E-Paper
Advertisement

షాకింగ్.. రూ.41,000 తగ్గిన Samsung Galaxy Z Flip 5 ఫోన్ ధర.. అమెజాన్‌లో బంపర్ ఆఫర్!

షాకింగ్.. రూ.41,000 తగ్గిన Samsung Galaxy Z Flip 5 ఫోన్ ధర.. అమెజాన్‌లో బంపర్ ఆఫర్!
Advertisement

Samsung Galaxy Z Flip 5: రూ.60 వేల లోపు మంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5 ఫోన్‌ను భారీ ఆఫర్‌తో సొంతం చేసుకునేందుకు ఇదే సరైన సమయం. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఈ ఫోన్‌పై నేరుగా ధర తగ్గింపుతో పాటు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు అందుబాటులో ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5 (8GB+256GB) వేరియంట్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.59,999 ధరతో లిస్ట్ అయింది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,799 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీనివల్ల ఫోన్ ఎఫెక్టివ్ ధర రూ.58,200కి తగ్గుతుంది. మీ పాత ఫోన్ కండిషన్‌ను బట్టి ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా గరిష్టంగా మరో రూ.39,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్ రూ.99,999 ధరకు లాంచ్ అవ్వగా, ఇప్పుడు దాదాపు రూ.41,799 తక్కువకే లభిస్తోంది.

Advertisement

Also Read: 8000mAh బ్యాటరీ, ఇన్‌-బిల్ట్ ఫ్యాన్‌తో రెడ్‌మి కొత్త ఫోన్.. ఫీచర్లు అరాచకం బాబోయ్!

ఈ ఫోన్‌లో 120Hz రీఫ్రెష్ రేట్ కలిగిన 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డైనమిక్ అమోలెడ్ మెయిన్ డిస్‌ప్లే ఉంది. దీనితో పాటు నోటిఫికేషన్లు చూసుకోవడానికి, క్విక్ సెల్ఫీల కోసం ఫోన్ వెలుపల ఫోల్డర్ ఆకారంలో ఉండే 3.4 ఇంచుల సూపర్ అమోలెడ్ కవర్ డిస్‌ప్లేను అందించారు.

Advertisement

ఈ ఫ్లిప్ ఫోన్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత వన్‌యూఐ 5.1.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. రోజువారీ పనులతో పాటు హెవీ గేమింగ్‌కు కూడా ఈ ప్రాసెసర్ అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది.

ఫోన్ వెనుక భాగంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కలిగిన రెండు 12 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్‌లో 5జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ మరియు ఐపీఎక్స్8 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

Also Read: 50 గంటల బ్యాటరీ లైఫ్‌తో హువావే కొత్త ఇయర్‌బడ్స్.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్, రేటు ఎంతంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×