E-Paper
Advertisement

Earth : భూమి పుట్టకముందు ఏం జరిగిందంటే..?

Earth : భూమి పుట్టకముందు ఏం జరిగిందంటే..?
Advertisement

Earth :ఇప్పటికే భూగ్రహం మానవాళితో పాటు మరెన్నో జీవరాశులకు, చెట్లకు నీడనిస్తోంది. వారు బ్రతకడానికి చోటునిస్తోంది. కానీ మనుషుల వల్ల వాతావరణానికి జరుగుతున్న మేలుకంటే నష్టమే ఎక్కువ. దాని వల్ల భూగ్రహంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అందుకే భూమిపై కాకుండా ఇతర గ్రహాలపై కూడా మానవాళి జీవితం కొనసాగే అవకాశం ఉందా అని తెలుసుకునే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా ఆ పరిశోధనల్లో ఓ కొత్త విషయం బయటపడింది.

గ్రహశకలాలు అనేవి ఎప్పుడు ఎటువైపు నుండి వచ్చి భూమి మీద దాడి చేస్తాయో తెలియదు. ఎక్కువశాతం ఇవి సముద్రాల్లోనే పడినా.. మనుషులు ఉండే ప్రదేశాల్లో పడుతుందేమో అని శాస్త్రవేత్తలు కూడా ఎప్పటికప్పుడు భయపడుతూనే ఉంటారు. కేవలం ఆకాశంలో తిరిగేవాటినే కాదు.. సముద్రాల్లో పడిన గ్రహశకలాలపై కూడా వారు పరిశోధనలు చేస్తూ ఉంటారు. తాజాగా ర్యుగు అనే గ్రహశకలంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. దీనిపై మనుషులు జీవించగలిగే కాంపౌండ్లను వారు కనుగొన్నారు.

Advertisement

ర్యుగు.. ఎన్నో బిలియన్ల ఏళ్ల క్రితం భూమిపై ఉండే రాళ్లను పోలినట్టుగా ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2020లో జపానీస్ స్పేస్ ఏజెన్సీ ర్యుగును మొదటిసారి కనిపెట్టారు. అప్పటినుండి దానిపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇందులో మనుషులు జీవనానికి ఉపయోగపడే యూరాసిల్, నియాసిన్ ఉన్నాయని తేలింది. యూరాసిల్ అనేది ఆర్ఎన్ఏకు సంబంధించిన చికిత్సలు చేయడానికి ఉపయోగపడే కాంపౌండ్ కాగా నియాసిన్ అనేది విటమిన్ బి3కి సంబంధించినదిగా తెలుస్తోంది.

శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భూమి అనేది 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. అయితే అంతకంటే ముందు నుండే ఉన్న ఈ గ్రహశకలం భూమి కొత్తగా అవతరించక ముందే మానవాళి జీవనం కొనసాగేదని నిరూపించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికే భూమిపై దొరికిన గ్రహశకలాల్లో ఎక్కువశాతం కార్బన్‌ను కనిపెట్టారు శాస్త్రవేత్తలు. అయితే భూమి వాతావరణం అనేది గ్రహశకలాలాపై ప్రభావం చూపించడంతో అవి పరిశోధనలకు పూర్తిస్థాయిలో సహకరించపోయాయని అన్నారు.

Advertisement

ర్యుగుపై మరిన్ని పరిశోధనలు చేసి భూమి ఏర్పడేకంటే ముందు ఉంటే ఎర్లీ లైఫ్ గురించి తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ర్యుగును వేడి నీళ్లలో ముంచి లిక్విడ్ క్రోమాటోగ్రాఫీ అనే ప్రక్రియను చేయడం వల్ల యూరాసిల్, నియాసిన్ బయటపడ్డాయని వారు తెలిపారు. ఆస్ట్రాయిడ్స్ అనేవి ఎర్లీ సోలార్ సిస్టమ్‌‌లో ఏర్పడినవి అని ఇప్పటికే వారు కనిపెట్టారు. అయితే ర్యుగు లాంటి ఆస్ట్రాయిడ్స్ వల్ల ఎర్లీ సోలార్ సిస్టమ్ గురించి, ఎర్లీ లైఫ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×