E-Paper
Advertisement

ఆండ్రాయిడ్ 16, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో Samsung Galaxy M47.. లాంచ్ ఎప్పుడంటే?

ఆండ్రాయిడ్ 16, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో Samsung Galaxy M47.. లాంచ్ ఎప్పుడంటే?
Advertisement

Samsung Galaxy M47: మన దేశంలో శాంసంగ్ ఫోన్లకు ప్రత్యేక ప్యాన్ బేస్ ఉంటుంది. అందుకే ఈ కంపెనీ నుంచి ఏ కొత్త ఫోన్ వస్తున్నా టెక్ ప్రియులు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇలాంటి వారి కోసమే త్వరలో శాంసంగ్ Galaxy M47 పేరుతో పవర్‌ఫుల్ మొబైల్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయడనప్పటికీ.. గీక్‌బెంచ్ అనే వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు లీకై బయటకొచ్చాయి.

ఈ ఫోన్‌లో వాడిన ప్రాసెసర్ గురించి చెప్పుకుంటే.. దీనిలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌ను వాడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో మొత్తం ఎనిమిది కోర్లు ఉంటాయి. అంటే.. మనం ఫోన్ వాడుతున్నప్పుడు ఎక్కడా లాగ్ అవ్వకుండా, స్పీడ్‌గా పని చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. దీనికి తోడు గ్రాఫిక్స్ అదిరిపోయేలా ఉండటం కోసం ఆడ్రినో 710 జీపీయూని కూడా పెడుతున్నారట. కాబట్టి గేమింగ్ ఇష్టపడేవాళ్లకు ఈ ఫోన్ బాగా నచ్చుతుంది.

Advertisement

Also Read: సీన్ రివర్స్.. 40 గంటల బ్యాటరీ లైఫ్‌తో మ్యాక్‌బుక్‌లకు చుక్కలు చూపిస్తున్న కొత్త విండోస్ లాప్‌టాప్స్!

ఇక సాఫ్ట్‌వేర్ విషయంలో శాంసంగ్ ఒక అడుగు ముందే ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రాబోతుందట. ఇక Ram విషయానికి వస్తే.. ఈ Samsung Galaxy M47లో కనీసం 8GB RAM ఉండే అవకాశం ఉందని టాక్. గీక్‌బెంచ్ టెస్టుల్లో కూడా ఈ ఫోన్ మంచి స్కోరు సాధించింది. దీన్ని బట్టి చూస్తే యాప్స్ ఓపెన్ చేసినా, మల్టీటాస్కింగ్ చేసినా ఫోన్ చాలా స్మూత్‌గా రన్ అవుతుందని అర్థమవుతోంది.

Advertisement

ఈ ఫోన్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మొబైల్ మోడల్ నెంబర్ కొన్ని డేటాబేస్‌లలో కనిపించింది. అంతేకాదు.. భారత్‌, నేపాల్ దేశాలకు సంబంధించిన శాంసంగ్ ఇంటర్నల్ టెస్టింగ్ సర్వర్లలో కూడా దీని పేరు వచ్చింది. కాబట్టి.. దీన్ని బట్టి చూస్తే ఇండియన్ మార్కెట్లోకి ఈ ఫోన్ చాలా త్వరగానే రాబోతుందని నమ్మకంగా చెప్పొచ్చు. గతంలో వచ్చిన గెలాక్సీ M44 మోడల్‌కు అప్‌గ్రేడ్‌గా ఈ సరికొత్త M47ను తీసుకొస్తున్నారు.

Also Read: ఛార్జింగ్ టెన్షన్‌కు ఎండ్ కార్డ్.. భారీ బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లతో అమెజాన్‌లోకి వచ్చేసిన Redmi Turbo 5!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×