E-Paper
Advertisement

Smartphone Buying Guide: బ్రాండ్ చూసి మోసపోకండి.. ఫోన్ కొనే ముందు ఇవి తప్పక చెక్ చేయండి.. లేదంటే?

Smartphone Buying Guide: బ్రాండ్ చూసి మోసపోకండి.. ఫోన్ కొనే ముందు ఇవి తప్పక చెక్ చేయండి.. లేదంటే?
Advertisement

Smartphone Buying Guide: మార్కెట్‌లో పెద్ద పేరు ఉన్న బ్రాండ్ కనిపిస్తే అదే బెస్ట్ ఫోన్ అనుకుని చాలా మంది వెంటనే కొనేస్తున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే బ్రాండ్ పేరు ఫోన్ క్వాలిటీకి గ్యారెంటీ కాదు. ఒకే బ్రాండ్‌లో మంచి ఫోన్‌లు ఉంటాయి, అలాగే నిరాశపరిచే ఫోన్‌లు కూడా ఉంటాయి. అందుకే కేవలం బ్రాండ్ చూసి నిర్ణయం తీసుకుంటే డబ్బు వృథా అయ్యే అవకాశం ఎక్కువ. ఫోన్ కొనుగోలు చేసే ముందు ఫోన్‌లో ఉన్న ఫీచర్లు మీ అవసరాలకు సరిపోతాయా లేదా అన్నదే అసలు పాయింట్. ఇప్పుడు ఫోన్ కొనుగోలు చేసే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేమిటో ఒక్కొక్కటిగా చూద్దాం.

ర్యామ్ ఎంత అవసరం?

Advertisement

ర్యామ్ అంటే ఫోన్‌లో యాక్టివ్ మెమరీ. ఒకేసారి ఎక్కువ యాప్స్ ఓపెన్ చేసినప్పుడు ఫోన్ స్మూత్‌గా పనిచేయాలంటే తగినంత ర్యామ్ అవసరం. తక్కువ ర్యామ్ ఉన్న ఫోన్‌లలో కాల్ చేస్తూనే మరో యాప్ ఓపెన్ చేస్తే హ్యాంగ్ అవడం సాధారణం. మీ బడ్జెట్ రూ. 15,000 లోపు అయితే 6జిబి నుంచి 8జిబి ర్యామ్ ఉన్న ఫోన్ సరిపోతుంది. గేమింగ్, హెవీ యూజ్ ఉంటే ఎక్కువ ర్యామ్ ఉంటే ఇంకా బెటర్.

ప్రాసెసర్ ఎందుకు కీలకం?

Advertisement

ప్రాసెసర్ అనేది ఫోన్‌కు మెదడు లాంటిది. ఫోన్ స్పీడ్, యాప్ ఓపెనింగ్ టైమ్, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అన్నీ ప్రాసెసర్‌పై ఆధారపడి ఉంటాయి. స్నాప్‌డ్రాగన్, మీడియాటెక్ వంటి పేర్లు మాత్రమే కాకుండా ఏ సిరీస్ చిప్‌సెట్, ఎంత నానోమీటర్ టెక్నాలజీతో తయారైంది అన్నదీ చూడాలి. 3nm ప్రాసెసర్లు 4nm కంటే ఫాస్ట్‌గా పనిచేస్తాయి, బ్యాటరీ సేవింగ్ కూడా బాగుంటుంది.

Also Read: iPhone Fold: ఐఫోన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ స్క్రీన్.. అండర్ డిస్‌ప్లే కెమెరాతో రానున్న ఆపిల్ ఫోల్డ్

డిస్‌ప్లేలో ఎల్‌సీడీ, అమోలెడ్ తేడా

ఫోన్‌లలో సాధారణంగా ఎల్‌సీడీ, అమోలెడ్ డిస్‌ప్లేలు ఉంటాయి. ఎల్‌సీడీ డిస్‌ప్లేలు తక్కువ ధరలో వస్తాయి కానీ కలర్స్ అంత ఆకర్షణీయంగా ఉండవు. అమోలెడ్ డిస్‌ప్లేలో ప్రతి పిక్సెల్ స్వయంగా వెలుగును ఇస్తుంది. అందువల్ల కలర్స్ డీప్‌గా, నేచురల్‌గా కనిపిస్తాయి. ఓటిటి కంటెంట్ ఎక్కువగా చూసేవారికి అమోలెడ్ డిస్‌ప్లే ఉన్న ఫోన్ బెస్ట్ ఆప్షన్.

రిఫ్రెష్ రేట్ అంటే ఏమిటి?

రిఫ్రెష్ రేట్ అంటే స్క్రీన్ ఒక్క సెకనులో ఎన్ని సార్లు రిఫ్రెష్ అవుతుందో అన్నమాట. 60Hz సాధారణ అనుభవం ఇస్తుంది. 90Hz, 120Hz ఉన్న ఫోన్‌లలో స్క్రోలింగ్, యానిమేషన్స్ మరింత స్మూత్‌గా ఉంటాయి. గేమింగ్ ప్రాధాన్యం ఉంటే 144Hz లేదా 165Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ఫోన్ ఉపయోగపడుతుంది, కానీ ప్రాసెసర్ సపోర్ట్ కూడా తప్పనిసరి.

కెమెరా మెగాపిక్సెల్స్ మోసం

చాలా మంది కెమెరా అంటే మెగాపిక్సెల్స్ మాత్రమే చూస్తారు. కానీ అసలు ఫోటో క్వాలిటీ సెన్సార్ సైజ్, అపర్చర్ మీద ఆధారపడి ఉంటుంది. పెద్ద సెన్సార్, తక్కువ అపర్చర్ నెంబర్ ఉన్న కెమెరాలో లైట్‌లో కూడా మంచి ఫోటోలు ఇస్తుంది. అల్ట్రావైడ్ కెమెరా ఉంటే గ్రూప్ ఫోటోలు, ల్యాండ్‌స్కేప్ షాట్స్ చాలా ఈజీగా తీసుకోవచ్చు.

ఐపీ రేటింగ్, ఏఐ ఫీచర్లు కూడా చూడాలి

ఐపీ రేటింగ్ ద్వారా ఫోన్ నీరు, దుమ్ముకు ఎంత వరకు రెసిస్టెంట్ అనేది తెలుస్తుంది. ఐపీ68 రేటింగ్ ఉన్న ఫోన్ సుమారు 30 నిమిషాలు నీటిలో ఉన్నా పనిచేస్తుంది. అలాగే కొత్త ఫోన్‌లలో ఏఐ ఫీచర్లు కూడా కీలకం. ఫోటో ఎడిటింగ్ నుంచి టెక్స్ట్ రైటింగ్ వరకు చాలా పనులను ఏఐ సులభంగా చేస్తుంది. ఆండ్రాయిడ్‌లో ఇది జెమిని ఏఐ ఆధారంగా పనిచేస్తుంది. ఫోన్ కొనేటప్పుడు బ్రాండ్ పేరు కాదు, ర్యామ్, ప్రాసెసర్, డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ, ఏఐ ఫీచర్లు వంటి అంశాలే మీ నిర్ణయాన్ని తీసుకునేలా ఉండాలి. అప్పుడే మీ డబ్బుకు పూర్తి విలువ దక్కుతుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×