E-Paper
Advertisement

భారీగా తగ్గిన Samsung Galaxy S26 సిరీస్ ధరలు.. మే 27 వరకే ఛాన్స్, ఎలా కొనుగోలు చేయాలంటే?

భారీగా తగ్గిన Samsung Galaxy S26 సిరీస్ ధరలు.. మే 27 వరకే ఛాన్స్, ఎలా కొనుగోలు చేయాలంటే?
Advertisement

Galaxy S26 Ultra Price Cut: శాంసంగ్ ఫోన్లు అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. అయితే చాలామంది ఈ ప్రీమియం ఫోన్ల ధరలు చూసి కొనుగోలు చేయలేమని వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసం శాంసంగ్ ఒక క్రేజీ గుడ్ న్యూస్ చెప్పింది. మే 4 నుంచి మే 27 వరకు తమ పాపులర్ ఫోన్లపై భారీగా ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా అందరూ ఎంతో ఆశగా చూసే Galaxy S26 Ultra ఇప్పుడు మునుపెన్నడూ లేనంత తక్కువ ధరకే అమెజాన్ ఇండియాలో దొరుకుతోంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ డిస్కౌంట్ కోసం ఏ బ్యాంక్ కార్డులు వాడక్కర్లేదు, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్‌‌గా ధర తగ్గించేశారు.

Ultra ధర ఎంత తగ్గిందంటే?

మీరు గనుక Galaxy S26 అల్ట్రాను సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే.. ఇంత కంటే మంచి ఛాన్స్ మళ్లీ రాదనే చెప్పాలి. ఈ ఫోన్‌పై సంస్థ ఏకంగా రూ.9,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తోంది. దీనివల్ల 12GB + 256GB వేరియంట్ ధర రూ.1,30,999 దిగొచ్చింది. మిగతా ఎక్కువ స్టోరేజ్ ఉన్న మోడల్స్‌పై కూడా ఇదే డిస్కౌంట్ ఉంది. ఇంకా నమ్మలేని విషయం ఏంటంటే.. అమెజాన్‌లో కొన్ని డీల్స్ కలిపితే బేస్ మోడల్ కేవలం రూ.1,23,990కే దొరికే అవకాశం ఉంది.

S26పైనా తగ్గని క్రేజ్..

Advertisement

కేవలం Ultra మాత్రమే కాదు.. స్టాండర్డ్ Galaxy S26 మీద కూడా శాంసంగ్ భారీ తగ్గింపు ఇస్తోంది. ఈ ఫోన్‌పై సుమారు రూ.8,000 వరకు ధర తగ్గింది. దీంతో 256GB మోడల్‌ను ఇప్పుడు రూ.79,999కే సొంతం చేసుకోవచ్చు. ప్రీమియం ఫోన్ వాడాలని ఉన్నా.. బడ్జెట్ కొంచెం తక్కువగా ఉన్న వారికి ఈ ఆఫర్ పెద్ద ఊరట అని చెప్పాలి. లక్ష రూపాయల లోపే శాంసంగ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ రావడం అంటే మామూలు విషయం కాదు కదా.

Also Read: 7000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లే.. Xiaomi 17T Pro ఫీచర్లు లీక్, ధరెంతో తెలిస్తే షాకవ్వడం ఖాయం!

తక్కువ బడ్జెట్‌లో Galaxy A57..

Advertisement

హై ఎండ్ ఫోన్లు మాత్రమే కాదు.. అందరికీ అందుబాటులో ఉండేలా A సిరీస్ ఫోన్లపై కూడా ఆఫర్లు ఉన్నాయి. గెలాక్సీ A57 మోడల్‌పై శాంసంగ్ రూ.7,000 వరకు తగ్గింపు ఇచ్చింది. ఇప్పుడు దీని 8GB వేరియంట్ కేవలం రూ.49,999కే లభిస్తోంది. మంచి లుక్, అదిరిపోయే ఫీచర్లు కావాలనుకునే మిడ్‌రేంజ్ యూజర్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. స్టైలిష్‌గా కనిపిస్తూనే.. బడ్జెట్‌లో వచ్చేసే ఫోన్ ఇది.

టెక్ లవర్స్ ఫేవరెట్ Galaxy A37..

మరీ ఎక్కువ ఖర్చు పెట్టలేం అనుకునే వారి కోసం గెలాక్సీ A37 ఉంది. దీనిపై రూ.5,000 డిస్కౌంట్ ప్రకటించారు. దీంతో ఈ ఫోన్ ఇప్పుడు కేవలం రూ.36,999కే అందుబాటులోకి వచ్చింది. మార్కెట్లో స్మార్ట్ ఫోన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ప్రస్తుత రోజుల్లో, ఎలాంటి బ్యాంక్ కండిషన్లు లేకుండా శాంసంగ్ నేరుగా ధరలు తగ్గించడం నిజంగా గ్రేట్. ఈ మే 27 లోపు ఆన్‌లైన్ లో గానీ, మీకు దగ్గర్లోని స్టోర్‌లో గానీ ఈ ఫోన్లను తక్కువ ధరకే కొనేయొచ్చు.

Also Read: జస్ట్ రూ.250కే ఏసీ లాంటి చల్లదనం.. ఈ పిచ్చి ఎండలకు ఇదే కరెక్ట్ సొల్యూషన్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×