E-Paper
Advertisement

Samsung Galaxy S24 FE 5G: బ్లాక్‌బస్టర్ డీల్.. శాంసంగ్ 5G ఫోన్‌‌ ఆఫర్ ధర తెలిస్తే BUY NOW నొక్కేస్తారు!

Samsung Galaxy S24 FE 5G: బ్లాక్‌బస్టర్ డీల్.. శాంసంగ్ 5G ఫోన్‌‌ ఆఫర్ ధర తెలిస్తే BUY NOW నొక్కేస్తారు!
Advertisement

Samsung Galaxy S24 FE 5G: మార్కెట్‌లో బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విషయానికొస్తే ముందుగా గుర్తొచ్చేది శాంసంగ్. ఎందుకంటే.. ఈ బ్రాండ్ ఫోన్లకు బడ్జెట్ సెగ్మెంట్ నుంచి ప్రీమియం రేంజ్ వరకు భారీ క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలో బ్లాక్ ఫ్రైడే సందర్భంగా ప్రముఖ ఇ- కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్‌లపై బిగ్ డీల్ ప్రకటించింది. నవంబరు 28 వరకు జరిగే ఈ సేల్ స్మార్ట్‌ఫోన్‌లపై బంపర్ డిస్కౌంట్స్ అందిస్తుంది. అయితే, ఈ సేల్‌లో గతేడాది విడుదలైన శాంసంగ్ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి..

ఈ శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ విడుదలైన కొత్తలో 8GB RAM+128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999. అయితే ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే ఆఫర్‌లో భాగంగా దాదాపు రూ.28వేల తగ్గింపుతో కేవలం రూ.31,999 ధరకే లభిస్తోంది. అదనంగా సంస్థ ఈ ఫోన్‌పై 5% క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. దీనికి EMI ఆప్షన్ కూడా ఉంది. అంతేకాదు.. ఈ ఫోన్ పై గణనీయమైన ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తోంది.

Advertisement

Read Also: వచ్చేస్తోంది నథింగ్ ఫోన్ 3a లైట్.. దీని స్పెషాలిటీ తెలిస్తే మైండ్ బ్లాకే!

ఫీచర్ల విషయానికి వస్తే:

ఈ శాంసంగ్ గెలాక్సీ S24 FE స్మార్ట్ ఫోన్.. 6.7-అంగుళాల పూర్తి HD+ అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. డిస్‌ప్లే 1900 నిట్‌ల గరిష్ట ప్రకాశ స్థాయిని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8GB RAM+ 256GB వరకు అంతర్గత నిల్వతో లభిస్తుంది. ఎక్సినోస్ 2400e ప్రాసెసర్ ద్వారా శక్తిని ఈ ఫోన్ పొందుతుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా OneUI 6.1.1పై నడుస్తుంది.

పిక్చర్ క్వాలిటీ చూసుకుంటే:

Advertisement

శాంసంగ్ గెలాకీ 5G ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. అదనంగా, 12-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 8-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్‌ను జత చేశారు. ఇక సెల్ఫీల కోసం అయితే.. 10-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వచ్చింది. బ్యాటరీ పరంగా చూస్తే.. ఈ ఫోన్ 4700mAh బ్యాటరీ లైఫ్‌తో 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దదిస్తుంది. అలాగే.. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌‌ను కలిగి ఉంది.

Read Also: వచ్చేనెల వివో కొత్తఫోన్లు లాంచ్.. జీస్ ట్రిపుల్ కెమెరా టెక్నాలజీతో పిచ్చెక్కించే క్లారిటీ!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×