E-Paper
Advertisement

Slow Wi-Fi Connection: మీ వైఫైను ఎవరెవరు వాడుతున్నారో తెలుసుకోవాలంటే.. ఈ సింపుల్ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి!

Slow Wi-Fi Connection: మీ వైఫైను ఎవరెవరు వాడుతున్నారో తెలుసుకోవాలంటే.. ఈ సింపుల్ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి!
Advertisement

Slow Wi-Fi Connection: నేటి ఆధునిక యుగంలో ఇంటర్నెట్ వినియోగం ఎంతలా పెరిగిపోయిందో మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో చాలామంది ఇంట్లో, కార్యాలయాల్లో వైఫై సదుపాయాన్ని కల్పించుకుంటారు. అయితే కొన్నిసార్లు ఉన్నట్టుండి వైఫై స్లో అయిపోతుంటుంది. ఆ సమయంలో వర్క్‌ఫ్రం హోమ్ చేసేవాళ్లు అయినా.. ఏదైనా ముఖ్యమైన మీటింగ్‌లో ఉన్నవాళ్లు అయినా ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోవడంతో చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

అయితే మీ ఇంట్లో వైఫై స్లో అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ప్రధాన కారణం ఏమిటంటే.. పర్మిషన్ లేకుండా ఇతరులు మీ వైఫైను కనెక్ట్ చేసుకోవడం. ఇది కేవలం మీ వైఫై స్పీడ్‌ను తగ్గించడం మాత్రమే కాదు.. దీని వల్ల వ్యక్తిగత డేటా కూడా ప్రమాదంలో పడవచ్చు. కాబట్టి.. మీ వైఫైను ఇతరులు వాడుతున్నట్లు ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Also Read: ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా? క్రెడిట్‌ కార్డులతో కిరాణా బిల్లులను తగ్గించుకోండిలా..

గుర్తించడం ఎలా?

అపరిచితులను పట్టుకోవాలంటే.. ముందుగా మీ ఇంట్లో ఉన్న స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, స్మార్ట్ టీవీల MAC అడ్రస్ లేదా IP అడ్రస్‌లను ఓ నోట్‌బుల్‌లో రాసి పెట్టుకోండి. తర్వాత రౌటర్ సెట్టింగ్స్‌లోకి లాగిన్ అవ్వాలి. దీని కోసం మీ బ్రౌజర్‌లో రౌటర్ IP అడ్రస్ టైప్ చేసి, అడ్మిన్ ప్యానెల్‌లోకి లాగిన్ అవ్వాలి. అనంతరం సెట్టింగ్స్‌లోకి వెళ్లి Device List లేదా DHCP Client List అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. అక్కడ మీ వైఫైకి ఎంతమంది అపరిచితులు కనెక్టై ఉన్నారనే డివైజెస్ జాబితా కనిపిస్తుంది. ఆ లిస్ట్‌లో ఎవరైనా కొత్తవాళ్లు కనిపిస్తే.. ఎవరో అపరిచితులు మీ వైఫైను వాడుతున్నారని గుర్తించాలి.

ఇదిగో పరిష్కారం..

Advertisement

మీ వైఫైలోకి మీ ఇంట్లో సభ్యులు కాకుండా.. అపరిచితులు ఎవరైనా కనెక్ట్ అయ్యారు అని తెలుసుకున్న వెంటనే మీ వైఫై పాస్‌వర్డ్‌ను మార్చేయండి. దీని కోసం పాస్‌వర్డ్ పెట్టేటప్పుడు కేపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, నెంబర్లు , స్పెషల్ క్యారెక్టర్లు కలిపి చాలా స్ట్రాంగ్‌గా పెట్టండి. అలాగే మీ రౌటర్ సెట్టింగ్స్‌లో సెక్యూరిటీ మోడ్‌ను WPA2/ WPA3కి అప్డేట్ చేసుకోండి. ఇలా చేయడం వలన మీ వైఫై కనెక్షన్‌తో పాటు మీ వ్యక్తిగత డేలా కూడా హ్యాకర్ల బారిన పడకుండా కాపాడుకున్నట్లు అవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

ఇలా చేస్తే.. ఎవరూ కనెక్ట్ అవ్వలేరు..

ముఖ్యంగా మీ వైఫై డివైస్ పేరు ఇతరులకు కనిపించకుండా ఉండాలంటే.. సెట్టింగ్స్‌లో వెళ్లి Hide SSID అనే ఆప్షన్‌ను ఎంచుకునే సదుపాయం కూడా ఉంది. ఇలా చేయడం వల్ల మీరు మాన్యువల్‌గా పేరు టైప్ చేస్తేనే వైఫై కనెక్ట్ అవుతుంది. మీ డివైస్ పేరును హైడ్ చేసుకోవడం వలన అపరిచితులు ఎట్టిపరిస్థితుల్లోనూ మీ వైఫై‌ను కనెక్ట్ చేసుకోలేరు. అంతేకాదు.. వైఫై భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వలన స్పీడ్‌తో పాటు మీ పర్సనల్ డేటా కూడా సురక్షితంగా ఉంటుంది.

Also Read: కొత్త ఏడాది బంపర్ ఆఫర్ అంటే ఇదే.. ఒక్కసారిగా పడిపోయిన యాపిల్ వాచ్‌ల ధరలు!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×