E-Paper
Advertisement

Samsung Galaxy Z Flip 8 లీక్స్.. డిజైన్ చూస్తేనే పిచ్చెక్కిపోతుంది మామా.. ఆ క్రేజీ ఫీచర్ కూడా!

Samsung Galaxy Z Flip 8 లీక్స్.. డిజైన్ చూస్తేనే పిచ్చెక్కిపోతుంది మామా.. ఆ క్రేజీ ఫీచర్ కూడా!
Advertisement

Galaxy Z Flip 8 Leaks: టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి కొత్తగా రాబోతున్న మడతబెట్టే ఫోన్ Galaxy Z Flip 8 కోసం మొబైల్ మార్కెట్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ ఏడాది జూలైలో దీన్ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. కంపెనీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అఫీషియల్ హింట్ ఇవ్వలేదు కానీ, ఇంతలోనే ఈ ఫోన్‌కు సంబంధించిన బ్యాక్ కేస్ ఫొటోలు ఇంటర్నెట్‌లో లీకైపోయాయి. వీటిని చూస్తుంటే.. కొత్త ఫ్లిప్ ఫోన్ లుక్ ఎలా ఉండబోతోందో స్పష్టంగా అర్థమైపోతోంది.

లుక్ ఎలా ఉంది? స్క్రీన్ సైజ్ ఎంత?

ఈ కొత్త ఫోన్ చూడటానికి గతేడాది వచ్చిన Galaxy Z Flip 7 మాదిరిగానే ఉన్నప్పటికీ.. సైజ్ విషయంలో మాత్రం కొద్దిగా తేడా కనిపిస్తోంది. పాత దానికంటే ఇది కొంచెం పొడవు, వెడల్పు, మందంతో రాబోతున్నట్లు సమాచారం. ఇక ఫోన్ ఓపెన్ చేస్తే లోపల 6.9 అంగుళాల పెద్ద స్క్రీన్ ఉంటుంది. అలాగే సెల్ఫీ కెమెరా కోసం స్క్రీన్ మధ్యలో చిన్న హోల్ ఇచ్చారు. ఇక ఫోన్ మడతపెట్టినప్పుడు బయట కనిపించే స్క్రీన్ సైజ్ కూడా పెంచి.. ఏకంగా 4.1 అంగుళాల భారీ డిస్‌ప్లేను సెట్ చేశారట.

కెమెరా సెటప్‌లో మార్పుల్లేవు:

Advertisement

ఇక కెమెరాల విషయానికి వస్తే.. శాంసంగ్ పెద్దగా మార్పులు చేసినట్లు కనిపించడం లేదు. పాత మోడల్ లాగే వెనుక వైపు రెండు కెమెరాలనే కంటిన్యూ చేయబోతున్నారు. బయట ఉండే స్క్రీన్ పైన ఎడమ వైపున ఈ రెండు కెమెరాలు, వాటి పక్కనే ఎల్‌ఈడీ ఫ్లాష్ లైట్ అమర్చారు. అయితే ఫోన్‌ను మడతపెట్టినప్పుడు మధ్యలో ఉండే జాయింట్ (హింజ్) భాగంలో మెటల్ ఫినిషింగ్‌తో కూడిన శాంసంగ్ లోగో మెరిసిపోతూ కనిపిస్తుంది.

Also Read: ట్రావెలింగ్ అంటే ఇష్టమా? అయితే మీ బ్యాగ్‌లో ఈ లాంగ్ బ్యాటరీ స్పీకర్ ఉండాల్సిందే!

ఐఫోన్ తరహా ఛార్జింగ్ ఫీచర్:

Advertisement

ఈ ఫోన్ కేస్ డిజైన్‌ను కాస్త లోతుగా గమనిస్తే ఒక క్రేజీ అప్‌డేట్ కనిపిస్తోంది. యాపిల్ ఐఫోన్లలో ఉండే మ్యాగ్‌సేఫ్ తరహా వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ దీనిలో వచ్చేలా ఉంది. అంటే ఇది Qi2 ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని సమాచారం. అయితే ఐఫోన్ల లాగే ఫోన్ లోపల కూడా అయస్కాంతాలు ఉంటాయా.. లేక కేవలం కేస్ ద్వారానే ఆ సపోర్ట్ వస్తుందా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

బ్యాటరీ ఎంత? లాంచ్ ఎప్పుడు?

ఈ ఫోన్‌లో 4,300mAh పెద్ద బ్యాటరీని ఇస్తున్నారట. దీనికి తోడు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుంది. సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే.. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ యూఐ 9తో ఈ ఫోన్ పనిచేస్తుంది. జూలై 22న లండన్‌లో జరిగే గ్రాండ్ శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో Galaxy Z Fold 8, Galaxy Z Wide Fold ఫోన్లతో పాటే ఈ Z Flip 8ను కూడా లాంచ్ చేయవచ్చని లీక్స్ చెబుతున్నాయి.

Also Read: నిజంగా మైండ్ బ్లోయింగ్.. రొటేటింగ్ గింబాల్ కెమెరాతో Honor Robot Phone.. లాంచ్ ఎప్పుడంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×