని ధర రూ.3,499గా కంపెనీ నిర్ణయించింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, బోట్ ఇండియా వెబ్ సైట్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్ల నుంచి దీన్ని కొనుగోలు చేయవచ్చు.

Also Read: Shocking Incident: ఇదేం దిక్కుమాలిన కేసు.. రూ.100ల కేసులో 45 ఏళ్లుగా పోలీసులకు చుక్కలు.. ఎట్టకేలకు కటకటాల్లోకి..!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×