E-Paper
Advertisement

Semi vs Fully Automatic: ఈ వాషింగ్ మిషన్ల మధ్య తేడా ఏంటీ? ఫీచర్ల పరంగా ఏది కొంటే బెటర్?

Semi vs Fully Automatic: ఈ వాషింగ్ మిషన్ల మధ్య తేడా ఏంటీ? ఫీచర్ల పరంగా ఏది కొంటే బెటర్?
Advertisement

Semi vs Fully Automatic: వాషింగ్ మిషన్లు ప్రధానంగా ఫ్రంట్ లోడ్ (Front Load), టాప్ లోడ్ (Top Load) వేరియంట్లలో లభిస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ, స్మార్ట్ ఫీచర్ల ఆధారంగా వాటి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటుంటాయి. అయితే అందులోనూ మరో రెండు వేరియంట్లలో వాషింగ్ మిషన్లు లభిస్తుండటం మనం చూడవచ్చు. ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ మోడళ్లలో వాషింగ్ మిషన్లు మార్కెట్లో సేల్ అవుతున్నాయి. అయితే ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏది కొంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో అర్థంకాగ గందరగోళంలో పడుతుంటారు. ఈ నేపథ్యంలో ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు? ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఇప్పుడు చూద్దాం.

సెమీ ఆటోమేటిక్ అంటే ఏంటి?

సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ విషయానికి వస్తే ఇందులో మనిషి జోక్యం తప్పనిసరి. ఇవి సాధారణంగా రెండు వేర్వేరు టబ్ లతో వస్తాయి. ఒకటి వాషింగ్ కోసం కాగా, మరొకటి రిన్స్ అండ్ బట్టల డ్రైయింగ్ కోసం ఉద్దేశించినది. ఒకసారి బట్టలు వాషింగ్ చేసిన తర్వాత వినియోగదారులు.. వాష్ టబ్ నుంచి రిన్స్ టబ్ కు బట్టలను తిరిగి మాన్యువల్ గా మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ వాషింగ్ మెషిన్లు. ఆటోమేటిక్ తో పోలిస్తే తక్కువ ధరకే లభిస్తాయి.

సెమీ ఆటోమేటిక్ ముఖ్యమైన ఫీచర్లు..

Advertisement

ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. ముందుగా చెప్పుకున్నట్లు ఇందులో రెండు టబ్స్ ఉంటాయి. ఒకటి దుస్తులను ఉతకడానికి, మరొకటి ఆరబెట్టడానికి (డ్రెయింగ్)కు ఉపయోగపడతాయి. నీటి ప్రవాహాన్ని మాన్యువల్ గా నియంత్రించవచ్చు. దీనికి నిరంతరాయంగా నీటిని అందించాల్సిన అవసరం లేదు. పూర్తి ఆటోమేటిక్ యంత్రాలతో పోలిస్తే.. నీటి వినియోగం వీటిలో తక్కువగా ఉంటుంది. ఆటోమేటిక్ వేరియంట్ తో పోలిస్తే.. ఇది చాలా వేగంగా బట్టలను వాషింగ్ చేస్తుంది. అంతేకాకుండా ఒక చోటు నుంచి మరో చోటుకు దీనిని తేలిగ్గా తరలించవచ్చు.

ఆటోమేటిక్ ఎలా వర్క్ చేస్తుంది?

పూర్తి ఆటోమేటిక్ కు వాషింగ్ మిషన్లకు వస్తే.. బట్టల వాషింగ్, రిన్స్, ఆరబెట్టడం అన్నీ ఒకే టబ్ లో జరిగిపోతాయి. ఇందులో అవసరానికి అనుగుణంగా వాషింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఒకసారి ఆన్ చేశాక.. ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా అన్నీ అదే చకచకా చేసుకుపోతుంది. సెమీ ఆటోమేటిక్ తో పోలిస్తే ఇందులో చాలా అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ వేరియంటల్లో ఈ వాషింగ్ మిషన్లు లభిస్తున్నాయి.

ఆటోమేటిక్‌లోని అధునాతన ఫీచర్లు

Advertisement

ఈ రకం వాషింగ్ మిషన్లు.. ఆటోమేటిక్ లోడ్ డిటెక్షన్ తో పనిచేస్తాయి. మనం వేసిన దుస్తులకు అనుగుణంగా నీటిని, ఉతికే సామర్థ్యాన్ని అడ్జస్ట్ చేసుకుంటాయి. వీటిలోని ఇన్వర్టర్ టెక్నాలజీ.. తక్కువ శబ్దంతో సమర్థవంతమైన పనితీరును కనబరుస్తుంది. ప్రభావవంతంగా బట్టలను ఉతకడంతో పాటు వేగంగా దుస్తులను డ్రెయిన్ చేస్తుంది. సెమీ ఆటోమేటిక్ తో పోలిస్తే.. ఆటోమేటిక్ లో బట్టల సంరక్షణ మరింత మెరుగ్గా ఉంటుంది. అలాగే వై-ఫై, స్మార్ట్ డయాగ్నిస్టిక్స్, నీటి ఉష్ణోగ్రత నియంత్రణ, వాష్ సైకిల్స్ షెడ్యూల్ వంటి ప్రధాన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Also Read: Municipal Election Results 2026 : మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ.. గెలుస్తామా? లేదా? అనే ఆందోళన!

రెండింటిలో ఏది మంచిది?

బడ్జెట్ పరిమితంగా ఉండి.. విద్యుత్ బిల్లు తక్కువగా రావాలని కోరుకునే వారికి సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ సరైన ఎంపిక. పవర్ కట్ ఎక్కువగా ఉండే ఏరియాల్లో వారు ఎక్కువగా సెమీ ఆటోమేటిక్ పై ఆసక్తి చూపిస్తుంటారు. ముగ్గురు లేదా నలుగురు సభ్యులు ఉన్న ఫ్యామిలీకి సెమీ ఆటోమేటిక్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక ఫుల్లీ ఆటోమేటిక్ విషయానికి వస్తే.. సౌకర్యం, సౌలభ్యం, శ్రమ తక్కువగా ఉండాలని కోరుకునే వారు దీనిని ట్రై చేయవచ్చు. ఇందులో ఉండే అత్యాధునిక ఫీచర్లు ప్రధాన అడ్వాంటేజ్ గా చెప్పవచ్చు. వీటిలో నీటి సరఫరా, విద్యుత్ వినియోగం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్ గా బడ్జెట్, నీటి లభ్యత, ఇంటి పరిస్థితులను బట్టి మీకు నచ్చిన వాషింగ్ మిషన్ ను ఎంచుకోండి.

Also Read: Abhishek Sharma Health Update: 2 కేజీలు త‌గ్గిన అభిషేక్ శ‌ర్మ..ఆందోళ‌న క‌రంగా ఆరోగ్యం !

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×