E-Paper
Advertisement

అమెజాన్ ప్రైమ్ డే సేల్.. దెబ్బకు పడిపోయిన శాంసంగ్ ఎస్25 అల్ట్రా ధర

అమెజాన్ ప్రైమ్ డే సేల్.. దెబ్బకు పడిపోయిన శాంసంగ్ ఎస్25 అల్ట్రా ధర
Advertisement

Samsung S25 Ultra Price Drop: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ప్రియులకు అమెజాన్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ప్రారంభం కాబోతున్న ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్’ (Amazon Prime Day Sale) లో శాంసంగ్ మోస్ట్ పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అయిన ‘Samsung Galaxy S25 Ultra’ పై కలలో కూడా ఊహించని రేంజ్‌లో భారీ డిస్కౌంట్ లభించనుంది. లాంచ్ అయినప్పటి నుంచి లక్షకు పైనే ఉన్న ఈ అల్ట్రా ప్రీమియం ఫోన్, ఇప్పుడు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో కలిపి ఏకంగా రూ.90వేలలోపు ధరకే సొంతం చేసుకునే లక్కీ ఛాన్స్ రాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అమెజాన్ ప్రైమ్ డే ధమాకా:

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆపిల్ ఐఫోన్‌కు గట్టి పోటీ ఇచ్చే ఏకైక సిరీస్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ అల్ట్రా’. ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన Samsung Galaxy S25 Ultra 5G ఫీచర్స్ పరంగా.. ఏఐ టెక్నాలజీ పరంగా సంచలనం సృష్టించింది. అయితే దీని ధర ఎక్కువ ఉండటం వల్ల చాలా మంది కొనలేకపోయారు. అలాంటి వారికి జులై 4 నుంచి జులై 6 వరకు జరిగే ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026’ ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి.

Advertisement

అసలు ధర ఎంత? సేల్‌లో ఎంత డిస్కౌంట్?

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా బేస్ వేరియంట్ (12GB RAM + 256GB Storage) దాదాపు రూ. 1,29,999 కి లాంచ్ అయ్యింది. ప్రస్తుతం మార్కెట్లో ఆఫర్లతో కలిపి రూ. 1,19,999 కి లభిస్తోంది. కానీ..రాబోయే అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో దీనిపై డైరెక్ట్ ప్రైస్ కట్ , బ్యాంక్ డిస్కౌంట్లు కలిపి భారీగా తగ్గించనున్నారు.

Advertisement

లాంచ్ ప్రైస్: రూ.1,29,999

అమెజాన్ సేల్ ప్రైస్ (కట్ ప్రైస్):రూ.99,999 కి లిస్ట్ చేయబడనుంది.

బ్యాంక్ ఆఫర్లు & కార్డ్ డిస్కౌంట్లు: ఎస్‌బీఐ (SBI) లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 10% వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఎఫెక్టివ్ ఫైనల్ ప్రైస్: ఇవన్నీ కలుపుకుంటే ఫోన్ ఫైనల్ ప్రైస్ రూ. 90,000 కంటే తక్కువకే (రూ.85,000-రూ.89,999 మధ్యలో) రావడం ఖాయంగా కనిపిస్తోంది. పాత ప్రీమియం ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే ఈ ధర మరింత తగ్గే అవకాశం ఉంది.

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఎందుకు కొనాలి?

ఈ రేంజ్ ప్రైస్ డ్రాప్‌లో ఈ ఫోన్ దొరకడం అంటే వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. ఇందులో ఉన్న అద్భుతమైన ఫీచర్లు ఇవే..

నెక్స్ట్ లెవెల్ డిస్‌ప్లే: ఇందులో 6.9-ఇంచుల డైనమిక్ LTPO AMOLED డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఎండలో కూడా స్క్రీన్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది.

Also Read: అమెజాన్ సేల్.. బడ్జెట్‌‌లోనే డీప్ ఫ్రీజర్స్

200 MP పవర్‌ఫుల్ కెమెరా: ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఇది ఒక వరం. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ ఉంది. ఇది అల్ట్రా-జూమ్ ఫోటోలను కూడా బ్లర్ కాకుండా అద్భుతంగా తీస్తుంది.

Galaxy AI ఫీచర్స్: ఫేక్ ఎలిమెంట్స్ తొలగించడం, లైవ్ కాల్ ట్రాన్స్‌లేషన్, నోట్స్ ఆటో-సమ్మరైజ్ చేయడం వంటి ఎన్నో అడ్వాన్స్‌డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

ఎస్-పెన్ (S-Pen) సపోర్ట్: నోట్స్ రాసుకోవడానికి.. ఆఫీస్ ప్రెజెంటేషన్స్ కంట్రోల్ చేయడానికి, కెమెరాను రిమోట్‌గా ఆపరేట్ చేయడానికి ఇన్-బిల్ట్ ఎస్-పెన్ లభిస్తుంది.

మీరు చాలా రోజులుగా ఒక అల్ట్రా-ప్రీమియం ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. మీ బడ్జెట్ లక్ష రూపాయల లోపు ఉంటే.. ఖచ్చితంగా అమెజాన్ ప్రైమ్ డే సేల్ వరకు ఆగడం మంచిది. రూ.90,000 లోపు ధరలో Samsung Galaxy S25 Ultra లభించడం అనేది ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ , బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×