E-Paper
Advertisement

ఏసీ అవుట్ డోర్ యూనిట్ అతిగా వేడెక్కుతోందా? అయితే మూడినట్లే.. వెంటనే ఇలా చేయండి!

ఏసీ అవుట్ డోర్ యూనిట్ అతిగా వేడెక్కుతోందా? అయితే మూడినట్లే.. వెంటనే ఇలా చేయండి!
Advertisement

AC Outdoor Unit Tips: ఏసీ ఇండోర్ యూనిట్ తో పాటు అవుట్ డోర్ యూనిట్ కూడా సమర్థవంతంగా పనిచేస్తేనే.. గదిలోకి చల్లదనం సరిగ్గా వస్తుంది. అయితే చాలా మంది ఇండోర్ యూనిట్ పై పెట్టిన శ్రద్ధ.. అవుట్ డోర్ యూనిట్ పై పెట్టరు. అది ఏ విధంగా పనిచేస్తుందన్న దానిని అస్సలు పట్టించుకోరు. సాధారణంగా గదిలోని వేడి గాలిని ఇండోర్ యూనిట్ సేకరిస్తే.. వాటిని అవుట్ డోర్ యూనిట్ బయటకు పంపిస్తాయి. ఈ ప్రక్రియ సమక్రమంగా జరిగితేనే.. ఏసీ బాగా పనిచేస్తుంది. ఒకవేళ అవుట్ డోర్ యూనిట్ అతిగా వేడెక్కినా, చెత్తా చెదారాలతో నిండినా.. అది ఏసీ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. త్వరగా రీపేర్లు వచ్చి.. ఆర్థికంగా మూడటం ఖాయమని అంటున్నారు. అయితే తేలికైన చిట్కాలతో దీనికి ఎలా చెక్ పెట్టవచ్చో ఇప్పుడు చూద్దాం.

నీడను ఏర్పాటు చేయండి

అవుట్‌డోర్ యూనిట్ రోజంతా ఎండలో ఉంటే అది త్వరగా వేడెక్కుతుంది. యూనిట్‌పై నేరుగా ఎండ పడకుండా పైన ఒక చిన్న షెడ్ లాంటిది ఏర్పాటు చేయండి. అయితే గాలి ఆడేందుకు తగినంత ఖాళీ స్థలం ఉండేలా జాగ్రత్త పడండి.

అడ్డంకులు ఉంటే తీసేయండి

Advertisement

అవుట్‌డోర్ యూనిట్ చుట్టూ కనీసం 2-3 అడుగుల ఖాళీ తప్పనిసరి. యూనిట్ దగ్గర మొక్కలు, చెత్త బుట్టలు, ఇతర వస్తువులు ఉంటే బయటకొచ్చే వేడి గాలికి అడ్డుపడొచ్చు. ఫలితంగా ఏసీలోని కంప్రెసర్ వేడెక్కి త్వరగా పాడయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

క్రమం తప్పకుండా క్లీనింగ్

దుమ్ము, ధూళి, ఎండిపోయిన ఆకులు అవుట్‌డోర్ యూనిట్ లోపల చిక్కుకుంటే వేడి బయటకు వెళ్లదు. నెలకు ఒకసారి వాటర్ హోస్ తో సున్నితంగా యూనిట్ గ్రిల్స్‌ను కడగడం వల్ల ఏసీ పనితీరు మెరుగుపడి చల్లటి గాలిని ఇస్తుంది.

గ్యాస్ లీకేజీ

Advertisement

ఏసీలో గ్యాస్ (Refrigerant) తక్కువగా ఉన్నప్పుడు కంప్రెసర్ పై ఒత్తిడి పెరిగి అది విపరీతంగా వేడెక్కుతుంది. ఏసీ తక్కువ కూలింగ్ ఇస్తున్నట్లు అనిపిస్తే వెంటనే టెక్నీషియన్ చేత గ్యాస్ లెవల్స్ తనిఖీ చేయించండి. తద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

Also Read: రెండ్రోజుల్లో బెంగాల్ ఫలితాలు.. సీఎం మమతా కీలక నిర్ణయం.. కౌంటింగ్ ఏజెంట్లతో అత్యవసర భేటి!

సర్వీసింగ్ తప్పనిసరి

ఏడాదికి కనీసం రెండు సార్లు ప్రొఫెషనల్ సర్వీసింగ్ చేయించడం వల్ల చిన్న చిన్న సమస్యలు ముందే గుర్తించవచ్చు. దీనివల్ల కంప్రెసర్ ఎలాంటి ఒత్తిడి లేకుండా సమర్థవంతంగా పనిచేస్తుంది. విద్యుత్ బిల్లు కూడా తక్కువగా వస్తుంది.

Also Read: Gundeninda GudiGantalu Today episode: విల్లాలో ప్రభావతి ఓవరాక్షన్.. మనోజ్ పరువు తీసిన బాలు.. ఇదేం పేరురా నాయనా..

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×