E-Paper
Advertisement

Samsung Galaxy F70e 5G: రూ.13 వేలకే శాంసంగ్ 5G ఫోన్.. లెదర్ ఫినిష్ లుక్‌తో గెలాక్సీ F70e భారత్‌లో లాంచ్!

Samsung Galaxy F70e 5G: రూ.13 వేలకే శాంసంగ్ 5G ఫోన్.. లెదర్ ఫినిష్ లుక్‌తో గెలాక్సీ F70e భారత్‌లో లాంచ్!
Advertisement

Samsung Galaxy F70e 5G: తక్కువ బడ్జెట్‌లోనే.. బెస్ట్ ఫీచర్లు కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడం అంత కష్టమేమీ కాదని ప్రతిసారీ నిరూపిస్తూనే ఉంది ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్. ఈ క్రమంలో తన పాపులర్ F సిరీస్‌లో భాగంగా Galaxy F70e 5G పేరుతో సరికొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. తక్కువ ధరలో ప్రీమియం లుక్ కోసం వెనుక వైపు లెదర్ ఫినిష్ ప్యానెల్‌తో ఈ ఫోన్ చూడటానికి చాలా క్లాసీగా కనిపిస్తోంది.

ఆరేళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్స్..

ఈ శాంసంగ్ గెలాక్సీ F70e 5G ఫోన్ ప్రత్యేకత ఏంటంటే.. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో వస్తోంది. సాధారణంగా బడ్జెట్ ఫోన్లకు రెండేళ్లు అప్‌డేట్స్ ఇస్తారు. కానీ శాంసంగ్ ఇక్కడ చరిత్ర సృష్టించిందనే చెప్పాలి. ఏకంగా 6 ఏళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్స్, మరో 6 ఏళ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని హామీ ఇస్తోంది. అంటే.. ఒక్కసారి ఫోన్ కొంటే ఆరేళ్ల పాటు కొత్త సాఫ్ట్‌వేర్‌తో ఫోన్ మెరుగ్గా పని చేస్తుందన్నమాట.

Advertisement

Also Read: రూ.999కే బోట్ ప్రీమియం నెక్‌బ్యాండ్.. అమెజాన్ లిమిటెడ్ పీరియడ్ డీల్‌ను అస్సలు మిస్ అవ్వకండి!

అద్భుతమైన కెమెరా సెటప్..

6.7 అంగుళాల పెద్ద స్క్రీన్, దానికి తోడు 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో వీడియోలు చూడటం, స్క్రోలింగ్ చేయడం చాలా స్మూత్‌గా ఉంటుంది. ఈ ఫోన్‌లో వాడిన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ గేమింగ్‌కు కూడా బాగానే సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఫోన్ వెనుక వైపు 50MP మెయిన్ కెమెరా, సెల్ఫీల కోసం 8MP కెమెరాను అమర్చారు. ఫొటోలు ఎక్కువగా తీసుకునే వారికి ఇది మంచి ఛాయిస్ అవుతుంది.

ధర ఎంతంటే?

Advertisement

ఇకపోతే ఛార్జింగ్ విషయంలో ఎలాంటి టెన్షన్ అక్కర్లేకుండా 6000mAh భారీ బ్యాటరీని దీనిలో అమర్చారు. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ బరువు కేవలం 199 గ్రాములు మాత్రమే ఉండటం విశేషం. 4GB+128GB మోడల్ ధర రూ.12,999గా, 6GB+128GB మోడల్ ధర రూ.14,999గా ఉంది. ఫిబ్రవరి 17 నుంచి ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ స్టోర్లలో ఇవి అందుబాటులోకి రానున్నాయి.

Also Read: శాంసంగ్ నుంచి ఐఫోన్ వరకు.. ఈ నెలలో సెన్సేషన్ క్రియేట్ చేయనున్న కొత్త ఫోన్స్!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×