E-Paper
Advertisement

Sony నుంచి మరో సెన్సేషన్.. Xperia 1 VIII ధర, ఫీచర్లు లీక్ అయ్యాయోచ్, లాంచ్ ఎప్పుడంటే?

Sony నుంచి మరో సెన్సేషన్.. Xperia 1 VIII ధర, ఫీచర్లు లీక్ అయ్యాయోచ్, లాంచ్ ఎప్పుడంటే?
Advertisement

Sony Xperia 1 VIII: సోనీ ఫోన్లంటేనే టెక్ లవర్స్‌లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఆ కెమెరా క్వాలిటీ కోసం ఎదురుచూసే ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. ఇప్పుడు వారి కోసం ఒక అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. సోనీ తమ తర్వాతి ఫ్లాగ్‌షిప్ మోడల్Sony Xperia 1 VIIIని లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. అయితే ట్విస్ట్ ఏంటంటే.. కంపెనీ అధికారికంగా చెప్పకముందే అమెజాన్ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ వివరాలన్నీ పొరపాటున బయటపడ్డాయి. ఆ లింక్‌ను వెంటనే తీసేసినా, అప్పటికే నెట్టింట ఈ ఫోన్ ఫీచర్లు తెగ వైరల్ అవుతున్నాయి.

ధర ఎంత ఉండొచ్చు?

అమెజాన్ జర్మనీ లిస్టింగ్ ప్రకారం చూస్తే.. ఈ ఫోన్ జూన్ 26న మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ధర వింటే కాస్త షాక్ అవ్వాల్సిందే. యూరప్‌లో దీని ధర దాదాపు రూ.2,08,000 (1,868 యూరోలు)గా కనిపిస్తోంది. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ రేటుతో పాటు సోనీకి చెందిన ఖరీదైన వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ (WH1000XM6) కూడా కలిపి ఇస్తారట. ఇది కేవలం లీకైన సమాచారమే కాబట్టి.. ఇండియాలోకి వచ్చేసరికి ధరలో మార్పులు ఉండొచ్చు.

Advertisement

Also Read: అమెజాన్‌ కిర్రాక్ ఆఫర్.. రూ.7 వేలలోపే బ్రాండెడ్ మైక్రోవేవ్ ఓవెన్స్, అది కూడా 10 ఏళ్ల వారంటీతో!

డిజైన్‌లో కీలక మార్పులు:

సాధారణంగా సోనీ ఫోన్లు ఒకేలా ఉంటాయనే విమర్శ ఉంటుంది. కానీ ఈసారి డిజైన్‌లో గట్టిగానే మార్పులు చేసినట్టు కనిపిస్తోంది. వెనుక వైపు కెమెరా సెటప్‌ను ఒక చతురస్రాకారపు బాక్స్‌లా (Square Module) డిజైన్ చేశారు. ఇక రంగుల విషయానికొస్తే.. గార్నెట్ రెడ్, గ్రాఫైట్ బ్లాక్, లోలైట్ సిల్వర్ లాంటి కొత్త కలర్లలో ఈ ఫోన్ రాబోతోంది. చూడటానికి చాలా క్లాసీగా, ప్రీమియం లుక్‌తో ఉండబోతోందని లీక్స్ చెబుతున్నాయి.

డిస్‌ప్లే చూస్తే కళ్లు తిప్పుకోలేరు:

Advertisement

మల్టీమీడియా ఎక్స్‌పీరియన్స్ కోసం సోనీని మించిన ఫోన్ లేదనే చెప్పాలి. దీనిలో 6.5 అంగుళాల OLED స్క్రీన్‌ను ఇస్తున్నారు. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్ తోడవ్వడంతో స్క్రోలింగ్ చేసినా, హై ఎండ్ గేమ్స్ ఆడినా చాలా స్మూత్‌గా ఉంటుంది. అలాగే సినిమా ప్రేమికులకు ఈ ఫోన్ ఒక చిన్న థియేటర్ లాంటి అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు.

త్రిబుల్ కెమెరా సెటప్:

Sony Xperia 1 VIIIలో మూడు రకాల లెన్స్‌లను అమర్చారు. వైడ్ యాంగిల్ నుంచి జూమ్ వరకు అన్ని రకాల ఫొటోలను ప్రొఫెషనల్ రేంజ్‌లో తీసుకోవచ్చు. వీటన్నింటితో పాటు, నేటి కాలంలో మాయమైపోతున్న 3.5mm ఆడియో జాక్‌ను సోనీ ఇంకా కొనసాగిస్తుండటం సంగీత ప్రియులకు పెద్ద ఊరట. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే హాయిగా రెండు రోజుల వరకు వాడుకోవచ్చని టాక్. త్వరలోనే ఈ ఫోన్ భారత్‌కు కూడా వచ్చే అవకాశం ఉంది. సోనీ ప్రియులకు మాత్రం ఇది నిజంగానే గుడ్ న్యూస్.

Also Read: అలెర్ట్.. మీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 5.0 వెర్షనా? అయితే ఇక వాట్సప్ శాశ్వతంగా క్లోజ్, వెంటనే ఇది చెక్ చేయండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×