E-Paper
Advertisement

బడ్జెట్‌లో బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్ ఏది? సామ్‌సంగ్ Vs ఐఎఫ్‌బిలో గెలిచేదెవరు?

బడ్జెట్‌లో బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్ ఏది? సామ్‌సంగ్ Vs ఐఎఫ్‌బిలో గెలిచేదెవరు?
Advertisement

Samsung vs IFB microwave oven 2026: ఉదయం ఆఫీస్ హడావిడిలో చల్లారిపోయిన కూరలని ఇన్స్టెంట్‌గా వేడి చేయాలన్నా, వీకెండ్‌లో ఇంట్లోనే కేకులు, పిజ్జాలు బేక్ చేయాలన్నా కిచెన్‌లో ఒక మైక్రోవేవ్ ఓవెన్ ఉండాల్సిందే! అయితే ఇండియాలో మైక్రోవేవ్ అనగానే గుర్తొచ్చే రెండు టాప్ బ్రాండ్స్ ‘సామ్‌సంగ్’ (Samsung), ‘ఐఎఫ్‌బి’ (IFB). మరి ఈ రెండింటిలో ఇన్స్టెంట్ రీ-హీటింగ్, క్రేజీ బేకింగ్, ఇంకా మల్టీ టాస్కింగ్‌కి ఏది బెస్ట్? మీ బడ్జెట్‌కి ఏది కరెక్ట్? గందరగోళం వద్దు బాస్.. ఈ చిన్న కంపారిజన్ చూస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది.

సామ్‌సంగ్ Vsఐఎఫ్‌బి:

ఈ రోజుల్లో టైమ్ సేవ్ చేయడంలో మైక్రోవేవ్ ఓవెన్‌ను మించిన వస్తువు లేదు. అయితే మార్కెట్‌లోకి వెళ్తే.. వంద రకాల మోడల్స్ కన్ఫ్యూజ్ చేస్తాయి. ముఖ్యంగా సామ్‌సంగ్, IFB బ్రాండ్ల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. రెండూ సూపర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తున్నప్పటికీ.. కొన్ని ఫీచర్స్ విషయంలో ఒకదానికొకటి చాలా డిఫరెంట్. అసలు దేని స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఇన్స్టెంట్ రీ-హీటింగ్ మ్యాజిక్:

రాత్రి మిగిలిపోయిన చపాతీలు లేదా ఫ్రిజ్ లోంచి తీసిన కర్రీస్‌ని సెకన్లలో వేడి చేయడంలో రెండు బ్రాండ్స్ అదరగొడతాయి. సామ్‌సంగ్ విషయానికి వస్తే.. ఇందులో ఉండే ‘ట్రిపుల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్’ టెక్నాలజీ హీట్‌ను ఓవెన్ మొత్తం సమానంగా స్ప్రెడ్ చేస్తుంది. దీని వల్ల ఆహారం ఒక వైపు చల్లగా, మరోవైపు వేడిగా ఉండకుండా పర్ఫెక్ట్‌గా రీ-హీట్ అవుతుంది. అదే ఐఎఫ్‌బి విషయానికి వస్తే.. కేవలం ఒక్క బటన్ నొక్కితే చాలు, మీ ఫుడ్ క్వాంటిటీని బట్టి అదే టైమ్ సెట్ చేసుకునే స్మార్ట్ రీ-హీట్ ఆప్షన్స్ ఇందులో ఉంటాయి.

Advertisement

బేకింగ్ అండ్ గ్రిల్లింగ్ పర్ఫెక్షన్:

