E-Paper
Advertisement

ఇలాంటి ఇయర్‌బడ్స్ ఎప్పుడూ చూసుండరు.. చెవికి క్లిప్‌లా తగిలించుకుంటే చాలు, బ్యాటరీ లైఫ్ అద్భుతం!

ఇలాంటి ఇయర్‌బడ్స్ ఎప్పుడూ చూసుండరు.. చెవికి క్లిప్‌లా తగిలించుకుంటే చాలు, బ్యాటరీ లైఫ్ అద్భుతం!
Advertisement

Sennheiser Accentum Clip: ప్రముఖ ఆడియో బ్రాండ్ సెన్‌హైజర్ (Sennheiser) మార్కెట్లోకి సరికొత్త ఓపెన్-ఈర్ క్లిప్-ఆన్ ఇయర్‌బడ్స్‌ను తీసుకొచ్చింది. Sennheiser Accentum Clip పేరుతో లాంచ్ అయిన ఈ బడ్స్ కంపెనీ నుంచి వస్తున్న మొదటి క్లిప్-ఆన్ ఆడియో ప్రొడక్ట్ కావడం విశేషం. గ్లోబల్ మార్కెట్లో సందడి చేసిన ఈ ఇయర్‌బడ్స్ ఇప్పుడు చైనా మార్కెట్లోకి కూడా అడుగుపెట్టాయి.

చైనా మార్కెట్లో ఈ సెన్‌హైజర్ యాక్సెంచమ్ క్లిప్ ఇయర్‌బడ్స్ ధరను రూ.21,100గా నిర్ణయించారు. అంతకుముందు కెనడా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో దీని ధర దాదాపు రూ.18,100గా ఉంది. ఇవి బ్లాక్, క్రీమ్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. చైనాలో ప్రస్తుతం జేడీ డాట్ కామ్ ద్వారా ఇవి అందుబాటులో ఉన్నాయి. అలాగే జూలై 23 నుంచి కెనడాలోని బెస్ట్ బై, సెన్‌హైజర్ ఆన్‌లైన్ స్టోర్లలో వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

Advertisement

ఈ ఇయర్‌బడ్స్ చెవి లోపల పెట్టేలా కాకుండా.. బయట వైపు క్లిప్‌లా తగిలించుకునేలా ఫ్లెక్సిబుల్ సిలికాన్ బ్రిడ్జ్‌తో వస్తాయి. దీంతో పాటలు వింటున్నప్పుడు కూడా చుట్టుపక్కల ఏం జరుగుతుందో సులభంగా గమనించవచ్చు. ఇందులో 12 మిమీ డైనమిక్ డ్రైవర్లను అందించారు. ఇవి హై-రెస్ ఆడియో వైర్‌లెస్ సర్టిఫికేషన్‌తో వస్తాయి.

అలాగే వాల్యూమ్‌కు తగ్గట్టుగా సౌండ్‌ను అడ్జస్ట్ చేసే డైనమిక్ ఈక్యూ (Dynamic EQ) ఫీచర్ కూడా ఇందులో ఉంది. బ్లూటూత్ 6.0, ఎల్‌డీఏసీ (LDAC) ఆడియో కోడెక్ సపోర్ట్‌తో పాటు గూగుల్ ఫాస్ట్ పెయిరింగ్ ఫీచర్ కూడా ఇందులో లభిస్తుంది.

Advertisement

Also Read: కేక పుట్టించే కెమెరా, భారీ బ్యాటరీ.. రూ.30,000 లోపు దొరికే బెస్ట్ ఫోన్లు ఇవే!

Sennheiser Accentum Clip బ్యాటరీ లైఫ్ పరంగా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇయర్‌బడ్స్ ద్వారా 9 గంటల పాటు నిరంతరాయంగా పాటలు వినవచ్చు. ఛార్జింగ్ కేస్‌తో కలిపితే ఏకంగా 36 గంటల టోటల్ బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. టైప్-సి పోర్ట్‌తో వచ్చే ఈ కేస్ కేవలం 10 నిమిషాల క్విక్ ఛార్జింగ్‌తో రెండు గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది.

కాల్స్ మాట్లాడుకునేందుకు వీలుగా ప్రతి ఇయర్‌బడ్‌లో రెండు మైక్రోఫోన్లు ఉంటాయి. ఇవి AI నాయిస్ రిడక్షన్ టెక్నాలజీతో పనిచేస్తాయి. తద్వారా చుట్టుపక్కల ఎంత గోల ఉన్నా అవతలి వారికి మన వాయిస్ స్పష్టంగా వినిపిస్తుంది. వాటర్, డస్ట్ నుంచి రక్షణ కోసం వీటికి ఐపీ54 (IP54) రేటింగ్ ఇచ్చారు. ప్రతి ఇయర్‌బడ్ బరువు కేవలం 6.8 గ్రాములు మాత్రమే ఉంటుంది. కేస్‌తో కలిపినా మొత్తం బరువు 57 గ్రాములు మాత్రమే. దీంతో వీటిని రోజంతా హ్యాపీగా వాడేయొచ్చు.

Also Read: ఆ కెమెరా ఫీచర్లు చూస్తే దిమ్మ తిరగాల్సిందే.. Google Pixel 11 సిరీస్ లీక్స్ వైరల్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×