E-Paper
Advertisement

Semantic Decoder:- మనిషి ఆలోచనలను డీకోడ్ చేసే టెక్నాలజీ.. హడావిడి లేకుండా..

Semantic Decoder:- మనిషి ఆలోచనలను డీకోడ్ చేసే టెక్నాలజీ.. హడావిడి లేకుండా..
Advertisement

Semantic Decoder:- ఈరోజుల్లో ఉన్న టెక్నాలజీ భూమి నుండి చంద్రుడిపైకి కాలు వెళ్లి అక్కడ జీవితాన్ని గడపడం కూడా సులభంగా మారింది. అలాంటిది భూమిపై ఉండే మనుషుల మనసులో ఏముందో తెలుసుకోవడం పెద్ద విషయమా అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే మనిషి బయటికి చెప్పకపోయినా తన మెదడులో ఏముందో చెప్పే టెక్నాలజీలను కనిపెట్టిన శాస్త్రవేత్తలు.. ఇప్పుడు ఆ పరిశోధనలు మరింత అడ్వాన్స్ చేశారు.

మామూలుగా మనిషి మెదడులో బయటికి చెప్పకపోయినా ఏమనుకుంటున్నాడో డీకోడ్ చేయడానికి బ్రెయిన్ డీకోడర్ లాంటి పరికరాలు ఉన్నాయి. ముందుగా మనిషి తలకు ఆ పరికరాన్ని తగిలించి, దాంతో కనెక్ట్ అయ్యి ఉన్న వైర్లను డీకోడర్‌కు తగిలిస్తే తన మెదడులో రన్ అవుతున్న విషయాలు మాటల రూపంలో మనకు కనిపిస్తాయి. అలా కాకపోయిన బ్రెయన్ వేవ్స్‌తో తను ఏం చెప్పాలనుకుంటున్నాడో బయటపెట్టే టెక్నాలజీలు కూడా ఉన్నాయి. కానీ తాజాగా శాస్త్రవేత్తలు తయారు చేసిన టెక్నాలజీ వీటికంటే చాలా భిన్నంగా ఉంటుంది.

Advertisement

వైర్లు ఉన్న పరికరాలను తలకు తగిలించకపోయినా మనిషి మెదడులోని మాటలు చెప్పగలమని కొందరు శాస్త్రవేత్తలు ముందుకొచ్చారు. సెమాంటిక్ డీకోడర్ అనే పేరుతో ఇంప్లాంట్స్ లేకుండానే వారు బ్రెయిన్ యాక్టివిటీని కనుక్కుంటామని తెలిపారు. ఒక కథ వింటున్నప్పుడు లేదా వినిపిస్తున్నప్పుడు మనిషి మెదడులో ఎలాంటి ఇమేజినేషన్ జరుగుతుందో అని తెలుసుకోవడం కోసం ఈ సెమాంటిక్ డీకోడర్‌ను ఉపయోగించి చూశారు శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగాలు సక్సెస్ కూడా అయ్యాయి.

సెమాంటిక్ డీకోడర్ అనేది మానసికంగా ఆరోగ్యంగా ఉన్నా కూడా తమ మనసులోని మాటలను బయటపెట్టలేని వారికోసమే ప్రత్యేకంగా తయారు చేశామని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. హార్ట్ఎటాక్ నుండి కోలుకున్నవారు ఒక్కొక్కసారి తమ మాటను పూర్తిగా కోల్పోవచ్చు. ముఖ్యంగా అలాంటి వారు సెమాంటిక్ డీకోడర్ ద్వారా తమ మెదడులోని మాటలను వేరేవారికి తెలిపే ప్రయత్నం చేయవచ్చని అన్నారు. ఇప్పటికీ ఈ ప్రయోగాలు మొదటి దశలోనే ఉన్నా మెల్లగా ఈ సెమాంటిక్ డీకోడర్ కూడా మనుషులకు ఉపయోగపడే ముఖ్యమైన పరికరంగా మారుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం డీకోడింగ్ సిస్టమ్స్ ఎన్నో మనుషులకు అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా మరెన్నో సిస్టమ్స్ డెవలప్‌మెంట్ దశలో ఉన్నాయి. కానీ వాటన్నింటి లాగా సెమాంటిక్ డీకోడర్‌కు ఇంప్లాంట్స్‌తో పనిలేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ముందుగా ఈ డీకోడర్‌కు ట్రెయినింగ్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఎమ్మారై సాయంతో మనిషి మెదడును ఇది స్కాన్ చేస్తుంది. ఆ తర్వాత బ్రెయిన్ వేవ్స్‌ను బట్టి వారి ఆలోచనలను డీకోడ్ చేస్తుంది. ఇది అందుబాటులోకి వస్తే పేషెంట్ల బ్రెయిన్ యాక్టివిటీని సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×