E-Paper
Advertisement

Sony Headphones Price Drop: వార్నీ.. సోనీ హెడ్‌ఫోన్స్ ఇంత తక్కువ ధరకా? స్టాక్ అయిపోయేలోపే కొనేయండి బాస్!

Sony Headphones Price Drop: వార్నీ.. సోనీ హెడ్‌ఫోన్స్ ఇంత తక్కువ ధరకా? స్టాక్ అయిపోయేలోపే కొనేయండి బాస్!
Advertisement

Sony Headphones Price Drop: తక్కువ ధరలో ప్రీమియం క్వాలిటీ ఉన్న వైర్‌లెస్ హెడ్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో టెక్ ప్రియుల నమ్మకమైన బ్రాండ్ సోనీ MDR-ZX110AP మోడల్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అసలు ధరతో పోలిస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుండటంతో.. ఇదే సరైన సమయం అనుకుని చాలామంది కొనుగోలు చేసేస్తున్నారు. ఇప్పుడీ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ యొక్క డిస్కౌంట్ ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

బడ్జెట్‌లో బ్రాండెడ్ హెడ్‌ఫోన్స్:

ఈ హెడ్‌ఫోన్స్ అసలు ధర మార్కెట్లో రూ.1,300 నుండి రూ.1,500 వరకు ఉంటుంది. అయితే ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో భాగంగా దీనిపై దాదాపు 50 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అన్ని ఆఫర్లు పోను కేవలం రూ.700 నుండి రూ.800 లోపే ఇది లభిస్తుండటం విశేషం. ఇంత తక్కువ ధరలో సోనీ లాంటి గ్లోబల్ బ్రాండ్ నుండి వైర్డ్ హెడ్‌ఫోన్స్ రావడం గమనించదగ్గ విషయం. ప్లాస్టిక్ బాడీ అయినప్పటికీ, ఇది చాలా కాలం మన్నికగా ఉంటుంది.

Advertisement

Also Read: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఆ చిన్న హోల్ ఎందుకో తెలిస్తే.. పొరపాటున కూడా పిన్ను పెట్టరు!

అద్భుతమైన సౌండ్ క్వాలిటీ:

ప్రయాణాల్లో, ఆఫీస్ వర్క్ సమయంలో ఎక్కువ సేపు హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటే చెవులు నెప్పి పుడుతుంటాయి. కానీ సోనీ ఈ మోడల్‌ను చాలా తేలికగా రూపొందించింది. దీని ఇయర్ ప్యాడ్స్ మెత్తగా ఉండి చెవులకు హాయినిస్తాయి. దీనిలో ఉన్న 30mm డ్రైవర్లు పాటల్లోని ప్రతి చిన్న శబ్దాన్ని స్పష్టంగా వినిపిస్తాయి. ముఖ్యంగా బేస్ ఇష్టపడే వారిని ఈ హెడ్‌ఫోన్స్ నిరాశపరచవు. సింపుల్‌గా చెప్పాలంటే.. తక్కువ ధరలో రిచ్ ఆడియో ఫీల్‌ను అందిస్తాయి ఇవి.

ఛార్జింగ్ టెన్షన్ ఉండదు:

Advertisement

ఈ హెడ్‌ఫోన్స్‌లోని మరో స్పెషాలిటీ దాని ఫోల్డబుల్ డిజైన్. వీటిని సులభంగా మడతపెట్టి బ్యాగ్‌లో పెట్టుకోవచ్చు. అలాగే ఇందులో ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్ ఉండటం వల్ల కాల్స్ మాట్లాడటం సులభం అవుతుంది. ఆన్‌లైన్ క్లాసులు వినే విద్యార్థుల, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఇది పర్ఫెక్ట్ గ్యాడ్జెట్. వైర్డ్ కనెక్షన్ కాబట్టి.. ఛార్జింగ్ అయిపోతుందనే భయం కూడా ఉండదు.

Also Read: కారు పార్క్ చేసిన చోటు గుర్తుండటం లేదా? గూగుల్ మ్యాప్స్‌లో ఇలా లొకేషన్ సేవ్ చేసుకోండి!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×