కేకులు, కుకీస్ లేదా హోమ్‌మేడ్ పిజ్జాలు చేయాలంటే.. కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్ అవసరం. బేకింగ్ , గ్రిల్లింగ్ విషయంలో ఐఎఫ్‌బి బ్రాండ్‌ది కొంచెం అప్పర్ హ్యాండ్ అని చెప్పాలి. ఇందులో ఇచ్చే ప్రీ-హీట్ ఆప్షన్స్, టెంపరేచర్ కంట్రోల్ చాలా అక్యురేట్‌గా ఉంటాయి. బేకరీ స్టైల్ క్రస్ట్ కావాలనుకుంటే ఐఎఫ్‌బి బెస్ట్ ఛాయిస్. మరోవైపు సామ్‌సంగ్‌లో ‘హాట్ బ్లేస్ట్’ టెక్నాలజీ ఉంటుంది. ఇది నేరుగా ఆహారంపైకి హాట్ ఎయిర్‌ను బ్లో చేయడం వల్ల వంట వేగంగా అవ్వడమే కాదు, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి డీప్ ఫ్రై చేయకుండానే సూపర్ క్రిస్పీగా వస్తాయి.

ఆటో కుక్ మెనూ :

బ్యాచిలర్స్ లేదా వంట రాని వాళ్లకు ఈ ఆటో కుక్ ఫీచర్ వరం లాంటిది. ఐఎఫ్‌బి మైక్రోవేవ్ ఓవెన్లలో వందల సంఖ్యలో ఇండియన్ ఆటో కుక్ రెసిపీస్ ప్రీ-సెట్ అయి ఉంటాయి. కేవలం పదార్థాలు లోపల పెట్టి, మెనూ సెలెక్ట్ చేస్తే చాలు.. అదే పర్ఫెక్ట్‌గా వండేస్తుంది. ఇటు సామ్‌సంగ్‌లో కూడా తక్కువ ఏమీ లేదు. సామ్‌సంగ్‌లో మన దేశీ కిచెన్ కోసం ‘మసాలా అండ్ సన్‌డ్రై’ లాంటి స్పెషల్ మోడ్స్ ఉన్నాయి. ఇవి మసాలాలు వేయించడానికి, హోమ్‌మేడ్ పదార్థాలు చేయడానికి బాగా ఉపయోగపడతాయి.

డ్యూరబిలిటీ అండ్ క్లీనింగ్ టెన్షన్స్:

మైక్రోవేవ్ కొనేటప్పుడు మెయింటెనెన్స్ కూడా చాలా ముఖ్యం. సామ్‌సంగ్ తన చాలా మోడల్స్‌లో ‘సెరామిక్ ఎనామెల్’ ఇంటీరియర్‌ను వాడుతుంది. ఇది స్క్రాచ్-రెసిస్టెంట్, పైగా జిడ్డును క్లీన్ చేయడం చాలా ఈజీ. బ్యాక్టీరియా చేరకుండా ఇది తొంభై తొమ్మిది శాతం ప్రొటెక్షన్ ఇస్తుంది. అలాగే ఐఎఫ్‌బి మోడల్స్ అన్నీ హెవీ స్టెయిన్‌లెస్ స్టీల్ ఇంటీరియర్‌తో వస్తాయి. ఇది కూడా చాలా కాలం పాడవకుండా ఉంటుంది. ఓవెన్ లోపల హీటింగ్‌ను ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది.

Also Read:  ఫ్రిజ్ కొనాలనుకుంటున్నారా? స్మార్ట్ కనెక్టివిటీతో అదరగొడుతున్న శామ్‌సంగ్ టాప్ మోడల్స్!

ఏది కొంటే బెటర్ ?

చివరగా చెప్పేదేంటంటే జనాలు రియల్-లైఫ్ రివ్యూలనే ఇష్టపడుతున్నారు. మీరు కిచెన్‌కు మోడరన్ లుక్ ఇస్తూ, ఈజీ మెయింటెనెన్స్ , స్మార్ట్ హాట్ బ్లేస్ట్ ఫీచర్స్ కోరుకుంటే సామ్‌సంగ్ వైపు వెళ్ళొచ్చు. లేదు.. మీకు పక్కాగా బేకింగ్, గ్రిల్లింగ్ పనులు ఎక్కువ, అచ్చమైన ఇండియన్ ఆటో కుక్ వంటలు సింపుల్‌గా అయిపోవాలి అనుకుంటే ఐఎఫ్‌బి మీ కిచెన్‌కు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. మీ అవసరాన్ని బట్టి బెస్ట్ మోడల్ సెలెక్ట్ చేసుకోండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×