E-Paper
Advertisement

Samsung New Cheapest Phone Launch: దీన్ని కొట్టేదేలేదు.. సామ్‌సంగ్ చీపెస్ట్ ట్రిపుల్ కెమెరా ఫోన్ లాంచ్!

Samsung New Cheapest Phone Launch: దీన్ని కొట్టేదేలేదు.. సామ్‌సంగ్ చీపెస్ట్ ట్రిపుల్ కెమెరా ఫోన్ లాంచ్!
Advertisement

Samsung New Cheapest Phone Launch: దక్షిణ కొరియా టెక్ కంపెనీ సామ్‌సంగ్ దేశంలో అతిపెద్ద యూజర్ బేస్ కలిగి ఉంది. మిడ్ రేంజ్ ఫోన్ల నుంచి ప్రీమియయం ఫోన్ల వరకు కంపెనీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. సామ్‌సంగ్ టాప్ పొజీషన్ కోసం అనేక కంపెనీలు పోడిపడుతున్నాయి. కంపెనీ ప్రతి సెగ్మెంట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తోంది. అందుకే Samsung Galaxy F14ని రూ.10,000 కంటే తక్కువ ధరకు విడుదల చేసింది. ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరాతో పాటు పవర్‌ఫుల్ ఫీచర్లతో బడ్జెట్ ధరలో అందుబాటులోకి రానుంది.

ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ సామ్‌సంగ్ ఎంట్రీ లెవల్, బడ్జెట్ సెగ్మెంట్ మార్కెట్‌లో గట్టి పోటీని ఇవ్వనుంది. అయితే కంపెనీ ఈ గ్యాడ్జెట్‌ని 4G కనెక్టివిటీతో తీసుకొచ్చింది. అంటే ఇది 5జీ నెట్వర్క్‌కు సపోర్ట్ చేయదు. కానీ ప్రీమియం డిజైన్, ఫీచర్ల విషయంలో ఎలాంటి రాజీ పడలేదు. ఈ ఫోన్ 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో పాటు 5000mAh బ్యాటరీతో వస్తుంది.

Advertisement

Also Read: Upcoming Mobiles August 2024: టైమ్ ఆగయా.. ఐదు బడ్జెట్ ఫోన్లు.. చాలా చీప్‌ రా బాబు!

Samsung Galaxy F14 ధర విషయానికి వస్తే.. ఇది 4GB RAM+ 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. దీనిని ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. సింగిల్ స్టోరేజ్ వేరియంట్‌లో వస్తుంది. ఈ వేరియంట్ ధర రూ.8,999గా ఉంటుంది. ఈ సామ్‌సంగ్ ఫోన్‌ని రెండు కలర్ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయవచ్చు. అందులో మూన్‌లైట్ సిల్వర్, పెప్పర్‌మింట్ గ్రీన్ ఉన్నాయి.

Advertisement

Samsung Galaxy F14 స్పెసిఫికేషన్స్ గురించి చెప్పాలంటే.. స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగుళాల ఫుల్ HD+ ఇన్ఫినిటీ-U LCD డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. 391 పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది. ఇది Qualcomm Snapdragon 680 ప్రాసెసర్‌తో Adreno 610 GPUని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 14 ఆధారిత OneUI 6.1 సాఫ్ట్‌వేర్ స్కిన్‌ను కలిగి ఉంటుంది.

Also Read: iPhone 16 Series New Leaks: ఆసక్తిరేపుతున్న ఐఫోన్ 16.. దడపుట్టిస్తున్న కొత్త లీక్స్!

Samsung Galaxy F14 కెమెరా సెటప్ గురించి మాట్లాడితే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్, 2MP మాక్రో సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 13MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5mm ఆడియో జాక్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీకి 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×