E-Paper
Advertisement

Slimmest Big-battery Phone: ఐఫోన్‌కు చెక్ పెట్టేలా iQOO కొత్త ఫోన్.. 200MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8 Gen 5తో భారత్‌లోకి!

Slimmest Big-battery Phone: ఐఫోన్‌కు చెక్ పెట్టేలా iQOO కొత్త ఫోన్.. 200MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8 Gen 5తో భారత్‌లోకి!
Advertisement

Slimmest Big-battery Phone: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ iQOO నుంచి మరో పవర్‌ఫుల్ ఫోన్ వచ్చేస్తోంది. iQOO 15R పేరుతో ఈ నెల 24న భారత్‌లో లాంచ్ కానుంది. దీనిలో భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, ఫోన్ మాత్రం భలే స్లిమ్‌గా, స్టైలిష్‌గా ఉంది. ముఖ్యంగా గేమర్స్, నేటి యంగ్‌స్టర్లను దృష్టిలో పెట్టుకుని దీన్ని డిజైన్ చేశారు. మరి ఈ ఫోన్ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూసేద్దామా.

పెర్ఫార్మెన్స్ అంటే ఇదే: 

పెర్ఫార్మెన్స్ పరంగా ఈ ఫోన్ వేరే లెవల్ అనే చెప్పాలి. ఎందుకంటే.. దీనిలో Snapdragon 8 Gen 5 చిప్‌సెట్ వాడుతున్నారు. దీనికి తోడు గేమింగ్ కోసం స్పెషల్‌గా Q2 గేమింగ్ చిప్ కూడా ఉంది. అంటే.. హై ఎండ్ గేమ్స్ ఆడినా ఎక్కడా ల్యాగ్ అవ్వదు, గ్రాఫిక్స్ కూడా చాలా స్మూత్‌గా ఉంటాయి. అలాగే ఈ ఫోన్‌లో 12GB వరకు RAM, 512GB స్టోరేజ్ ఆప్షన్లు ఉండనున్నాయని సామాచారం.

భారీ బ్యాటరీ.. స్లిమ్ డిజైన్:

Advertisement

iQOO 15Rలో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం దాని బ్యాటరీ. ఏకంగా 7600mAh బ్యాటరీ ఇచ్చారు. సాధారణంగా ఇంత పెద్ద బ్యాటరీ ఉంటే ఫోన్ బరువుగా, లావుగా ఉంటుంది. కానీ ఇది మాత్రం కేవలం 7.9mm మందంతో చాలా స్లిమ్‌గా ఉండటం విశేషం. దానికి తోడు 100W ఫ్లాష్ ఛార్జ్ ఉండటంతో చిటికెలో ఛార్జింగ్ అయిపోతుంది. ఇక దీని 6.59 అంగుళాల AMOLED స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్ వల్ల డిస్‌ప్లే ఆకట్టుకుంటోంది.

Also Read: మొబైల్ మార్కెట్ షేకైపోద్ది.. ఈ వారం లాంచయ్యే ఐఫోన్ 17e, పిక్సెల్ 10a ఫీచర్లివే!

అడ్వాన్స్‌డ్ AI ఫీచర్లు:

Advertisement

ఇప్పుడు అంతా AI రాజ్యమేలుతోంది కదా. అందుకే ఈ ఫోన్‌లో అడ్వాన్స్‌డ్ AI ఫీచర్లు పెట్టారు. నోట్స్ రాసుకునేటప్పుడు దాన్ని సమ్మరైజ్ చేయడానికి AI Creation, ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు రియల్ టైమ్‌లో ట్రాన్స్‌లేట్ చేయడానికి AI Call Translation ఉన్నాయి. అంతేకాదు.. ఫొటోల్లో వద్దనుకున్న వాటిని తీసేయడానికి AI Erase కూడా ఉంది. గూగుల్ జెమిని, సర్కిల్ టు సెర్చ్ లాంటి స్మార్ట్ ఫీచర్లు కూడా దీనిలో వస్తున్నాయి.

ధర ఎంతంటే?

కెమెరా విషయానికొస్తే.. 200MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్, 32MP సెల్ఫీ కెమెరాతో వచ్చే ఛాన్స్ ఉంది. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16తో పనిచేస్తుంది. కంపెనీ నాలుగేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ ఇస్తామని హామీ ఇస్తోంది. ఇక ఐఫోన్ నుంచి డేటాను ఈజీగా మార్చుకోవడానికి వన్ ట్యాప్ ట్రాన్స్‌ఫర్ కూడా ఉంది. ఇన్ని ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ ధర రూ.50,000 లోపే ఉండవచ్చని అంచనా.

Also Read: చేతిలో పట్టేసే బుల్లి బుల్లి ఏసీలు.. జస్ట్ రూ.700 నుంచి మొదలు, ఆలస్యం చేయొద్దు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×