E-Paper
Advertisement

రూ.5 వేల బడ్జెట్‌లో శాంసంగ్ నెక్ట్స్ జనరేషన్ ఫిట్‌నెస్ ట్రాకర్.. లీకైన వివరాలు!

రూ.5 వేల బడ్జెట్‌లో శాంసంగ్ నెక్ట్స్ జనరేషన్ ఫిట్‌నెస్ ట్రాకర్.. లీకైన వివరాలు!
Advertisement

Samsung Galaxy Fit 4: టెక్ దిగ్గజం శాంసంగ్ తమ పాపులర్ ఫిట్‌నెస్ ట్రాకర్ సిరీస్‌లో తదుపరి మోడల్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. 2024 ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చినGalaxy Fit 3కి మంచి ఆదరణ లభించడంతో.. ఇప్పుడు అందరి కళ్లు Galaxy Fit 4పై పడ్డాయి. మొదట్లో ఈ కొత్త వేరబుల్‌ను జులై లేదా ఆగస్టులో జరిగే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లతో పాటు లాంచ్ చేస్తారని అందరూ భావించారు. కానీ తాజా నివేదికల ప్రకారం శాంసంగ్ ప్లాన్స్ వేరేలా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ ఏడాది చివర్లోనే గ్రాండ్ ఎంట్రీ:

తాజా సమాచారం ప్రకారం.. గెలాక్సీ ఫిట్ 4 ఈ జులై ఈవెంట్‌లో కాకుండా, ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. శాంసంగ్ ప్రస్తుతం ఈ ఫిట్‌నెస్ బ్యాండ్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉందని, దీనిని సెప్టెంబర్ నెలలో అధికారికంగా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోందని ప్రముఖ టెక్ వెబ్‌సైట్ ఒకటి వెల్లడించింది. రాబోయే గెలాక్సీ S26 FE స్మార్ట్‌ఫోన్, గెలాక్సీ ట్యాబ్ S12 సిరీస్‌లతో పాటే ఈ ఫిట్‌నెస్ ట్రాకర్‌ను కూడా ఒకే వేదికపై పరిచయం చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

Advertisement

Also Read: అదిరిపోయే లుక్స్.. అల్టిమేట్ ఫీచర్స్.. Huawei Nova 16 Pro వచ్చేసింది.. ధర ఎంతంటే?

పాత మోడల్ సక్సెస్:

శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఫిట్ 4 గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే గత మోడల్ అయిన గెలాక్సీ ఫిట్ 3ని 2024 ఫిబ్రవరిలో ఇండియాలో లాంచ్ చేశారు. ఒకవేళ కొత్త ఫిట్ 4 కనుక సెప్టెంబర్‌లోనే వస్తే.. శాంసంగ్ తమ పాత లాంచ్ టైమ్‌లైన్‌ను మార్చుకున్నట్టే అవుతుంది. ఇక ధర విషయానికి వస్తే.. గెలాక్సీ ఫిట్ 3 ప్రస్తుతం భారతదేశంలో రూ.4,999కి లభిస్తోంది. ఇది గ్రే, సిల్వర్, పింక్ గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంది.

ఫీచర్లు ఎలా ఉండొచ్చు?

Advertisement

గెలాక్సీ ఫిట్ 4 ఫీచర్లు ఇంకా పూర్తిగా బయటకు రానప్పటికీ.. ఇది పాత మోడల్ లాగే RTOS ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే అవకాశం ఉంది. అంటే.. ఇది పూర్తి స్థాయి స్మార్ట్‌వాచ్ లా కాకుండా, లైట్‌వెయిట్ ఫిట్‌నెస్ ట్రాకర్‌గానే యూజర్లను అలరించనుంది. ఫిట్ 3 మోడల్‌లో 1.6 ఇంచుల డిస్‌ప్లే, హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ (SpO2), స్లీప్ కోచ్, వందకు పైగా వర్కవుట్ మోడ్స్ ఉన్నాయి. రాబోయే కొత్త మోడల్‌లో వీటికి మరికొన్ని అప్‌గ్రేడెడ్ హెల్త్ ఫీచర్లను జోడించే అవకాశం ఉంది.

Also Read: స్మార్ట్‌వాచ్ కొనేముందు చాలామంది చేసే తప్పు ఇదే.. ఈ ఒక్క తేడా తెలుసుకోకపోతే మనీ వేస్ట్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×