E-Paper
Advertisement

Headphones Price Drop: సోనీ హెడ్‌ఫోన్స్ ఈ రేటుకు దొరకడం లక్కే.. అమెజాన్ సేల్‌లో ఇప్పుడిదే బెస్ట్ డీల్!

Headphones Price Drop: సోనీ హెడ్‌ఫోన్స్ ఈ రేటుకు దొరకడం లక్కే.. అమెజాన్ సేల్‌లో ఇప్పుడిదే బెస్ట్ డీల్!
Advertisement

Headphones Price Drop: సంగీత ప్రియులకు సోనీ బ్రాండ్స్ అంటే ఇష్టంతో పాటు నమ్మకం కూడా ఉంటుంది. సాధారణంగా సోనీ హెడ్‌ఫోన్స్ ఎప్పుడూ కాస్త ధర ఎక్కువగానే ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో సోనీ హెడ్‌ఫోన్స్‌పై ఏకంగా 46 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అది కూడా పాపులర్ మోడల్ Sony WH-CH720Nపైన ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. మరి పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదామా..

కళ్లుచెదిరే డిస్కౌంట్:

ఈ హెడ్‌ఫోన్స్ అసలు ధర రూ.14,990. కానీ ప్రస్తుతం అమెజాన్‌లో నడుస్తున్న సేల్‌లో 46 శాతం తగ్గింపుతో కేవలం రూ.8,168కే లభిస్తోంది. ఇది దాదాపు సగం ధరకే లభిస్తున్నట్టు లెక్క. దీనికి తోడు ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.1,500 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. అంత బడ్జెట్ లేదు అనుకున్న వాళ్లు నెలకు రూ.287 చెల్లించి EMI ద్వారా Sony WH-CH720Nను సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్లు.. మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ రిలీజ్ డేట్ ఫిక్స్!

చెవులకు హాని కలగదు:

కొన్నిరకాల హెడ్‌ఫోన్స్ ఎక్కువ సేపు పెట్టుకుంటే చెవులు నొప్పి పుట్టడం లేదా భారంగా అనిపిస్తుంటుంది. కానీ ఈ Sony WH-CH720N బరువు కేవలం 192 గ్రాములు మాత్రమే. సోనీ తయారు చేసిన నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్‌ఫోన్స్‌లో ఇదే అత్యంత తేలికైన మోడల్. మెత్తటి ఇయర్ ప్యాడ్స్ వల్ల జర్నీల్లో లేదా ఆఫీస్ వర్క్ టైంలో గంటల తరబడి పెట్టకున్నా సౌకర్యంగా ఉంటుంది.

అధునాతన టెక్నాలజీ:

Advertisement

ఇందులో ఉన్న ఇంటిగ్రేటెడ్ ప్రాసెసర్ V1 టెక్నాలజీ బయటి ట్రాఫిక్ సౌండ్స్ లేదా ఇతర శబ్దాలను అడ్డుకుంటుంది. మీరు రైలులో ఉన్నా లేదా రద్దీగా ఉండే కెఫేలో ఉన్నా, ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయొచ్చు. అలాగే దీనిలో ఉన్న స్మార్ట్ మైక్ సిస్టమ్ వల్ల కాల్స్ మాట్లాడేటప్పుడు అవతలి వారికి మీ వాయిస్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది.

బ్యాటరీ బ్యాకప్‌లో తిరుగులేదు:

చార్జింగ్ విషయంలో ఈ హెడ్‌ఫోన్స్ అస్సలు నిరాశపరచవు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 35 గంటల పాటు నిరంతరాయంగా వాడుకోవచ్చు. ఒకవేళ మీరు ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయి అర్జంట్‌గా బయటకు వెళ్లాల్సి వస్తే.. కేవలం 3 నిమిషాల క్విక్ చార్జింగ్‌తో గంటపాటు ప్లేబ్యాక్ పొందొచ్చు. బ్లూ కలర్‌లో స్టైలిష్‌గా కనిపించే ఈ హెడ్‌ఫోన్స్ మ్యూజిక్ లవర్స్‌కే కాకుండా గేమర్స్‌కు కూడా బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

Also Read: ఓడియమ్మ బడవా.. ఫోన్లో త్వరగా ఛార్జింగ్ అయిపోవడానికి అసలు కారణం ఇదా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×