E-Paper
Advertisement

Samsung నుంచి సరికొత్త AI స్మార్ట్ గ్లాసెస్.. ఎలా పనిచేస్తాయో లీక్ చేసిన కంపానియన్ యాప్!

Samsung నుంచి సరికొత్త AI స్మార్ట్ గ్లాసెస్.. ఎలా పనిచేస్తాయో లీక్ చేసిన కంపానియన్ యాప్!
Advertisement

Samsung Galaxy Glasses: గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఆండ్రాయిడ్ షోలోనే శాంసంగ్ తమ వేరబుల్స్ విభాగంలో సరికొత్త మార్పులు తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో కూడిన సరికొత్త స్మార్ట్ గ్లాసెస్‌ను త్వరలోనే తీసుకురానున్నట్లు సంస్థ స్పష్టం చేసింది.

ఇటీవల జరిగిన Google I/O సదస్సులో ప్రముఖ ఐవేర్ బ్రాండ్లు వార్బీ పార్కర్, జెంటిల్ మాన్‌స్టర్‌లతో కలిసి తయారు చేసిన రెండు మోడళ్లను కూడా ప్రదర్శించింది. అయితే తాజాగా ఈ స్మార్ట్ గ్లాసెస్‌కు సంబంధించిన కొన్ని కీలక వివరాలు, వాటి ఛార్జింగ్ కేస్ ఫొటోలు ఓ యాప్ స్క్రీన్‌షాట్ ద్వారా ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

గెలాక్సీ గ్లాసెస్ మేనేజర్ యాప్:

Advertisement

శాంసంగ్ గెలాక్సీ గ్లాసెస్‌ను కంట్రోల్ చేయడానికి ‘గెలాక్సీ గ్లాసెస్ మేనేజర్’ అనే ప్రత్యేకమైన కంపానియన్ యాప్‌ను సంస్థ తీసుకొస్తోంది. ఈ యాప్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీని ప్రకారం చూస్తే.. ఈ స్మార్ట్ గ్లాసెస్ స్టైలిష్ బ్లాక్ కలర్ ఛార్జింగ్ కేస్‌తో రానున్నట్లు తెలుస్తోంది. వినియోగదారులు తమ ఫోన్‌లో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని, అవసరమైన పర్మిషన్లు ఇచ్చిన తర్వాత స్మార్ట్ గ్లాసెస్‌ను ఫోన్‌తో చాలా సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు.

Also Read: లాంచ్ స్ట్రాటజీ మార్చిన Huawei.. కొత్త ఫోన్ల కోసం ఎదురుచూస్తున్న యూజర్లకు గుడ్ న్యూస్, కానీ..

ఫోన్‌తో కనెక్ట్ చేయడం ఎలా?

Advertisement

లీకైన వివరాల ప్రకారం.. ఈ గెలాక్సీ గ్లాసెస్‌ను ఫోన్‌తో కనెక్ట్ చేయడానికి ముందస్తుగా గ్లాసెస్ నోస్ బ్రిడ్జ్‌పై ఉన్న ప్రొటెక్టివ్ ఫిలిమ్‌ను తొలగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత గ్లాసెస్ ఎడమ వైపు ఉండే పవర్ స్విచ్‌ను ముందుకు జరపాలి. ఆ తర్వాత ఈ గ్లాసెస్‌ను ఛార్జింగ్ కేస్‌లో ఉంచాలని యాప్ సూచిస్తుంది. కేస్ మీదున్న లైట్ బ్లింక్ అవ్వడం ప్రారంభం కాగానే, బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు ఈ గ్లాసెస్ కనెక్ట్ అయిపోతాయి.

అద్భుతమైన ఫీచర్లు:

ఒక్కసారి ఫోన్‌తో కనెక్ట్ అయ్యాక.. ఈ యాప్ ద్వారా గ్లాసెస్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. అలాగే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇన్‌స్టాల్ చేయడం, విభిన్న ఫీచర్లను ఆన్ లేదా ఆఫ్ చేయడం వంటివి నేరుగా ఫోన్ నుంచే మేనేజ్ చేయవచ్చు. అంతేకాదు.. గ్లాసెస్‌తో తీసిన ఫొటోలు, వీడియోలను నేరుగా ఫోన్‌లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు.

ఒకవేళ గ్లాసెస్ ఎక్కడైనా మర్చిపోతే వెతకడానికి ‘ఫైండ్ మై గ్లాసెస్’ అనే ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఈ సరికొత్త డివైజ్ One UI XR సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తుందని సమాచారం. జులై 22న లండన్‌లో జరగబోయే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో శాంసంగ్ వీటిని అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉంది.

Also Read: ఇక DSLR పని ఖతం.. ఏకంగా 200 మెగాపిక్సల్ కెమెరాతో వస్తోన్న వివో కొత్త ఫోన్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×