E-Paper
Advertisement

పాత ఫోన్ అమ్ముతున్నారా? సర్వం స్వాహా కావద్దంటే.. ఈ 5 తప్పులు చేయకండి!

పాత ఫోన్ అమ్ముతున్నారా? సర్వం స్వాహా కావద్దంటే.. ఈ 5 తప్పులు చేయకండి!
Advertisement

Smartphone Security: పాత స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించాలనుకుంటున్నారా? అయితే ఫోన్ మార్చే ముందు కొన్ని కీలక విషయాలను గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. కేవలం ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేసినంత మాత్రాన వ్యక్తిగత డేటా పూర్తిగా పాత ఫోన్ నుంచి తొలగిపోదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి.. డేటాను తిరిగి పొందే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నారు. కాబట్టి మీ ఫోన్ ఇతరుల చేతికి వెళ్లేముందు తప్పకుండా తొలగించాల్సిన ఐదు ముఖ్యమైన అంశాలు ఈ కథనంలో చూద్దాం.

గూగుల్ అకౌంట్స్ లాగౌట్

ఫోన్‌ను ఫార్మాట్ చేసే ముందు ఈమెయిల్ ఐడీలు, సోషల్ మీడియా ఖాతాలు, క్లౌడ్ అకౌంట్ల నుంచి లాగౌట్ అవ్వడం తప్పనిసరి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో జీమెయిల్ అకౌంట్ తొలగించకుండా రీసెట్ చేస్తే.. అది ‘ఫ్రిప్ లాక్’ సమస్యకు దారితీస్తుంది. కాబట్టి అన్ని సింక్ ఆప్షన్లను నిలిపివేసి అకౌంట్ల లింక్‌ను తొలగించండి.

ఫొటోలు, వీడియోలు

Advertisement

చాలామంది ఫోటోలు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంకు స్టేట్‌మెంట్లు వంటి పర్శనల్ డాక్యుమెంట్స్ ను ఫోన్‌లోనే ఉంచుతారు. కాబట్టి ఫోన్‌ను రీసెట్ చేసేముందు వీటన్నింటినీ డ్రైవ్ లేదా కంప్యూటర్‌లోకి బ్యాకప్ చేసుకోవాలి. గ్యాలరీతో పాటు ‘రీసైకిల్ బిన్’ లేదా ‘ట్రాష్’ ఫోల్డర్‌ను కూడా పూర్తిగా క్లియర్ చేయాలి.

బ్రౌజర్ హిస్టరీ, పాస్‌వర్డ్‌లు

ఇంటర్నెట్ బ్రౌజ్ చేసేటప్పుడు కొందరు చాలా వెబ్ సైట్స్ లో లాగిన్ అవుతుంటారు. క్రోమ్ వంటి బ్రౌజర్లలో సేవ్ అయిన ఆటో-ఫిల్ పాస్‌వర్డ్‌లు, క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు, సెర్చ్ హిస్టరీ హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉంది. అందుకే బ్రౌజర్ డేటాను పూర్తిగా డిలీట్ చేసి, క్యాచీ మెమరీని క్లియర్ చేయాలి.

యూపీఐ యాప్స్, బ్యాంకింగ్ లాగిన్స్

Advertisement

గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యూపీఐ అప్లికేషన్లు, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్‌ను ఫోన్ నుంచి పూర్తిగా అన్‌ ఇన్‌స్టాల్ చేయాలి. అలాగే ఆయా బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సెట్టింగ్స్‌లో ఈ డివైజ్‌ను రిమూవ్ చేయడం ద్వారా ఆర్థిక మోసాలకు తావు లేకుండా జాగ్రత్తపడవచ్చు.

Also Read: జూలై కార్ సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. ఇండియన్ కంపెనీస్ ఏ ప్లేస్ లో ఉన్నాయంటే?

సిమ్ కార్డ్, ఎస్డీ కార్డ్ తొలగింపు

పైన పేర్కొన్న వాటిని పూర్తి చేసిన తర్వాత ఫోన్‌లో ఉన్న సిమ్ కార్డును, అదనంగా వాడిన మైక్రో ఎస్డీ (మెమెురీ) కార్డును బయటకు తీయడం మర్చిపోవద్దు. చాలామంది కేవలం ఫోన్ మెమెురీని మాత్రమే నమ్ముకుని మెమరీ కార్డును అలాగే వదిలేస్తుంటారు. అలా చేస్తే అందులోని సమాచారం కూడా ఇతరులకు సులభంగా దొరికే అవకాశం ఉంది.

Also Read: BRS ఇళ్లు కారుతున్నాయి.. మా ఇందిరమ్మ ఇళ్లు దూసుకెళ్తున్నాయి!- మంత్రి పొంగులేటి

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×