E-Paper
Advertisement

Google Photos in Samsung TV: టీవీ అంటే ఎంటర్‌టైన్‌మెంటే కాదు.. 2026 శాంసంగ్ AI టీవీల్లో గూగుల్ ఫొటోస్ మ్యాజిక్!

Google Photos in Samsung TV: టీవీ అంటే ఎంటర్‌టైన్‌మెంటే కాదు.. 2026 శాంసంగ్ AI టీవీల్లో గూగుల్ ఫొటోస్ మ్యాజిక్!
Advertisement

Google Photos in Samsung TV: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తన 2026 AI టీవీ లైనప్‌తో టీవీ అనుభవానికి కొత్త అర్థం తీసుకురానుంది. ఇప్పటివరకు టీవీ అంటే సినిమాలు, సిరీస్‌లు, గేమ్స్ మాత్రమే అనుకుంటే.. ఇకపై అది వ్యక్తిగత స్వీట్ మెమరీస్‌గా మారబోతోంది. దీనిలో భాగంగా గూగుల్ ఫొటోస్‌ను టీవీల్లోకి తీసుకురావాలని శాంసంగ్ ప్రకటించింది. దీంతో పెద్ద స్క్రీన్‌పై కుటుంబంతో కలిసి మీ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునే అనుభవం మరింత ప్రత్యేకంగా మారనుంది.

గూగుల్ ఫొటోస్‌తో రోజంతా మెమరీస్:

ఈ ఫీచర్ ఉపయోగించాలంటే ముందుగా గూగుల్ అకౌంట్‌తో ఫొటోలు బ్యాకప్ అయి ఉండాలి. ఒక్కో టీవీకి ఒకే అకౌంట్ లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత వ్యక్తులు, ప్రదేశాలు, ప్రత్యేక సందర్భాల ఆధారంగా సెట్ అయిన మెమరీస్ టీవీ ఇంటర్‌ఫేస్‌లో కనిపిస్తాయి. శాంసంగ్ డైలీ, డైలీ బోర్డ్ వంటి ఫీచర్లలోనూ ఇవి కనిపించడం వల్ల రోజంతా సందర్భానుసారంగా జ్ఞాపకాలు మన ముందుకు వస్తుంటాయి. ఏయే ఫొటోలు చూపించాలన్న కంట్రోల్ పూర్తిగా యూజర్ చేతుల్లోనే ఉంటుంది.

Advertisement

Also Read: ఛార్జింగ్ టెన్షన్‌కు గుడ్‌బై.. 7000mAh బ్యాటరీ, రెండు హై రిజల్యూషన్ కెమెరాలతో ఒప్పో కొత్త ఫోన్!

AI టచ్‌తో ఫొటోలకి కొత్త లుక్:

2026 చివర్లో క్రియేట్ విత్ AI, రిమిక్స్.. వంటి ఫీచర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా ఫోటోలకి కొత్త థీమ్‌లు, ఆర్ట్ స్టైల్స్ ఇవ్వొచ్చు. అలాగే స్టిల్ ఫోటోల్ని చిన్న వీడియోలుగా మార్చే అవకాశం కూడా ఉంటుంది.

మరింత మెరుగైన అనుభవం:

Advertisement

పర్సనలైజ్డ్ రిజల్ట్స్ ఫీచర్ ద్వారా ట్రావెల్, నేచర్ వంటి థీమ్‌లతో ఫొటోలు ఆటోమేటిక్‌గా గ్రూప్ అవుతాయి. క్రిస్టల్ UHD U8000 సిరీస్ నుంచి ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ భాగస్వామ్యం టీవీని మరింత వ్యక్తిగతంగా మార్చుతూ, గూగుల్ ఫొటోస్‌ ద్వారా యూజర్లను మరింత ఆకట్టుకునే దిశగా శాంసంగ్ అడుగులు వేస్తోంది.

Also Read: ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 35 గంటల వినియోగం.. న్యూ ఇయర్ కానుకగా షియోమీ బడ్స్ 6 లాంచ్‌!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×