E-Paper
Advertisement

శాంసంగ్‌లో అద్భుతమైన హిడెన్ ఫీచర్.. తెలిస్తే ఆశ్చర్యపోవడం గ్యారంటీ!

శాంసంగ్‌లో అద్భుతమైన హిడెన్ ఫీచర్.. తెలిస్తే ఆశ్చర్యపోవడం గ్యారంటీ!
Advertisement

Samsung Webcam: శాంసంగ్ తన గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం ఒక అద్భుతమైన ‘హిడెన్’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా కొత్తగా వచ్చిన Galaxy S26 సిరీస్ ఫోన్లను ఇప్పుడు నేరుగా మీ PC లేదా లాప్‌టాప్‌కు వెబ్‌క్యామ్ (Webcam) లాగా ఉపయోగించుకోవచ్చు. ఇంతకీ ఈ ఏంటీ ఫీచర్? ఎలా పనిచేస్తుంది? ఈ ఏవిధంగా ఈ హిడెన్ ఫీచర్ ను వినియోగించాలి? ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఏమిటీ ఫీచర్?

సాధారణంగా లాప్‌టాప్‌లలో ఉండే వెబ్‌క్యామ్ క్వాలిటీ అంత బాగుండదు. దీన్ని అధిగమించడానికి శాంసంగ్ తన ఫోన్లలోని పవర్‌ఫుల్ కెమెరాలను కంప్యూటర్ వెబ్‌క్యామ్‌గా మార్చుకునేలా ‘నేటివ్ వెబ్ కామ్ సపోర్ట్’ (Native Webcam Support)ను అందించింది. దీని కోసం మీరు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదని శాంసంగ్ వర్గాలు స్పష్టం చేశాయి.

ఎలా పనిచేస్తుంది?

Advertisement

వెబ్ కామ్ సపోర్ట్ కోసం కొన్ని స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. ముందుగా ఫోన్‌ను USB-C కేబుల్ ద్వారా కంప్యూటర్‌కు కనెక్ట్ చేయాలి. అనంతరం ఫోన్‌లో యూఎస్‌బీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘Use USB for’ అనే ఆప్షన్ కింద ‘Webcam’ను ఎంచుకోవాలి. తద్వారా మీరు ఫోన్ వెనుక ఉండే మెయిన్ కెమెరా లేదా సెల్ఫీ కెమెరాను వెబ్ క్యామ్ గా ఉపయోగించుకోవచ్చు. ఇందులో ‘High Quality Mode’ ను యాక్టివేట్ చేయడం ద్వారా అత్యుత్తమ వీడియో క్వాలిటీని యూజర్ పొందవచ్చు.

Also Read: Airtel, Jio, Vi.. చౌకైన వార్షిక ప్లాన్స్‌కు.. మూడింటిలో ఏది బెస్ట్?

ఏ ఫోన్లలో ఈ ఫీచర్ వాడుకోవచ్చు!

Advertisement

ప్రస్తుతానికి ఈ ఫీచర్ One UI 8.5తో వస్తున్న Galaxy S26, S26 Plus, S26 Ultra ఫోన్లలో మాత్రమే ఈ వెబ్ కామ్ ఫీచర్ అందుబాటులో ఉంది. భవిష్యత్తులో పాత ఫోన్లకు కూడా అప్‌డేట్ ద్వారా ఈ హిడెన్ ఫీచర్ వచ్చే అవకాశముందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ వెబ్ కామ్ ఫీచర్.. విండోస్ (Windows), మాక్ ఓఎస్ (macOS) రెండింటిలోనూ పనిచేయనుంది. జూమ్ (Zoom), గూగుల్ మీట్ (Google Meet), మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి అన్ని వీడియో కాలింగ్ యాప్స్‌లో దీనిని ఉపయోగించుకోవచ్చు.

Also Read:ఐర్లాండ్‌లో జాబ్.. రూ.96 లక్షల జీతం.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న టెక్కీ!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×