E-Paper
Advertisement

Bajaj Air Cooler: ఫోన్‌తో ఆపరేట్ చేయగలిగే కూలర్.. పూర్తి ఫీచర్లు తెలిస్తే మీ మతిపోవడం గ్యారంటీ

Bajaj  Air Cooler: ఫోన్‌తో ఆపరేట్ చేయగలిగే కూలర్.. పూర్తి ఫీచర్లు తెలిస్తే మీ మతిపోవడం గ్యారంటీ
Advertisement

Bajaj Air Cooler: ఈ రోజుల్లో స్మార్ట్‌లకు డిమాండ్ చాలా వరకు పెరిగింది. మనం వాడే చిన్న వస్తువుల నుంచి పెద్ద ప్రోడక్ట్స్ వరకు అన్నీ స్మార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు కూలర్ కూడా అదే మార్గంలోకి వచ్చేసింది. మొబైల్ ఫోన్‌తోనే కూలర్‌ను ఆన్ చేయడం. ఆఫ్ చేయడం సాధ్యమైతే ఎంత సౌకర్యంగా ఉంటుంది. అలాంటి సౌకర్యాన్ని అందించే పరికరం.. Bajaj Cool.iNXT IoT Enabled Air Cooler. ఇది కేవలం చల్లదనం మాత్రమే కాకుండా.. స్మార్ట్ లక్షణాలతో కస్టమర్లకు కొత్త అనుభూతిని ఇస్తుంది. చిన్న గదులు, బెడ్ రూం లేదా ఆఫీసుల కోసం ఇది బెస్ట్ ఆప్షన్.

ఈ సమ్మర్‌లో చల్లగా ఉండాలంటే.. చాలా మంది ఎయిర్ కండిషనర్ గురించి ఆలోచిస్తారు. కానీ ఇవి చాలా ఖరీదైనది, కరెంట్ ఖర్చు కూడా చాలా ఎక్కువ. అందుకే చాలా మంది కూలర్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు కూలర్లు కూడా ట్రెండ్ కు తగ్గట్లు మార్కెట్ లోకి రావడంతో వాడకం కూడా ఇంకా సులభమైంది.

Advertisement

బెస్ట్ ఫీచర్లు:

ఈ కూలర్‌లో ప్రధానమైన విషయం ఏమిటంటే.. దీనిని మీరు మొబైల్ ద్వారా కూడా దీనిని నియంత్రించవచ్చు. మీరు ఎక్కడ ఉన్నా మీ ఫోన్‌తోనే కూలర్‌ను ఆన్ చేయవచ్చు. అంతే కాకుండా ఆఫ్ చేయవచ్చు. గాలి వేగాన్ని మార్చుకోవచ్చు. ఇందులో వై-ఫై సదుపాయం కూడా ఉంటుంది. మీ ఇంటి వై-ఫైకి ఈ కూలర్‌ను కనెక్ట్ చేస్తే, మొబైల్ ద్వారా ఎప్పుడైనా కంట్రోల్ చేసుకోవచ్చు. పాతకాలపు కూలర్లతో పోలిస్తే ఇది చాలా ట్రెండ్ కు అనుగునంగా ఉంటుంది.

Advertisement

ఆటో టెంపరేచర్ కంట్రోల్:

ఇంకో ముఖ్యమైన లక్షణం ఉష్ణోగ్రత గుర్తించడం. గదిలో వేడి ఎంత ఉందో ఇది స్వయంగా గుర్తిస్తుంది. గది ఎక్కువగా వేడిగా ఉంటే.. గాలి వేగాన్ని పెంచుతుంది. గది చల్లబడినప్పుడు వేగాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల మనం చేతితో మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే అవసరం లేని కరెంట్ వాడకం కూడా దీని ద్వారా తగ్గుతుంది.

ఈ కూలర్ కరెంట్ ఆదా విషయంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎయిర్ కండిషనర్‌తో పోలిస్తే.. చాలా తక్కువ కరెంట్ దీనికి ఉపయోగిస్తుంది. కరెంట్ నిలిచిపోయినప్పుడు ఇన్వర్టర్‌ తో కూడా ఇది పనిచేస్తుంది. అందుకే ఇది మధ్యతరగతి కుటుంబాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Also Read: ఈ ఒక్కటి ఉంటే చాలు.. రెస్టారెంట్ స్టైల్ వంటకాలన్నీ ఇంట్లోనే చేసేయొచ్చు

దీని మోడల్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది చూడటానికి చిన్నగా ఉండటం వల్ల గదిలో ఎక్కువ స్థలం ఆక్రమించదు. బెడ్ రూమ్‌లు, హాస్టల్ రూమ్స్, చిన్న ఆఫీసులకు ఇది సరిపోతుంది. అలాగే చక్రాలు ఉండటం వల్ల ఒక చోట నుంచి మరోచోటికి సులభంగా తీసుకుని వెళ్లవచ్చు.

చల్లదనం విషయానికి వస్తే.. ఇది చిన్న, మధ్యస్థ గదులకు సరిపడేంత గాలి ఇస్తుంది. ఇందులో ఉన్న తేనెగూడు ఆకారపు కూలింగ్ ప్యాడ్లు నీటితో కలిసి మంచి చల్లదనం అందిస్తాయి. దీని వాడకం కూడా చాలా సులభం. నీటి ట్యాంకులో నీళ్లు నింపడం, అప్పుడప్పుడు శుభ్రం చేస్తే.. చాలు. ప్రత్యేకంగా ఎలాంటి కొత్త టెక్నాలజీ కూడా దీనికి అవసరం లేదు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది పెద్ద హాళ్లకు లేదా పెద్ద ప్రదేశాలకు సరిపోదు. కాబట్టి చిన్న గదుల కోసం తీసుకుంటే మంచిది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×