E-Paper
Advertisement

Samsung Galaxy M14 @ Rs 499: బంపరాఫర్.. టీ-షర్ట్ ధరకే స్మార్ట్‌ఫోన్.. డోంట్ మిస్!

Samsung Galaxy M14 @ Rs 499: బంపరాఫర్.. టీ-షర్ట్ ధరకే స్మార్ట్‌ఫోన్.. డోంట్ మిస్!
Advertisement

Get Samsung Galaxy M14 at Rs 499 Only: శామ్‌సంగ్ కంపెనీ స్మార్ట్‌ఫోన్లకు మార్కెట్‌లో సూపర్ డిమాండ్ ఉంది. బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ చేస్తూ శామ్‌సంగ్ కంపెనీ ఫోన్ ప్రియులను ఆకర్షిస్తోంది. అయితే ఇటీవల ఈ కంపెనీ నుంచి విడుదలైన ఓ స్మార్ట్‌ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్ ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చిన ఈ మొబైల్‌ను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. మరి ఈ ఫోన్‌కి సంబంధించిన ఆఫర్ వివరాలు, స్పెసిఫికేషన్ వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Advertisement

శామ్‌సంగ్ కంపెనీ ఇటీవల భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 14 4జీ (Samsung Galaxy M14 4G) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనిని రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్, అలాగే 6జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చింది.

అయితే ఇప్పుడు ఈ వేరియంట్లపై ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. దీని 4/64 జీబీ వేరియంట్ ధర రూ.13,999 ఉండగా.. ఇప్పుడు అమెజాన్‌లో కేవలం రూ.8,499కే లిస్ట్ అయింది. అలాగే 6/128జీబీ వేరియంట్ ధర రూ.16,999 ఉండగా.. ఇప్పుడు రూ.11,499కే సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: మాస్ ఆఫర్.. ఒక్క బిర్యాని ప్యాకెట్ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్.. ఇది మామూలు ఆఫర్ కాదు భయ్యా!

అయితే వీటిపై పలు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ ఆఫర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మరింత తక్కువ ధరకే కొనుక్కొని ఇంటికి పట్టికెళ్లొచ్చు. వన్‌కార్డు క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్సక్షన్‌పై రూ.1200 వరకు ఫ్లాట్ తగ్గింపు పొందొచ్చు. అలాగే వన్‌కార్డు క్రెడిట్ కార్డు నాన్-ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.750వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఇవి కాకుండా భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ 4/64జీబీ వేరియంట్ రూ.8,499 ఉండగా.. ఇప్పుడు దీనిపై రూ.8000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. అయితే ఈ డిస్కౌంట్ అనేది పాత ఫోన్ కండీషన్ బడ్డి మారుతూ ఉంటుంది. ఒకవేళ ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ మొత్తం వర్తిస్తే.. ఈ వేరియంట్‌ను కేవలం రూ.499కే కొనుక్కోవచ్చు.

అలాగే 6/128 జీబీ వేరియంట్ రూ.11,499 ఉండగా.. ఇప్పుడు దీనిపై రూ.10,350 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఇది కూడా పాతఫోన్ కండీషన్ బట్టి ధర మారుతూ ఉంటుంది. ఒకవేళ ఇది కూడా పూర్తిగా వర్తిస్తే ఈ వేరియంట్ రూ.1149కే సొంతం చేసుకోవచ్చు. అయితే పిన్‌కోడ్ బట్టి కూడా ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ మారే అవకాశం ఉంది.

Also Read: సెకండ్ హ్యాండ్ ఫోన్ కంటే తక్కువ ధరకే కొత్త స్మార్ట్‌ఫోన్!

ఒక రకంగా చూస్తే ఈ మొబైల్ బేస్ వేరియంట్‌ను అతి తక్కువ ధరకే అంటే బ్రాండెడ్ టీ-షర్ట్ ధరకే కొనుక్కోవచ్చు అన్నమాట.

ఇది 6.7-అంగుళాల స్క్రీన్‌ని కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. అంతేకాకుండా ఫోన్ వెనుక భాగంలో 50+ 2+2 మెగా పిక్సెల్‌తో వస్తుంది. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 13మెగా పిక్సెల కెమెరాను అమర్చారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×