E-Paper
Advertisement

Samsung Micro RGB TV: టెక్ ప్రపంచాన్ని షేక్ చేసిన శాంసంగ్.. ప్రపంచంలోనే తొలి 115 ఇంచుల మైక్రో RGB టీవీ లాంచ్!

Samsung Micro RGB TV: టెక్ ప్రపంచాన్ని షేక్ చేసిన శాంసంగ్.. ప్రపంచంలోనే తొలి 115 ఇంచుల మైక్రో RGB టీవీ లాంచ్!
Advertisement

Samsung Micro RGB TV: డిస్‌ప్లే టెక్నాలజీ ప్రపంచంలో శామ్‌సంగ్ మరోసారి తన సత్తా చాటింది. ప్రీమియం టీవీ సెగ్మెంట్‌ను మరోస్థాయికి తీసుకెళ్లేలా.. ఏకంగా 115 అంగుళాల భారీ స్క్రీన్‌తో ప్రపంచం లోనే తొలి మైక్రో RGB డిస్‌ప్లే టీవీని కంపెనీ అధికారికంగా పరిచయం చేసింది. అత్యాధునిక మైక్రోస్థాయి RGB LED బ్యాక్‌లైట్ టెక్నాలజీతో రూపొందిన ఈ టీవీ, రంగుల ఖచ్చితత్వం, కాంట్రాస్ట్, బ్రైట్నెస్ విషయంలో కొత్త స్టాండర్డ్‌ను సెట్ చేయనుంది. ఇప్పుడీ టీవీ పూర్తి వివరాల్లోకి వెళదాం.

మైక్రో RGB టెక్నాలజీ అంటే?

ఈ టీవీకి అసలైన హైలైట్ శాంసంగ్ సొంతంగా అభివృద్ధి చేసిన మైక్రో RGB టెక్నాలజీ. దీనిలో 100 మైక్రోమీటర్ల కంటే చిన్న పరిమాణంలో ఉన్న ఎరుపు, ఆకుపచ్చ, నీలం (RGB) మైక్రో LEDలను స్క్రీన్ వెనుక అమర్చారు. ప్రతి LEDను విడివిడిగా నియంత్రించగలగడం వల్ల, స్క్రీన్ మొత్తం మీద కాంతి, రంగులపై అత్యంత సూక్ష్మ స్థాయి నియంత్రణ సాధ్యమవుతుంది. ఫలితంగా చిత్రాలు మరింత డీప్‌గా, నేచురల్‌గా కనిపిస్తాయి.

Advertisement

Also Read: రూ.4,499కే బెస్ట్ స్మార్ట్ టీవీలు.. థామ్సన్ ఆల్ఫా, కోడాక్ QLED 2025 ఎడిషన్.. ఈ అవకాశం మళ్లీ రాకపోవచ్చు!

AIతో పిక్చర్, సౌండ్ మరింత పవర్‌ఫుల్:

శాంసంగ్ మైక్రో RGB టీవీలో AI ఇంజిన్ ప్రతి ఫ్రేమ్‌ను విశ్లేషించి కంటెంట్‌కు అనుగుణంగా పిక్చర్, సౌండ్‌ను ఆటోమేటిక్‌గా ఆప్టిమైజ్ చేస్తుంది. అలాగే మైక్రో RGB కలర్ బూస్టర్ ప్రో ఫీచర్ వల్ల డల్‌గా కనిపించే సీన్స్ కూడా ఎక్కువ బ్రైట్నెస్‌తో కనిపిస్తాయి. దీంతోపాటు ఈ టీవీ BT.2020 కలర్ స్పేస్‌ను 100% కవర్ చేస్తుందని శాంసంగ్ వెల్లడించింది. ఈ విషయాన్ని జర్మనీకి చెందిన VDE సంస్థ ఇచ్చిన మైక్రో RGB ప్రిసిషన్ కలర్ సర్టిఫికేషన్ కూడా నిర్ధారిస్తోంది.

డిజైన్, ఫీచర్స్‌ వేరే లెవెల్:

Advertisement

ప్రకాశవంతమైన గదుల్లో కూడా స్క్రీన్‌పై రిఫ్లెక్షన్ తగ్గించేందుకు ఈ టీవీలో గ్లేర్-ఫ్రీ టెక్నాలజీని అందించారు. స్లిమ్ మెటల్ బాడీతో మినిమలిస్టిక్ డిజైన్‌లో ఈ భారీ టీవీ కనిపిస్తుంది. ఇక
స్మార్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే.. దీనిలో శాంసంగ్ విజిన్ AI, జనరేటివ్ AI ఆధారిత కొత్త బిక్స్‌బీ వాయిస్ అసిస్టెంట్, భద్రత కోసం శామ్సంగ్ నాక్స్‌, అలాగే ఏడేళ్లపాటు ఉచిత Tizen OS అప్‌డేట్స్ లభించడం విశేషం.

ఊహించలేనంత ధర:

ఈ అల్ట్రా ప్రీమియమ్ టీవీ ధరను శాంసంగ్ 44.9 మిలియన్ కొరియన్ వోన్స్‌గా నిర్ణయించింది. భారతీయ కరెన్సీలో ఇది సుమారు రూ.28.3 లక్షలు. ప్రస్తుతం ఇది కొరియాలో విక్రయాలకు అందుబాటులో ఉండగా, త్వరలో అమెరికాలో కూడా లాంచ్ కానుంది. ఆ తర్వాత గ్లోబల్ మార్కెట్‌లో ఇతర స్క్రీన్ సైజ్‌లతో కూడిన వేరియంట్లు విడుదల చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

ముఖ్యమైన స్పెసిఫికేషన్స్:

1) 115 అంగుళాల 4K మైక్రో RGB HDR+ ప్యానెల్, 144Hz రిఫ్రెష్ రేట్, ఫిల్మ్‌మేకర్ మోడ్‌తో ఇది వస్తుంది.
2) గేమర్ల కోసం ALLM, VRR, FreeSync Premium Pro సపోర్ట్ ఉంది.
3) 128 AI న్యూరల్ నెట్‌వర్క్స్‌తో పనిచేసే 4K AI Upscaling Pro, Auto HDR Remastering Pro వంటి ఫీచర్లు పిక్చర్ క్వాలిటీని మరింత మెరుగుపరుస్తాయి.
4) సౌండ్ విషయంలో 70W పవర్ ఉన్న 4.2.2 ఛానల్ స్పీకర్లు, Dolby Atmos, Q-Symphony సపోర్ట్ అందించారు.
5) కనెక్టివిటీకి Wi-Fi 5, Bluetooth 5.3, నాలుగు HDMI eARC పోర్ట్స్, ఈథర్నెట్, అలాగే సోలార్ సెల్ రిమోట్, SmartThings సపోర్ట్ కూడా ఉన్నాయి.

Also Read: రూ.1,44,000 పైగా డిస్కౌంట్.. సోనీ బ్రావియా 75 అంగుళాల 4K TV ఇప్పుడు అదిరిపోయే ధరలో!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×