E-Paper
Advertisement

Storage Tips: గూగుల్ ఫొటోస్ స్టోరేజ్ ఫుల్ అయిందా? ఈ 5 ట్రిక్స్‌ పాటిస్తే నిమిషాల్లో స్పేస్ ఖాళీ!

Storage Tips: గూగుల్ ఫొటోస్ స్టోరేజ్ ఫుల్ అయిందా? ఈ 5 ట్రిక్స్‌ పాటిస్తే నిమిషాల్లో స్పేస్ ఖాళీ!
Advertisement

Storage Tips: స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ గూగుల్ అకౌంట్ నుండి స్టోరేజ్ ఫుల్ అనే నోటిఫికేషన్ రావడం సర్వసాధారణం. మనం ఫోన్ వాడుతున్నప్పుడు అనవసరమైన స్క్రీన్‌షాట్లు, వీడియోలు తీస్తూనే ఉంటాం కానీ పాత వాటిని డిలీట్ చేయడం మర్చిపోతుంటాం. దీనివల్ల ముఖ్యమైన ఫొటోలు, ఫైల్స్ సేవ్ చేసుకోవడానికి చోటు ఉండదు. ఒక్కో ఫొటోను వెతికి డిలీట్ చేయడం చాలా సమయం తీసుకుంటుంది. అందుకే తక్కువ టైం‌లో మీ గూగుల్ స్టోరేజ్‌ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

⇒ ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ ఫొటోస్ యాప్‌ను ఓపెన్ చేయండి. అందులో మీరు వాడుతున్న ఈ-మెయిల్ ఐడి లాగిన్ అయి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.

Advertisement

⇒ యాప్ పైన కనిపించే మీ ప్రొఫైల్ ఫొటో మీద క్లిక్ చేస్తే సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ Backup అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది ఆన్‌లో ఉందో లేదో చెక్ చేయండి. ఇది ఆన్‌లో ఉంటేనే మీ ఫోన్‌లోని ఫొటోలు ఆటోమేటిక్‌గా గూగుల్ అకౌంట్‌లోకి సేవ్ అవుతాయి.

Also Read: ల్యాప్‌టాప్‌‌‌ నుంచి ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతున్నారా? అయితే మీ ఫోన్ పని గోవిందా.. ఎందుకంటే?

Advertisement

⇒ బ్యాకప్ పూర్తయిన తర్వాత Free up Space on This Device అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తద్వారా ఇప్పటికే గూగుల్‌లో సేవ్ అయిన ఫొటోలు మీ ఫోన్ మెమొరీ నుండి డిలీట్ అయ్యి ఫోన్‌లో స్పేస్ పెరుగుతుంది. ఆ తర్వాత Review Out of Sync Changes లోకి వెళ్లి అక్కడున్న అనవసరమైన వీడియోలను డిలీట్ చేయొచ్చు.

⇒ ఇంకా ఎక్కువ స్పేస్ కావాలనుకుంటే అకౌంట్ సెట్టింగ్స్‌లో Manage Storage ఆప్షన్‌కు వెళ్లాలి. అక్కడ ఉన్న వీడియోలు, అనవసరమైన ఈ-మెయిల్ అటాచ్‌మెంట్‌లు ఎంత మెమొరీని వాడుతున్నాయో క్లియర్‌గా కనిపిస్తుంది. వాటిని రివ్యూ చేసి మీకు అవసరం లేని వాటిని ఒకేసారి డిలీట్ చేయొచ్చు.

⇒ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇలా ఒక్కసారి డిలీట్ చేసిన ఫైల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ తిరిగి రావు. కాబట్టి.. ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చెక్ చేసుకుని డిలీట్ చేయడం మంచిది.

Also Read: ఫస్ట్ టైం ఓవెన్ వాడుతున్నారా? ఈ పొరపాట్లు చేస్తే పేలిపోతుంది జాగ్రత్త!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×