E-Paper
Advertisement

Wi-Fi లేకుండానే వాడేసుకోవచ్చా? శాంసంగ్ సరికొత్త 5G రగ్గడ్ ట్యాబ్ ప్రత్యేకతలివే!

Wi-Fi లేకుండానే వాడేసుకోవచ్చా? శాంసంగ్ సరికొత్త 5G రగ్గడ్ ట్యాబ్ ప్రత్యేకతలివే!
Advertisement

Galaxy Tab Active 6: శాంసంగ్ కంపెనీ నుంచి రగ్గడ్ ట్యాబ్లెట్ సిరీస్‌లో మరో సరికొత్త మోడల్ రాబోతోంది. Galaxy Tab Active 5కి కొనసాగింపుగా Galaxy Tab Active 6ను మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ కసరత్తు చేస్తోంది. ఈ అప్‌కమింగ్ ట్యాబ్లెట్‌కు సంబంధించిన కొన్ని కీలక వివరాలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. ఆఫీస్ పనులకు, ఫీల్డ్ వర్క్ చేసేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

ఎప్పుడు లాంచ్ కానుంది?

ఈ ట్యాబ్లెట్ లాంచ్‌పై శాంసంగ్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. ఇది 2027 ప్రారంభంలో గ్లోబల్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ డివైజ్ SM-X316B మోడల్ నెంబర్‌తో తయారవుతున్నట్లు సమాచారం. మునుపటి మోడల్స్ కంటే ఇది మరింత బలంగా, వేగంగా పనిచేస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Also Read: ఫొటో తీశాక కూడా బ్యాక్‌గ్రౌండ్‌ మార్చేయొచ్చు.. Apple Intelligence సరికొత్త మ్యాజిక్ అదే మరి!

5G సపోర్ట్, సరికొత్త సాఫ్ట్‌వేర్:

ఇందులో 5G కనెక్టివిటీని ప్రామాణికంగా అందించనున్నారు. దీనివల్ల వైఫై లేని ప్రాంతాల్లో, మారుమూల ప్రదేశాలలో కూడా ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. అలాగే ఈ ట్యాబ్లెట్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ యూఐ 9 సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది యూజర్లకు చాలా స్మూత్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది.

ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయి?

Advertisement

కఠినమైన వాతావరణంలో తట్టుకునేలా దీని బాడీ డిజైన్ ఉండనుంది. మెరుగైన ప్రాసెసర్, ఎక్కువ కాలం మన్నిక వచ్చే బ్యాటరీ, అప్‌గ్రేడెడ్ నెట్‌వర్క్ ఫీచర్లు దీనిలో ఉండబోతున్నాయి. శాంసంగ్ సిగ్నేచర్ S-పెన్ సపోర్ట్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా.. బిజినెస్ అవసరాల కోసం గట్టి సెక్యూరిటీ ఫీచర్లను కూడా జోడించనున్నారు.

మునుపటి మోడల్ విశేషాలు:

గతంలో వచ్చిన ట్యాబ్ యాక్టివ్ 5 విషయానికి వస్తే.. అది 8 ఇంచుల డిస్‌ప్లే, 5ఎన్ఎమ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 5050mah రిమూవబుల్ బ్యాటరీ, ఐపీ68 రేటింగ్‌తో వచ్చింది. ఇప్పుడు రాబోతున్న కొత్త మోడల్ అంతకంటే మెరుగైన కెమెరా, డిస్‌ప్లేతో పాటు అద్భుతమైన ఫీచర్లతో అలరించనుంది. ఈ ట్యాబ్ ధర, పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read: Samsung Galaxy A27: శాంసంగ్ నుంచి మోస్ట్ అవేటెడ్ ఫోన్.. భారీగా పెరిగన ధర!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×