E-Paper
Advertisement

ఒక్కసారిగా పడిపోయిన Samsung Galaxy S24 FE ధర.. Flipkart May Saleలో ఇదో క్రేజీ డీల్!

ఒక్కసారిగా పడిపోయిన Samsung Galaxy S24 FE ధర.. Flipkart May Saleలో ఇదో క్రేజీ డీల్!
Advertisement

Galaxy S24 FE Price Drop: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ S సిరీస్ ఫోన్ వాడాలనేది చాలామంది టెక్ ప్రియుల కోరిక. కానీ, వాటి ధరలు చూసి వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసమే శాంసంగ్ ‘ఫ్యాన్ ఎడిషన్’ (FE) మోడల్స్‌ను తీసుకొస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే సేల్‌తో మన ముందుకు వచ్చింది. దీనిలో Samsung Galaxy S24 FEపై ఎవరూ ఊహించని రేంజ్‌లో డిస్కౌంట్ లభిస్తోంది. మీరు గనుక కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. అసలు ఈ డీల్‌ను వదులుకోవద్దు.

ఎంత ధర తగ్గిందంటే?

సాధారణంగా Galaxy S24 FE లాంచ్ అయినప్పుడు దాని రేటు కాస్త ఎక్కువే ఉండేది. కానీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సేల్‌ పుణ్యమా అని దాదాపు రూ.10,000 వరకు ధర తగ్గిపోయింది. మార్కెట్లో రూ.60,000 వరకు ఉన్న ఈ ఫోన్, ప్రస్తుతం అన్ని డిస్కౌంట్లు కలుపుకుంటే కేవలం రూ.45,000 నుండి రూ.48,000కే దొరుకుతోంది. ఒక ప్రీమియం రేంజ్ ఫోన్ ఈ ధరకు రావడం అంటే నిజంగా క్రేజీ ఆఫర్ అని చెప్పాలి. ముఖ్యంగా ఇందులో ఉండే లేటెస్ట్ AI ఫీచర్ల కోసం ఈ రేటు చాలా తక్కువ.

ఎక్స్ఛేంజ్ బోనస్ అదిరింది..

Advertisement

కేవలం ఫోన్ ధర తగ్గడమే కాకుండా.. మన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డులను వాడితే ఇంకాస్త తక్కువకే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ బ్యాంకుల కార్డులపై రూ.3,000 వరకు అదనంగా తగ్గింపు ఇస్తున్నారు. ఒకవేళ మీరు గనుక మీ పాత ఫోన్‌ను ఎక్ఛేంజ్ చేసుకోవాలి అనుకుంటే.. ఇంత కంటే మంచి సమయం మళ్లీ రాదు. పాత ఫోన్‌ను ఎక్ఛేంజ్ చేసుకుంటే.. మరికొంత నగదు తగ్గించుకోవచ్చు. ఇవన్నీ కలిస్తే.. తక్కువ బడ్జెట్‌‌కే ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ వచ్చేస్తుంది.

Also Read: అస్సలు లాగ్ అవ్వదు.. ఛార్జింగ్ అయిపోదు.. ట్రెండింగ్‌లో ఉన్న గేమర్ల ఫేవరెట్ ఫోన్లు ఇవే!

ఈ ఫోన్ ఎందుకంత ప్రత్యేకం?

Advertisement

ఈ Samsung Galaxy S24 FE డిస్‌ప్లే‌కు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. అలాగే దీనిలోని గెలాక్సీ AI ఫీచర్లు అయితే వేరే లెవల్ అనే చెప్పాలి. దీంతోపాటు ఫొటోల్లో అనవసరమైన వాటిని తీసేయడం, లైవ్ ట్రాన్స్‌లేషన్ వంటి ఫీచర్లు వంటి ఫీచర్లు ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా నెలబెట్టాయి. ఇక కెమెరా గురించి అయితే చెప్పక్కర్లేదు. పగలు రాత్రి అనే తేడా లేకుండా అద్భుతమైన ఫొటోలను క్లిక్ చేయవచ్చు. అంత బాగుంటుంది క్లారిటీ మరి.

ఈ డీల్‌ను పొందడమెలా?

ఫ్లిప్‌కార్ట్‌లో Samsung Galaxy S24 FE అని సెర్చ్ చేసి, అక్కడున్న బ్యాంక్ ఆఫర్లను చెక్ చేసుకుని ఆర్డర్ పెట్టేయడమే. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఇలాంటి భారీ సేల్స్ ఉన్నప్పుడు స్టాక్ చాలా వేగంగా అయిపోతుంటుంది. అందుకే నచ్చితే మాత్రం అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే ఆర్డర్ చేసేయడ్ ఉత్తమం.

Also Read: ఒక్కసారి ఈ ఫోన్ ఫీచర్లు చూశాక వేరేది కొనరు.. Galaxy A27తో శాంసంగ్ మాస్టర్ ప్లాన్, ఫుల్ డీటెయిల్స్ ఇవే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×