E-Paper
Advertisement

NASA: చంద్రుడి వద్దకు మీ పేరు పంపాలా? జస్ట్ ఇలా చేయండి చాలు!

NASA: చంద్రుడి వద్దకు మీ పేరు పంపాలా? జస్ట్ ఇలా చేయండి చాలు!
Advertisement

NASA Next Mission: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మరో కొత్త మిషన్ ను చేపట్టబోతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఆర్టెమిస్ -2 మిషన్ ను చేపడుతుంది. ఇందులో భాగంగా ఓరియన్ స్పేష్ షటిల్ లో రీడ్ వైజ్ మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెస్ చంద్రుడి చుట్టూ రౌండ్ వేయున్నారు. వారితో పాటు కొన్ని పేర్లను కూడా తీసుకెళ్లనున్నారు. ఈ పేర్లలో మీవి కూడా ఉండవచ్చు అంటుంది నాసా. ఈ చారిత్రాత్మక మిషన్‌ లో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ‘సెండ్ యువర్ నేమ్ విత్ ఆర్టెమిస్ II’ అనే క్యాపెయిన్ ను మొదలు పెట్టింది. వయస్సు, జాతీయతతో సంబంధం లేకుండా అందరూ తమ పేర్లను పంపుకునే అవకాశం కల్పిస్తోంది.

అంతరిక్షానికి మీ పేరును ఎలా పంపాలంటే?   

⦿ NASA రిజిస్ట్రేషన్ పేజీకి వెళ్లండి: ఆర్టెమిస్ II మిషన్ కోసం NASA “మీ పేరును పంపండి” పోర్టల్‌ కు వెళ్లాలి.

Advertisement

⦿ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోండి: మీ మొదటి పేరు, చివరి పేరుతో పాటు 4 నుంచి 7 అంకెల పిన్ కోడ్‌ను ఎంటర్ చేయాలి.

⦿ డిజిటల్ బోర్డింగ్ పాస్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి: మీ వివరాలను ఎంటర్ చేసిన తర్వాత డిజిటల్ బోర్డింగ్ పాస్‌ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Advertisement

⦿ పిన్ తో ట్రాక్ చేయండి: మున్ముందు మీరు మీ బోర్డింగ్ పాస్ ను చూడాలనుకుంటే, మీ పిన్ నెంబర్ తో దానిని ట్రా చేసుకునే అవకాశం ఉంటుదని  NASA తెలిపింది.

⦿ ఈ మిషన్ ద్వారా తమ పేర్లను పంపుకోవాలనుకునే వారు జనవరి 21, 2026 వరకు నాసా వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకోవచ్చు. తమ పిల్లలు, స్నేహితులు,  పెంపుడు జంతువుల పేరును కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.

Read Also: మీకు తెలుసా? కోడి కూడా డైనోసారే.. ఇవిగో దాని ఫ్యామిలీ డిటైల్స్!

ఆర్టెమిస్ II మిషన్ గురించి..

10 రోజుల పాటు కొనసాగే ఈ అంతరిక్షయాత్రకు సంబంధించిన ప్రయోగం ఏప్రిల్ 2026 లోపు ఫ్లోరిడాలోని NASA  కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రారంభం అవుతుంది. ఇందులో కొత్త స్పేస్‌ లాంచ్‌ సిస్టమ్, ఓరియన్‌ అంతరిక్ష నౌక పని తీరును ఆస్ట్రోనాట్స్ అధ్యయనం చేస్తారు. వ్యోమగాములు భూమి నుండి 2,30,000పైగా మైళ్ల దూరం వెళ్తారు. ఈ మిషన్  సిబ్బందిలో రీడ్ వైజ్‌మాన్ (మిషన్ కమాండర్), విక్టర్ గ్లోవర్ (పైలట్), క్రిస్టినా కోచ్ (మిషన్ స్పెషలిస్ట్),  జెరెమీ హాన్సెన్ (కెనడియన్ స్పేస్ ఏజెన్సీ మిషన్ స్పెషలిస్ట్) వెళ్లనున్నారు.

అంతరిక్ష యాత్ర పూర్తయిన తర్వాత శాన్ డియాగో తీరంలో పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా వీరి క్యాప్సూల్ దిగుతుంది. NASA, రక్షణ శాఖ సిబ్బంది దానిని తీరానికి తీసుకొస్తారు.

Read Also: 300 టన్నుల బంగారంతో సొరంగంలోకి వెళ్లి మాయమైన రైలు, 80 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నారు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×