E-Paper
Advertisement

Side Effects of AC: సమ్మర్ అని ఏసీ తెగ వాడేస్తున్నారా? మీ ఆరోగ్యం గోవిందా.. ఆస్పత్రికి క్యూ కట్టాల్సిందే!

Side Effects of AC: సమ్మర్ అని ఏసీ తెగ వాడేస్తున్నారా? మీ ఆరోగ్యం గోవిందా.. ఆస్పత్రికి క్యూ కట్టాల్సిందే!
Advertisement

Side Effects of AC: సమ్మర్ లో ఏసీ కింద కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బయట భానుడి భగభగలు.. ఇంట్లో 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతతో భలే కమ్మగా అనిపిస్తుంటుంది. అయితే వేసవిలో అతిగా ఏసీని వినియోగిస్తే.. రోగాలను కొనితెచ్చుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చల్లదనం పక్కన పెడితే.. ఆస్పత్రి పాలు కావాల్సి వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ ఎక్కువసేపు ఏసీలో ఉండటం వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం.

శ్వాసకోశ సమస్యలు

ఏసీ చల్లదనంలో అతిగా ఉండటం వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు రావొచ్చు. ముఖ్యంగా ఏసీ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే.. అందులో పేరుకున్న దుమ్ము, దూళి, బ్యాక్టీరియా చల్లటి గాలి ద్వారా ముక్కు నాళాలలోకి ప్రవేశించే ప్రమాదముంది. అక్కడి నుంచి ఊపిరితిత్తుల లోకి వెళ్లి అనారోగ్యానికి గురిచేయవచ్చు. ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, దగ్గు, ఆస్తమా ఉన్నవారికి సమస్యలు తీవ్రం కావడం వంటి పర్యవసానాలు తలెత్తవచ్చు.

చర్మ సమస్యలు.. కళ్లు పొడిబారడం

Advertisement

సాధారణంగా ఏసీలు.. గదిలోని తేమను గ్రహించి గాలిని పొడిగా మార్చేస్తాయి. దీనివల్ల చర్మం తన సహజ తేమను కోల్పోయి పొడిబారిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా దురదలు, దద్దుర్లు రావచ్చు. అటు కళ్లలోని తేమ సైతం ఆవిరై ‘డ్రై ఐ సిండ్రోమ్’ బారిన పడవచ్చు. ఫలితంగా కళ్లు ఎర్రబడటం, మంట పుట్టడం జరుగుతుంది.

డీ హైడ్రేషన్

ఏసీ గదిలో ఉన్నప్పుడు శరీరంపై చెమట అస్సలు పట్టదు. కూలింగ్ కారణంగా దాహం కూడా వేయదు. ఫలితంగా నీళ్లు చాలా తక్కువగా తాగే అవకాశముంది. దీనివల్ల శరీరంలో నీటి శాతం తగ్గి.. డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఏర్పడుతుంది. ఏసీ కింద పనిచేసే వారిలో ఈ డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా వస్తున్నట్లు వైద్యులు సైతం స్పష్టం చేస్తున్నారు.

అలసట, తలనొప్పి

Advertisement

సాధారణంగా ఏసీని ఆన్ చేసినప్పుడు.. గది తలుపులు, కిటికీలు మూసివేస్తుంటారు. దీని వల్ల బయటి వెలుతురు, గాలి గదిలోకి ప్రవేశించదు. ఫలితంగా ఆక్సిజన్ స్థాయిలు తగ్గి.. గదిలో కార్బన్ డై ఆక్సైడ్ పెరిగిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల తలనొప్పి రావడం, నీరసంగా అనిపించడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.

కీళ్ల నొప్పులు

చల్లదనం ఎక్కువగా ఉండే ఏసీ గదుల్లో కూర్చోవడం వల్ల కండరాలు బిగుసుకుపోయి కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి వచ్చే అవకాశముంది. ముఖ్యంగా కీళ్లవాతం ఉన్న వారికి ఈ నొప్పులు మరింత ఎక్కువవుతాయి.

Also Read: Mini Fridges: కదిలే ఫ్రిడ్జ్‌లు.. కారు, ఆఫీసు, సమ్మర్ వెకేషన్స్.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు!

ఈ జాగ్రత్తలు పాటించండి!

సమ్మర్ లో ఏసీ వాడకం తప్పనిసరి కాబట్టి.. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఏసీని ఎప్పుడూ 24°C నుండి 26°C మధ్య ఉంచడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నెలకు రెండుసార్లు ఫిల్టర్లను క్లీన్ చేయడం, దాహం వేయకపోయినా క్రమం తప్పకుండా నీరు తాగడం, చర్మం పొడిబారకుండా మంచి మాయిశ్చరైజింగ్ క్రీమ్ వాడటం వంటివి చేయాలి. అలాగే రోజులో కొంత సమయలం ఏసీ ఆఫ్ చేసి.. కిటికీలు, డోర్లు తెరవడం ద్వారా తాజా గాలిని గదిలోకి తీసుకురావాలి.

Also Read: AI Smart ACs: AI టెక్నాలజీ, Wi-Fi కనెక్టివిటీ.. వాయిస్ కంట్రోల్ ఫీచర్లు.. ఈ ఏసీలు చాలా స్మార్ట్ గురూ!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×