E-Paper
Advertisement

Smartphones launching this week: మొబైల్ మార్కెట్ షేకైపోద్ది.. ఈ వారం లాంచయ్యే ఐఫోన్ 17e, పిక్సెల్ 10a ఫీచర్లివే!

Smartphones launching this week: మొబైల్ మార్కెట్ షేకైపోద్ది.. ఈ వారం లాంచయ్యే ఐఫోన్ 17e, పిక్సెల్ 10a ఫీచర్లివే!
Advertisement

Smartphones launching this week: కొత్త ఫోన్ల విడుదల కోసం ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్న టెక్ ప్రియులకు ఈ వారం పండగ అనే చెప్పాలి. మార్కెట్లో ఆధునిక ఫీచర్లతో కూడిన సరికొత్త ఫోన్లు సందడి చేయనున్నాయి. ముఖ్యంగా రూ.60,000 లోపు ప్రీమియం అనుభూతినిచ్చే ఫ్లాగ్‌షిప్ కిల్లర్ ఫోన్లు ఈసారి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి. ఫిబ్రవరి చివర్లో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2026 కంటే ముందే భారత్‌లో లాంచ్ అవుతున్న ఆ ఫోన్ల వివరాలు ఇక్కడ చూసేద్దాం.

Google Pixel 10a

గూగుల్ నుంచి వస్తున్న ఈ ఫోన్ ఫిబ్రవరి 18న భారత మార్కెట్లో విడుదల కానుంది. పిక్సెల్ 9a మాదిరిగానే ఇందులోనూ టెన్సర్ G4 చిప్‌సెట్ ఉపయోగించినట్లు సమాచారం. 8GB RAM, 256GB వరకు స్టోరేజ్ ఆప్షన్లతో వచ్చేస్తోన్న ఈ గూగుల్ పిక్సెల్ 10a లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో పనిచేస్తుంది. దీని ధర దాదాపు రూ.60,000 లోపు ఉండొచ్చని టెక్ నిపుణుల అంచనా.

Advertisement

Also Read: చేతిలో పట్టేసే బుల్లి బుల్లి ఏసీలు.. జస్ట్ రూ.700 నుంచి మొదలు, ఆలస్యం చేయొద్దు!

Vivo V70 Series

వివో తన పాపులర్ V సిరీస్‌లో భాగంగా V70, V70 Elite మోడళ్లను ఫిబ్రవరి 19న లాంచ్ చేయనుంది. ఈ రెండు ఫోన్లలోనూ 1.5K OLED డిస్‌ప్లే, భారీ 6,500mAh బ్యాటరీ ఉండబోతున్నాయి. V70 మోడల్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తుంటే.. ఎలైట్ వెర్షన్ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌తో రానుంది. వీటి ధరలు వరుసగా రూ.45,000, రూ.55,000 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

iPhone 17e

Advertisement

యాపిల్ నుంచి తక్కువ ధరలో ఫోన్ ఆశించే వారి కోసం ఈ ఐఫోన్ 17e బెస్ట్ ఆప్షన్. ఇది కూడా ఈ వారమే విడుదలయ్యే అవకాశం ఉంది. దీనిలో డైనమిక్ ఐలాండ్ ఫీచర్ ఉండటం విశేషం. 6.1 ఇంచ్ OLED స్క్రీన్, లేటెస్ట్ A19 బయోనిక్ చిప్‌సెట్, 48MP సింగిల్ రియర్ కెమెరా దీని ప్రత్యేకతలు. ఈ ఫోన్ ధర రూ.60,000 కంటే తక్కువగానే ఉండవచ్చని సమాచారం.

Infinix Note Edge

ఇకపోతే బడ్జెట్ ధరలో కర్వ్‌డ్ డిస్‌ప్లే ఫోన్ కావాలనుకునే వారికి ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ బెస్ట్ ఛాయిస్. ఫిబ్రవరి 18న లాంచ్ కానున్న ఈ ఫోన్ ధర రూ.25,000 లోపు ఉండనుంది. దీనిలో 4,500 నిట్స్ బ్రైట్‌నెస్ గల అమోలెడ్ డిస్‌ప్లే, JBL ట్యూన్డ్ స్పీకర్లు, 6,500mAh బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉండవచ్చని టాక్.

Also Read: ఐఫోన్ 16 ప్లస్‌పై భారీ తగ్గింపు.. ఏకంగా రూ.21,000 ఆదా చేసే గోల్డెన్ ఛాన్స్!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×