E-Paper
Advertisement

ఏసీ లేదని టెన్షనా? ఈ తేలికైన 7 టిప్స్‌తో.. ఇంటిని కాశ్మీర్‌లా మార్చేయచ్చు!

ఏసీ లేదని టెన్షనా? ఈ తేలికైన 7 టిప్స్‌తో.. ఇంటిని కాశ్మీర్‌లా మార్చేయచ్చు!
Advertisement

Cooling Tips: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత, వాడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అధిక ఉష్ణోగ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇవేమి అవసరం లేకుండా ఉక్కపోత నుంచి తప్పించుకునే కొన్ని తేలికైన టిప్స్ ను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. దీని ద్వారా ఇంటిని చల్లగా ఉంచుకోవడంతో పాటు.. సమ్మర్ లో పెద్దగా ఖర్చు లేకుండా కూల్ కూల్ గా ఉండేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఇంతకీ ఆ స్మార్ట్ టిప్స్ ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

సహజమైన గాలి, వెలుతురు

ఇంటి లోపలికి గాలి ఫ్రీగా ప్రసరించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక కిటికీ నుంచి వచ్చిన గాలి.. మరో కిటికీ గుండా బయటికి వెళ్లేలా ఏర్పాట్లు చేయండి. ఇంటికి, గదికి తలుపులు, కిటికీలు అమర్చుకోవడం ద్వారా గాలి ప్రసారం సాఫీగా సాగిపోతుంది.

ఆ సమయంలో కిటికీలు తెరవండి

Advertisement

పగటి పూట బయటి నుంచి వేడి గాలి ఎక్కువగా వీస్తూ ఉంటుంది. ఆ సమయంలో కిటికీలు మూసి ఉంచితేనే బెటర్. అయితే సాయంత్రం, రాత్రి వేళ బయటి వాతావరణం చల్లబడినప్పుడు కిటికీలు తెరిచి ఉంచడం వల్ల చల్లగాలి లోపలికి వస్తుంది.

తెరలు, బ్లైండ్స్ ఉపయోగించండి

తలుపులు కిటికీల నుంచి సూర్యరశ్మి నేరుగా ఇంట్లోకి పడకుండా మందపాటి తెరలు (Curtains), బ్లైండ్స్ వాడితే మంచిది. ఇవి సూర్యుడి వేడిని అడ్డుకుని ఇంటి లోపల ఉష్ణోగ్రత పెరగకుండా సాయపడతాయి.

ఇంటి చుట్టూ చెట్లు పెంచడం

Advertisement

ఇంటి చుట్టూ చెట్లను పెంచడం, కిటికీల పైన సన్ షేడ్స్ ఏర్పాటు చేయడం వల్ల నేరుగా ఇంటిపై ఎండ ప్రభావం ఉండదు. లేదంటే తీగ మొక్కలు, వెదురు తడకలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కూడా అధిక ఉష్ణం నుంచి తప్పించుకోవచ్చు.

గాలి ప్రసరణకు ఫ్యాన్లను వాడండి

సాధారణ సీలింగ్ ఫ్యాన్లకు గాలిని చల్లబరిచే శక్తి ఉండదు. కానీ గాలిని అక్కడక్కడే తిరిగే చేసి.. శరీరానికి చెమట పట్టకుండా ఇవి సాయపడతాయి. అయితే ఫ్యాన్ కింద ఒక గిన్నెలో ఐస్ ముక్కలు పెట్టడం ద్వారా మరింత చల్ల గాలిని పొందొచ్చు.

ఎలక్ట్రానిక్ వస్తువుల నియంత్రణ

ఓవెన్లు, గ్యాస్ స్టవ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల నుండి సహజంగానే వేడి విడుదల అవుతుంటుంది. కాబట్టి ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో వీటి వాడకాన్ని తగ్గించండి. అవసరం లేనప్పుడు లైట్లను ఆపివేయడం ద్వారా కూడా గది టెంపరేచర్ ను తగ్గించుకోవచ్చు.

Also Read: అసెంబ్లీ ఎన్నికల వేళ.. బిల్లుల గోలేంటి? భగ్గుమన్న కాంగ్రెస్, రాజ్యాంగంపై దాడేనన్న సోనియా గాంధీ

ఇంటి పైకప్పుకు పెయింట్

ఇంటి పైకప్పుకు (Roof) తెల్లటి పెయింట్ వేయడం ద్వారా సూర్యరశ్మి ప్రభావాన్ని కొద్దిమేర నియంత్రించవచ్చు. దీనివల్ల ఇంటిలోపలి వేడి తగ్గుతుంది. అలాగే సీలింగ్ ఇన్సులేషన్ చేయించడం వల్ల పైకప్పు నుండి వచ్చే వేడి ఇంట్లోకి రాకుండా అడ్డుకోవచ్చు.

Also Read: ఎయిర్‌టెల్ క్రేజీ ప్లాన్.. అపరిమిత 5G డేటా, ఫ్రీ హాట్‌స్టార్.. ఎన్నో మరెన్నో బెన్‌ఫిట్స్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×