E-Paper
Advertisement

Star devouring a planet:- గ్రహాన్ని మింగేస్తున్న నక్షత్రం.. త్వరలోనే..

Star devouring a planet:- గ్రహాన్ని మింగేస్తున్న నక్షత్రం.. త్వరలోనే..
Advertisement

Star devouring a planet:- అంతరిక్షంలో జరిగే ప్రతీ మార్పులను గమనించడానికి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. పైగా ఆస్ట్రానాట్స్ అయితే అంతరిక్షంలోని వస్తువుల వల్ల భూమికి ఏమైనా హాని కలిగే పరిస్థితులు ఏర్పడుతాయా అని ఎప్పుడూ అలర్ట్‌గా ఉంటారు. తాజాగా స్పేస్ఋ‌లో ఒక వింత మార్పును గమనించారు ఆస్ట్రానాట్స్. ఒక స్టార్.. ప్లానెట్‌ను మింగేసే అంత పెద్దగా అవుతుందని వారు బయటపెట్టారు. అంతే కాకుండా త్వరలో సూర్యుడికి కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.

మామూలుగా నక్షత్రాలు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాయి అనే విషయంపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. చాలా ఏళ్లుగా ఆకాశంలోనే ఉన్న నక్షత్రాలు మనం చాలాసార్లు గమనించే ఉంటాం. అయితే అలా కాకుండా కొన్ని నక్షత్రాలు ఏళ్లు పెరుగుతున్నకొద్దీ తమ సైజ్‌ను పెంచుకుంటూ పోతాయని శాస్త్రవేత్తలు గమనించారు. అలా పెరుగుతున్న నక్షత్రం.. పక్కనే ఉన్న ఒక గ్రహాన్ని మింగేస్తోందని వారు తెలిపారు. ముందుగా దాని పక్కన ఉన్న గ్రహంతో ఈ నక్షత్రానికి గ్యాప్ తగ్గిపోయిన తర్వాత మెల్లగా దానిని మింగడం ప్రారంభించిందని చెప్తున్నారు.

Advertisement

ఈ పరిణామాన్ని చూసిన తర్వాత ఆస్ట్రానాట్స్.. సూర్యుడికి కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 5 బిలియన్ సంవత్సరాలలో సూర్యూడికి కూడా ఇలాంటి పరిణామమే ఎదురవుతుందని చెప్తున్నారు. మెల్లగా సూర్యుడి సైజ్ కూడా పెరుగుతూ వెళ్తూ ఒక పెద్ద ఎర్రటి ఆకారం లాగా తయారవుతుందని తెలిపారు. అంతే కాకుండా ఇప్పుడు ఉన్న ఆకారంకంటే దాదాపు 100 రెట్లు పెద్దగా సూర్యుడి సైజ్ పెరుగుతుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. అలా పెరుగుతున్న సమయంలో మెర్క్యూరీ, వీనస్, భూమి గ్రహాలను సూర్యుడు మింగేస్తాడని వారు అంచనా వేస్తున్నారు.

ఇప్పటివరకు ఎన్నో పెద్ద ఎర్రటి నక్షత్రాలను ఆస్ట్రానాట్స్ గమనించారు. కొన్ని నక్షత్రాలు తమకు దగ్గరగా ఉన్న గ్రహాలను మింగేసినందుకే పెద్దగా అయ్యింటాయని వారు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇప్పటివరకు నక్షత్రాలు.. దగ్గర్లోని గ్రహాలను మింగేస్తున్న దృశ్యాలను ఆస్ట్రానాట్స్ దగ్గరుండి గమనించలేదు. వారు ఈ పరిణామాన్ని గమనించడం ఇదే మొదటిసారి. ఈ పరిణామాన్ని జెడ్‌టీఎఫ్ ఎస్ఎల్ఆర్ఎన్ 2020 అని పిలుస్తారని తెలుస్తోంది. దీనిని గమనించడం కోసం ప్రపంచవ్యాప్తంగా స్పేస్ స్టేషన్స్ సిద్ధమయ్యాయి.

Advertisement

మెర్క్యూరీకి, సూర్యుడికి ఎంత దూరం ఉంటుందో.. ఇప్పుడు సైజ్ పెరుగుతున్న నక్షత్రానికి, దాని పక్కన ఉండే గ్రహానికి కూడా అంతే దూరం ఉందని ఆస్ట్రానాట్స్ తెలిపారు. ఆ గ్రహం దాదాపు జ్యూపిటర్ అంత సైజ్‌లో ఉండవచ్చని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ నక్షత్రం తన రెడ్ జయింట్ ఫేజ్‌లో ఉందని, ఇది ముగిసిపోవడానికి దాదాపు 100,000 సంవత్సరాలు పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ నక్షత్రం పరిణామాలను గమనించడం కోసమే పలువురు ఆస్ట్రానాట్స్ దృష్టిపెట్టారు.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×