E-Paper
Advertisement

సినిమా లవర్స్‌కు పూనకాలే.. సోనీ నుంచి మోస్ట్ పవర్‌ఫుల్ హోమ్ థియేటర్ సిరీస్ లాంచ్!

సినిమా లవర్స్‌కు పూనకాలే.. సోనీ నుంచి మోస్ట్ పవర్‌ఫుల్ హోమ్ థియేటర్ సిరీస్ లాంచ్!
Advertisement

Sony Bravia Theatre: ఇంట్లోనే సినిమా థియేటర్ లాంటి అనుభూతిని సొంతం చేసుకోవాలనుకునే ఆడియో ప్రియుల కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సోనీ ఇండియా మార్కెట్లోకి సరికొత్త BRAVIA Theatre సిరీస్‌ను పరిచయం చేసింది. ఇందులో కంపెనీ తమ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన బ్రావియా థియేటర్ ట్రియోతో పాటు రెండు అద్భుతమైన సౌండ్‌బార్లు, శక్తివంతమైన సబ్‌వూఫర్లు, వైర్‌లెస్ రియర్ స్పీకర్లను లాంచ్ చేసింది. వినసొంపైన డైలాగ్స్, మంచి బేస్, రూమ్ మొత్తం మార్మోగిపోయే సౌండ్ అందించడమే లక్ష్యంగా సోనీ వీటిని డిజైన్ చేసింది. జూలై 1వ తేదీ నుంచి సోనీ రిటైల్ స్టోర్స్, అమెజాన్ లలో ఇవి కొనుగోలుకు అందుబాటులోకి రానున్నాయి.

సరికొత్త ఫ్లాగ్‌షిప్ సిస్టమ్:

ఈ సిరీస్‌లో అత్యంత ప్రీమియం మోడల్ ‘బ్రావియా థియేటర్ ట్రియో’. సాధారణ సౌండ్‌బార్లకు భిన్నంగా ఇది మూడు ప్రత్యేక స్పీకర్ల (లెఫ్ట్, సెంటర్, రైట్) సెటప్‌తో వస్తుంది. ఇది విశాలమైన సౌండ్‌స్టేజ్‌ను క్రియేట్ చేస్తూ స్పష్టమైన డైలాగులను అందిస్తుంది. దీనిని సబ్‌వూఫర్, రియర్ స్పీకర్లతో కలిపినప్పుడు డాల్బీ అట్మోస్ సాయంతో ఏకంగా 24 వర్చువల్ స్పీకర్ల లాంటి థియేటర్ ఎఫెక్ట్‌ను లివింగ్ రూమ్‌లోనే ఆస్వాదించవచ్చు. దీని ధర రూ.2,39,990 కాగా.. బెస్ట్ బై ఆఫర్‌లో రూ.1,69,990కే లభిస్తుంది.

Advertisement

Also Read: ఇదేందయ్యా ఇది.. ఐఫోన్ డిజైన్‌తో కూల్‌ప్యాడ్ కొత్త ఫోన్.. రేటు మరీ ఇంత తక్కువా!

ప్రీమియం రేంజ్ సౌండ్‌బార్లు:

ఎక్కువ హంగామా లేకుండా ఒకే ఒక సౌండ్‌బార్‌తో ఇల్లంతా సౌండ్ నిండిపోవాలనుకునే వారి కోసం ‘బ్రావియా థియేటర్ బార్ 7’ అందుబాటులో ఉంది. 9 స్పీకర్ యూనిట్లు, డాల్బీ అట్మోస్, ఐమాక్స్ ఎన్‌హ్యాన్స్‌డ్ సపోర్ట్‌తో వచ్చే ఈ సౌండ్‌బార్ ధర ఆఫర్‌లో రూ.82,990గా ఉంది. ఇక బడ్జెట్‌లో ప్రీమియం ఆడియో కావాలనుకునే వారి కోసం ‘బ్రావియా థియేటర్ బార్ 5’ మోడల్ కూడా ఉంది. వైర్‌లెస్ సబ్‌వూఫర్, వాయిస్ జూమ్ లాంటి ఫీచర్లతో వచ్చే ఈ 3.1 ఛానల్ సౌండ్‌బార్‌ను కేవలం రూ.29,990 ఆఫర్ ధరకు సొంతం చేసుకోవచ్చు.

అదిరిపోయే బేస్ అండ్ రియర్ స్పీకర్లు:

Advertisement

సినిమాల్లోని యాక్షన్ సీన్లకు, పాటలకు అసలైన ఊపు తెచ్చేందుకు సోనీ రెండు సబ్‌వూఫర్లను తెచ్చింది. 600 వాట్స్ పవర్‌తో వచ్చే థియేటర్ సబ్ 9 ధర రూ.79,990 కాగా.. 300 వాట్స్ కెపాసిటీ ఉన్న సబ్ 8 ధర రూ.34,990గా ఉంది. వీటితో పాటు సరౌండ్ సౌండ్ అనుభూతిని మరింత పెంచేందుకు రియర్ 9, రియర్ 8 అనే వైర్‌లెస్ వెనుక స్పీకర్లను కూడా లాంచ్ చేసింది.

డైరెక్ట్ కనెక్ట్ మ్యాజిక్:

ఈ కొత్త సిరీస్‌లో సోనీ తీసుకొచ్చిన మరో సూపర్ ఫీచర్ ‘బ్రావియా డైరెక్ట్ కనెక్ట్’. దీని ద్వారా ఎలాంటి సౌండ్‌బార్ అవసరం లేకుండానే, మన ఇంట్లోని బ్రావియా టీవీకి నేరుగా సబ్‌వూఫర్‌ను లేదా రియర్ స్పీకర్లను కనెక్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల కస్టమర్లు తమ బడ్జెట్‌ను బట్టి, నచ్చిన విధంగా హోమ్ థియేటర్ సిస్టమ్‌ను మెల్లమెల్లగా బిల్డ్ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. మొత్తానికి హోమ్ ఆడియో మార్కెట్లో సోనీ మరోసారి తన మార్క్ చూపించడానికి సిద్ధమైంది.

Also Read: రియల్‌మీ నుంచి 8000mAh బ్యాటరీతో కొత్త ఫోన్.. బడ్జెట్ ధరలో వావ్ అనిపించే ఫీచర్లు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×