E-Paper
Advertisement

Samsung Galaxy S25 FEపై పిచ్చెక్కించే డిస్కౌంట్.. రూ.12,000 ఆదా చేసుకునే లక్కీ ఛాన్స్!

Samsung Galaxy S25 FEపై పిచ్చెక్కించే డిస్కౌంట్.. రూ.12,000 ఆదా చేసుకునే లక్కీ ఛాన్స్!
Advertisement

Amazon Summer Sale: ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నడుస్తోంది కదా.. దాదాపు అన్ని ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. ఒకవేళ మీ వద్ద రూ.50వేల లోపు బడ్జెట్ ఉండి, ఆల్‌రౌండర్ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం.. ఈ Samsung Galaxy S25 FEపై ఓ లుక్కేయండి. శాంసంగ్ కంపెనీ మార్కెట్లోకి సరికొత్త ఫోల్డబుల్ ఫోన్లను తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్న టైంలో.. ఈ ఫోన్‌పై ఏకంగా రూ.12,000 పైగా తగ్గించేశారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో దొరుకుతున్న బెస్ట్ డీల్స్‌లో ఇది ఒకటి. ఇప్పుడీ డీల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

ఆఫర్ల సంగతేంటి?

అమెజాన్‌లో ఈ శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫోన్ అసలు ధర మీద 19 శాతం తగ్గి, ప్రస్తుతం రూ.48,899కే దొరుకుతోంది. ఒకవేళ మీరు గనుక అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే.. ఇంకో రూ.1,466 డిస్కౌంట్ కొట్టేయొచ్చు. దీంతో మీకు లాస్ట్‌గా రూ.47,433కే ఈ ఫోన్ చేతికి వచ్చేస్తుంది. అంత బడ్జెట్ ఒకేసారి పెట్టలేం అనుకుంటే.. నెలకు రూ.1,719 చొప్పున నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. లేదంటే మీ పాత ఫోన్ కండిషన్ బాగుంటే.. దాన్ని ఎక్స్ఛేంజ్ చేసి గరిష్టంగా రూ.41,500 వరకు ప్రైస్ తగ్గించుకోవచ్చు. అలాగే మీకు సొంతంగా బిజినెస్ ఉండి జీఎస్టీ బిల్ తీసుకుంటే.. మరో 18 శాతం టాక్స్ సేవ్ అవుతుంది.

Advertisement

Also Read: ఈ ఫోన్‌తో రీల్స్ చేస్తే వ్యూస్ రాకెట్‌లా దూసుకెళ్తాయ్.. 4K ఫ్లాష్ రికార్డింగ్‌తో Honor 600 సంచలనం!

అసలు ఈ ఫోన్ లో ఏముంది?

తక్కువ ధరలో ప్రీమియం ఫీలింగ్ ఇచ్చే ఫోన్ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఇందులో శాంసంగ్ కిరాక్ ఫీచర్ అయిన Galaxy AIతో పాటు, కలర్స్ అదిరిపోయే 6.7 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. వీటన్నింటికంటే హైలైట్ ఏంటంటే.. ఈ ఫోన్‌కు ఏకంగా 7 ఏళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇస్తామని శాంసంగ్ ప్రామిస్ చేస్తోంది. చేతిలో పట్టుకుంటే ఎంతో స్లిమ్‌గా (7.4 మిమీ) ఉండే ఈ ఫోన్‌లో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, గూగుల్ జెమిని లైవ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

గేమింగ్ ఎక్కువగా ఆడుతారా?

Advertisement

రఫ్ అండ్ టఫ్‌గా వాడుకోవడానికి ఈ డిస్కౌంట్ ప్రైస్‌లో ఇది వాల్యూ ఫర్ మనీ ఫోన్. కానీ ఫోన్‌లో హెవీగా గేమ్స్ ఆడేవారైతే మాత్రం.. దీనికి కాస్త దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే.. దీనిలో ఉన్న ఎక్సినోస్ 2400 ప్రాసెసర్ వల్ల ఫోన్ కాస్త వేడెక్కే ఛాన్స్ ఉంది. పైగా ఏఐ ఫీచర్లు ఉన్న ఫోన్ లో 8GB RAM మాత్రమే ఇవ్వడం కొంచెం తక్కువ అనిపిస్తుంది. కెమెరా కూడా పాత మోడల్ లాగే ఉంటుంది. కాబట్టి.. గేమ్స్ ఎక్కువ ఆడకుండా, మంచి బ్రాండెడ్ ప్రీమియం ఫోన్ కావాలనుకునే వారికి ఈ ఫోన్ బెస్ట్ అని చెప్పొచ్చు.

Also Read: హోటళ్లలో QR కోడ్ స్కాన్ చేస్తున్నారా? జాగ్రత్త సుమీ.. ఈ ఒక్క తప్పుతో మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వొచ్చు!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×