E-Paper
Advertisement

లైవ్ పెర్ఫామర్ల కోసం సోనీ సరికొత్త ఇయర్ మానిటర్స్.. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, ధర వివరాలు ఇవే!

లైవ్ పెర్ఫామర్ల కోసం సోనీ సరికొత్త ఇయర్ మానిటర్స్.. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, ధర వివరాలు ఇవే!
Advertisement

Sony IER M500: ప్రముఖ టెక్ దిగ్గజం సోనీ మార్కెట్లోకి సరికొత్త ఇయర్ మానిటర్లను తీసుకొచ్చింది. Sony IER-M500 పేరుతో వీటిని లాంచ్ చేసింది. ముఖ్యంగా లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే సింగర్స్, మ్యుజీషియన్లతో పాటు ప్రొఫెషనల్ ఆడియో మానిటరింగ్ చేసుకునే వారిని దృష్టిలో పెట్టుకుని సోనీ వీటిని రూపొందించింది. ప్రొఫెషనల్ మానిటరింగ్ ఇంజనీర్ల సలహాలు, సూచనల మేరకు వీటిని తయారు చేయడం విశేషం.

ప్రస్తుతానికి ఈ ఇయర్ ఫోన్స్ అమెరికా మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. అక్కడ దీని ధరను సుమారు రూ.11,500 వరకు ఉంటుంది. ఇవి బ్లాక్, క్లియర్ కలర్స్‌తో పాటు రెడ్ అండ్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తున్నాయి. ప్రస్తుతం సోనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా వీటిని ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. ఆగస్టు 20 నుంచి 21 మధ్యలో వీటి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

Advertisement

ఈ వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో సోనీ 5mm డైనమిక్ డ్రైవర్‌ను అమర్చింది. ఇది హై-రిజల్యూషన్ ఆడియోను సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటలు వినేటప్పుడు గానీ, ఆడియోను మానిటర్ చేసేటప్పుడు గానీ ప్రతి చిన్న శబ్దం కూడా చాలా స్పష్టంగా వినిపిస్తుంది. 10Hz నుంచి 40,000Hz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేంజ్ కలిగి ఉండటం వల్ల బేస్ పవర్‌ఫుల్‌గా, హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ ఎంతో క్లియర్ గా ఉంటాయి.

Also Read: షాకింగ్ ఫీచర్.. ఐఫోన్‌కు పోటీగా మోటరోలా కొత్త ఫోన్.. బిల్ట్‌ఇన్ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్‌తో ఎంట్రీ!

Advertisement

ఇవి కేవలం సౌండ్ విషయంలోనే కాకుండా డిజైన్ పరంగానూ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. చెవులకు సౌకర్యవంతంగా ఉండేలా ఫ్లెక్సిబుల్ ఇయర్ హ్యాంగర్స్, మల్టిపుల్ ఇయర్ టిప్స్‌ను సోనీ అందించింది. తద్వారా ఎక్కువ సమయం వాడుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. లైవ్ షోలలో చెమట పట్టినా పాడవకుండా ఉండేలా దీని బాడీని డిజైన్ చేశారు. చీకట్లో కూడా ఎడమ, కుడి ఇయర్‌ఫోన్లను సులువుగా గుర్తించడానికి వీటిపై స్పష్టమైన మార్కింగ్స్ ఇచ్చారు.

బయటి శబ్దాలు డిస్టర్బ్ చేయకుండా ఉండేలా ఇందులో సీల్డ్ ఎకౌస్టిక్ స్ట్రక్చర్‌ను ఉపయోగించారు. ఇది అద్భుతమైన పాసివ్ నాయిస్ ఐసోలేషన్‌ను అందిస్తుంది. దీంతో చుట్టుపక్కల ఎంత నాయిస్ ఉన్నా మనం వినే ఆడియోపైనే దృష్టి పెట్టవచ్చు. దీంతో పాటు సుమారు 1.6 మీటర్ల పొడవైన వై-టైప్ కేబుల్, ఎల్-షేప్డ్ స్టీరియో మినీ ప్లగ్ వస్తాయి. కేబుల్ కాకుండా దీని బరువు కేవలం 6.9 గ్రాములు మాత్రమే ఉంటుంది. బాక్స్‌లోనే క్యారీయింగ్ కేస్, కేబుల్ క్లిప్ కూడా లభిస్తాయి.

Also Read: 99% మంది ఐఫోన్ యూజర్లకు తెలియని 5 క్రేజీ ట్రిక్స్.. మీరూ ఓసారి ట్రై చేసేయండి బాస్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×