E-Paper
Advertisement

Galaxy Z Flip7 Olympic Edition: శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 ఒలింపిక్ ఎడిషన్ వచ్చేసింది.. దీని ప్రత్యేకతలపై ఓ లుక్కేయండి!

Galaxy Z Flip7 Olympic Edition: శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 ఒలింపిక్ ఎడిషన్ వచ్చేసింది.. దీని ప్రత్యేకతలపై ఓ లుక్కేయండి!
Advertisement

Galaxy Z Flip7 Olympic Edition: ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ‘మిలానో కార్టినా వింటర్ ఒలింపిక్స్ 2026’ ప్రారంభం కానుంది. ఈ క్రీడా సంబరాల్లో పాల్గొనే అథ్లెట్ల కోసం ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. శాంసంగ్ లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ Galaxy Z Flip7లో ప్రత్యేకమైన ఒలింపిక్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. దాదాపు 90 దేశాల నుండి వచ్చే 3,800 మంది ఒలింపిక్, పారాలింపిక్ క్రీడాకారులకు ఈ స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్ ఉచితంగా అందించనుంది.

ప్రత్యేక ఫిట్నెస్ ట్రాకింగ్ యాప్:

ఈ ప్రత్యేక ఎడిషన్ ఫోన్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంది. బ్లూ కలర్ వేరియంట్‌లో వస్తున్న దీని వెనుక భాగంలో శాంసంగ్ లోగోతో పాటు ఒలింపిక్స్ అధికారిక లోగోలను కూడా ముద్రించారు. ఈ ఫోన్‌ను క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడేలా డిజైన్ చేశారు. దీనిలో ప్రత్యేకంగా ‘ఫిట్‌నెస్ ట్రాకింగ్ యాప్’ను ముందే ఇన్‌స్టాల్ చేశారు. దీని ద్వారా అథ్లెట్లు వర్కవుట్ చేసేటప్పుడు హార్ట్ రేటు, ఇతర ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 4 సిరీస్ ధరలు, ఫీచర్లు లీక్.. యాపిల్‌కు గట్టి పోటీ తప్పదా?

ఉచితంగా 100GB డేటా:

శాంసంగ్ ఈ ఫోన్‌తో పాటు క్రీడాకారులకు కొన్ని విభిన్నమైన డిజిటల్ సేవలను కూడా అందిస్తోంది. ఈ క్రమంలో 100GB డేటాతో కూడిన 5G eSIMని అథ్లెట్లకు ఫ్రీగా ఇస్తోంది. అంతేకాదు.. Galaxy Athlete Card అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది సంస్థ. దీంతో క్రీడాకారులు తమ ప్రొఫైల్స్‌ను ఇతరులతో షేర్ చేసుకోవడం, గేమ్ కార్డ్‌లను సేకరించడం వంటి ఇంటరాక్టివ్ పనులను ఒలింపిక్ విలేజ్‌లో చేయొచ్చు. అలాగే ఒలింపిక్ వార్తలు, పోటీల సమాచారం కోసం Athlete365 వంటి యాప్స్ దీనిలో ఉంటాయి.

పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్లు:

Advertisement

ఇకపోతే ఈ Galaxy Z Flip7 Olympic Edition టెక్నాలజీ విషయానికొస్తే.. ఇది సాధారణ గెలాక్సీ Z ఫ్లిప్ 7 మాదిరిగానే శక్తివంతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. దీనిలో 6.9 అంగుళాల మెయిన్ డిస్‌ప్లేతో పాటు, 4.1 అంగుళాల కవర్ స్క్రీన్ ఉంటుంది. శాంసంగ్ సొంత 3nm ఎక్సినోస్ 2500 చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ఫోన్.. మల్టీ టాస్కింగ్‌కు 12GB RAMను కలిగి ఉంది. గతేడాది భారత్‌లో విడుదలైన సాధారణ మోడల్ ధర రూ.1,09,999 ఉండగా.. ఈ ప్రత్యేక ఎడిషన్‌ను మాత్రం కేవలం క్రీడాకారుల కోసమే కేటాయించినట్లు సమాచారం.

Also Read: వారానికి రెండుసార్లు ఛార్జ్ చేస్తే చాలు.. 10,001mAh బ్యాటరీతో రియల్‌మీ P4 పవర్ లాంచ్!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×