E-Paper
Advertisement

Galaxy S25 సిరీస్ ఫోన్లలో అండ్రాయిడ్ 17, One UI 9 టెస్టింగ్ షురూ చేసిన శాంసంగ్!

Galaxy S25 సిరీస్ ఫోన్లలో అండ్రాయిడ్ 17, One UI 9 టెస్టింగ్ షురూ చేసిన శాంసంగ్!
Advertisement

One UI 9 Update: శాంసంగ్ సంస్థ ఇటీవల Galaxy S25 సిరీస్‌ను అండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.5 వెర్షన్‌తో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను పాత మోడల్ ఫోన్లకు కూడా వేగంగా అందిస్తోంది. ఇదిలా ఉండగానే.. శాంసంగ్ తమ తదుపరి పెద్ద సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయిన One UI 9పై అప్పుడే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ తరుణ్ వాట్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న సమాచారం ప్రకారం.. Galaxy S25 సిరీస్ ఫోన్ల కోసం కంపెనీ ఇప్పటికే అంతర్గతంగా ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌ను టెస్ట్ చేయడం ప్రారంభించింది.

ముందే మొదలైన కసరత్తు:

సాధారణంగా శాంసంగ్ తమ కొత్త సాఫ్ట్‌వేర్ ట్రయల్స్‌ను జూన్ నెల మధ్యలో ప్రారంభిస్తూ ఉంటుంది. గతేడాది Galaxy S24 సిరీస్ కోసం వన్ యూఐ 8 టెస్ట్ రన్ జూన్ 19న కనిపించింది. అయితే ఈసారి మాత్రం రెండు వారాల ముందే వన్ యూఐ 9 టెస్టింగ్ బిల్డ్‌ను గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే అండ్రాయిడ్ 17 ఆధారంగా రాబోతున్న ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను శాంసంగ్ ఎంత వేగంగా డెవలప్ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లోని పాత మోడళ్లకు వన్ యూఐ 8.5 రోల్ అవుట్ పూర్తయిన తర్వాత, Galaxy S25 సిరీస్ వినియోగదారులకు ఈ కొత్త వన్ యూఐ 9 బీటా వెర్షన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Also Read: Tecno Pova 8 లాంచ్ డేట్ లీక్.. 8000mAh బ్యాటరీతో బడ్జెట్ ఫోన్లకు టఫ్ కాంపిటీషన్!

కొత్త ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయి?

ఇప్పటికే Galaxy S26 సిరీస్ కోసం వన్ యూఐ 9 బీటా ప్రోగ్రామ్‌ను శాంసంగ్ ప్రకటించింది. దీనిలో భాగంగా యూజర్లకు మెరుగైన అనుభూతిని ఇచ్చేలా క్విక్ ప్యానెల్‌ను రీడిజైన్ చేశారు. నోట్స్ యాప్‌లో కొత్త డెకరేటివ్ టేపులు, పెన్ లైన్ స్టైల్స్ వంటి మార్పులు చేశారు. కాంటాక్ట్స్ యాప్ నుండి నేరుగా క్రియేటివ్ స్టూడియోను వాడుకునే సదుపాయం కల్పించారు. అలాగే చూపు సరిగ్గా లేని వారి కోసం టాక్‌బ్యాక్ ప్యాకేజీని అప్‌గ్రేడ్ చేయడంతో పాటు, స్క్రీన్‌పై ఉన్న టెక్స్ట్‌ను పెద్దదిగా చూపే ‘టెక్స్ట్ స్పాట్‌లైట్’ అనే ఫ్లోటింగ్ విండో ఫీచర్‌ను కూడా తీసుకురానున్నారు.

భద్రతతో పాటు ఏఐ హంగులు:

Advertisement

ఈ సరికొత్త వన్ యూఐ 9 అప్‌డేట్‌లో కేవలం లుక్ మాత్రమే కాకుండా.. భద్రతకు కూడా శాంసంగ్ పెద్ద పీట వేసింది. యూజర్ల పర్సనల్ డేటా మరింత సేఫ్‌గా ఉండేలా కొత్త సెక్యూరిటీ ఫీచర్లను జోడించింది. వీటన్నింటితో పాటు ఈ కాలానికి తగ్గట్టుగా స్మార్ట్‌ఫోన్ పనితీరును మరింత స్మార్ట్‌గా మార్చే పలు ఏఐ ఫీచర్లు కూడా ఈ అప్‌డేట్ ద్వారా పాత ఫ్లాగ్‌షిప్ ఫోన్లలోకి రానున్నాయి. రాబోయే కొద్ది నెలల్లోనే ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తి స్థాయిలో అర్హత గల డివైజ్‌లకు అందుబాటులోకి రానుంది.

Also Read: WhatsAppలో ఈ ఒక్క సెట్టింగ్ OFFలో ఉంటే.. మీ పర్సనల్ చాట్స్ హాకర్ల చేతికి చిక్కినట్టే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×