E-Paper
Advertisement

శాంసంగ్ ఫ్యాన్స్‌కు గోల్డెన్ ఛాన్స్.. భారీగా తగ్గిన Galaxy F17 5G ధర, ఆ ఫీచర్లు, ఈ ప్రైస్.. వదులుకోవద్దు!

శాంసంగ్ ఫ్యాన్స్‌కు గోల్డెన్ ఛాన్స్.. భారీగా తగ్గిన Galaxy F17 5G ధర, ఆ ఫీచర్లు, ఈ ప్రైస్.. వదులుకోవద్దు!
Advertisement

Galaxy f17 5G Price Drop: తక్కువ బడ్జెట్‌లో మంచి బ్రాండెడ్ 5G ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ప్రముఖ శాంం‌సంగ్ సంస్థ మీకొక క్రేజీ ఆఫర్‌ను తీసుకొచ్చింది. మధ్యతరగతి వాళ్లు కూడా కొనగలిగేలా Samsung Galaxy f17 5G ఫోన్ ధర ఇప్పుడు అమెజాన్‌లో భారీగా దిగి వచ్చింది. లాంచ్ అయినప్పుడు ఉన్న ధర కంటే ఇప్పుడు చాలా తక్కువకే లభిస్తుండటంతో.. కొత్త ఫోన్ తీసుకోవాలనే వారికి ఈ ఛాన్స్ బాగా కలిసొస్తుంది. ఫీచర్ల పరంగా చూసుకుంటే.. ఈ హ్యాండ్‌సెట్‌ను రఫ్ అండ్ టఫ్ వాడకానికి కళ్లుమూసుకుని కొనుగోలు చేయొచ్చు.

ఎంత ధర తగ్గిందంటే?

ఈ Samsung Galaxy f17 5G మార్కెట్లోకి వచ్చినప్పుడు దీని ధర రూ.19,000 పైనే ఉండేది. కానీ ఇప్పుడు అమెజాన్ డీల్‌లో భాగంగా ఇది రూ.13,000 లోపే అందుబాటులోకి వచ్చింది. దాదాపు రూ.6,000 తగ్గింపు లభించింది అన్నమాట. కేవలం ఈ ప్రైస్ కట్ మాత్రమే కాకుండా.. SBI, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తే.. మరో రూ.1,000 నుండి రూ.1,500 వరకు అదనపు డిస్కౌంట్ పొందొచ్చు. లేదంటే మీ దగ్గర ఉన్న పాత ఫోన్ కండిషన్ బాగుంటే.. ఎక్స్ఛేంజ్ బోనస్ కింద మరికొంత నగదు ఆదా చేసుకోవచ్చు. మొత్తానికి అన్ని ఆఫర్లు కలిపితే ఈ 5G ఫోన్ డెడ్ చీప్ ధరకే సొంతం చేసుకోవచ్చు.

కలర్ ఆప్షన్స్ ఇవే:

Advertisement

శాంసంగ్ అంటేనే స్క్రీన్ క్వాలిటీకి మారుపేరు. ఈ ఫోన్‌లో 6.65 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు. దీనివల్ల వీడియోలు చూసినా, ఫొటోలు చూసినా చాలా క్లారిటీగా, కలర్ ఫుల్‌గా కనిపిస్తాయి. అలాగే దీనిలో ఉన్న 90Hz రిఫ్రెష్ రేట్ వల్ల ఫోన్ వాడేటప్పుడు చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇక దీని డిజైన్ విషయానికి వస్తే.. ఫోన్ చాలా స్లిమ్‌గా ఉండి చేతిలో పట్టుకుంటే మంచి గ్రిప్ ఇస్తుంది. వైలెట్ పాప్, నియో బ్లాక్ వంటి కలర్స్ ఈ ఫోన్‌కు మరింత అందాన్ని ఇచ్చాయి.

మెరుగైన పనితీరు:

ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా ఉండాలంటే మంచి ప్రాసెసర్ ఉండాలి. ఈ గెలాక్సీ F17 5Gలో ఎగ్జినోస్ 1330 చిప్‌సెట్‌ని వాడారు. ఇది రోజువారీ వాడకానికే కాదు.. మల్టీ టాస్కింగ్‌కు కూడా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు 5G నెట్‌వర్క్ హవా నడుస్తోంది కాబట్టి.. హైస్పీడ్ ఇంటర్నెట్ వాడుకోవడానికి ఇది ఫర్ఫెక్ట్ ఛాయిస్. RAM మేనేజ్‌మెంట్ బాగుండటం వల్ల గేమ్స్ ఆడేటప్పుడు కూడా పెద్దగా ఇబ్బంది అనిపించదు. ఈ బడ్జెట్‌లో ఒక నమ్మకమైన 5G ఫోన్ కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.

Advertisement

Also Read: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టాప్-5 రియల్‌మీ మొబైల్స్.. వీటి ధరలు తెలిస్తే మీరూ కొనేస్తారు!

50 మెగాపిక్సల్ కెమెరా:

అలాగే Galaxy f17 5Gలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను ఇచ్చారు. వెలుతురు బాగున్నప్పుడు తీసే ఫొటోలు అయితే ప్రొఫెషనల్ కెమెరాలో తీసినట్టుగా చాలా నేచురల్ గా వస్తాయి. ఇక సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలకు సెట్ అవుతుంది. అలాగే, ఫోన్ స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ వాడారు. దీనివల్ల పోన్ అనుకోకుండా కింద పడినా ఏమీకాదని కంపెనీ చెబుతోంది.

బ్యాటరీ బ్యాకప్ ఎంతంటే?

చాలామందికి ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందేమో అన్న భయం ఉంటుంది. కానీ ఈ Galaxy f17 5Gలో 5000mAh బ్యాటరీ ఉంది. పైగా 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల ఫోన్ త్వరగానే ఛార్జ్ అవుతుంది. ఆఫీస్ పనుల్లో ఉన్నా లేదా వీడియోలు చూస్తున్నా ఛార్జింగ్ గురించి బెంగ పడక్కర్లేదు. మొత్తానికి తక్కువ బడ్జెట్‌లో బ్రాండెడ్ శాంసంగ్ ఫోన్ కావాలంటే మాత్రం అమెజాన్‌లో ఈ డీల్‌ని సద్వినియోగం చేసుకోవచ్చు.

Also Read: యాపిల్ లవర్స్‌కు బిగ్ సర్ప్రైజ్.. అదిరిపోయే డిజైన్‌తో ప్రైడ్ ఎడిషన్ బ్యాండ్, ఆ 11 రంగుల ప్రత్యేకత ఏమిటంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×